RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78516066

సార్వభౌమ పసిడి బాండ్ల పథకం

అక్టోబర్ 06, 2017

సార్వభౌమ పసిడి బాండ్ల పథకం

భారత పభుత్వం, రిజర్వ్ బ్యాంక్ తో చర్చించిన మీదట, సార్వభౌమ పసిడి బాండ్లను జారీ చేయాలని నిర్ణయించింది. బాండ్ల దరఖాస్తులను అక్టోబర్ 09, 2017 వ తేదీ నుండి డిసెంబర్ 27, 2017 తేదీ వరకు వారాల పద్ధతిలో స్వీకరిస్తారు. ఒక వారంలో దాఖలైన దరఖాస్తులకు తదుపరి వారం సోమవారం రోజున బాండ్లు జారీ చేస్తారు. ఈ బాండ్లను బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అధీకృత పోస్టాఫీసులు మఱియు గుర్తించిన స్టాక్ ఎక్స్చేంజీలు, అనగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అఫ్ ఇండియా లిమిటెడ్ మరియు బోంబే స్టాక్ ఎక్స్చేంజి లద్వారా విక్రయిస్తారు. బాండ్ల ముఖ్యాంశాలు క్రిందివిధంగా ఉన్నాయి.

క్రమ సంఖ్య జాబితా వివరాలు
1. ప్రోడక్ట్ పేరు సార్వభౌమ పసిడి బాండు
2. జారీచేయడం భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా జారీ చేస్తుంది
3. అర్హత ఈ బాండ్లను, భారతదేశంలో నివసించే ఏ వ్యక్తి (రెసిడెంట్ ఇండియన్) అయినా అనగా వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్ట్ లు, యూనివర్సిటీలు మఱియు దాతృత్వ సంస్థలు పొందవచ్చు.
4. డినామినేషన్ (గుణిజము) బాండ్ల ను ఒక గ్రాము బంగారం యూనిట్లగా వాటికి గుణిజములుగా వర్గీకరిస్తారు.
5. తిరిగి నగదు రూపంలో మార్చుకోవడం (టెనర్) బాండ్లను ఎనిమిదేళ్ళ కాలం గడిచాక నగదుగా మార్చుకోవచ్చు. ముందస్తుగానే మర్చుకోదలచినట్లయితే ఐదవ సంవత్సరం నుండి వడ్డీ చెల్లించే తేదిలలో మార్చుకునే అవకాశం ఉన్నది.
6. కనిష్ట సైజు పెట్టుబడి కనిష్టంగా ఒక గ్రాముకు పెట్టవచ్చు
7. గరిష్ట సైజు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రకటన ప్రకారంగా ఒక ఆర్దిక సంవత్సర కాలానికి (ఏప్రిల్-మార్చ్), గరిష్టంగా ఒక వ్యక్తికి లేక అవిభాజ్య కుటుంబానికి నాలుగు (4) కిలోల వరకు; ట్రస్ట్ మరియు అటువంటి ఎంటిటీ లకు ఇరవై (20) కిలోల వరకు. ఇందుకుగాను సొంత (సెల్ఫ్) డిక్లరేషన్ ను పొందుతారు. ఈ సీలింగ్ లోకి ప్రభుత్వ తొలి జారీప్రక్రియ నందు వివిధ తడవలలో (ట్రాన్చలలో) సబ్ స్క్రైబ్ చేయబడిన అన్ని బాండ్లు మరియు సెకండరీ మార్కెట్లో కొన్నవి కలుస్తాయి.
8. జాయింట్ హోల్డింగ్ అయితే ఒకవేళ జాయింట్ హోల్డింగ్ అయితే, పెట్టుబడి గరిష్ట పరిమతి అయిన నాలుగు కిలోలు మొదటి దరఖాస్తు దారునికే వర్తిస్తుంది.
9. జారీ ధర బాండ్ల ధరను, సబ్ స్క్రిప్షన్ కాలానికి అంతక్రితంవారం ఇండియన్ బులియన్ మార్కెట్ మరియు జ్యూయలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ఆవారం చివరి మూడు పనిదినాల వరకు నిర్ధారించిన 999 స్వచ్ఛత కల్గిన బంగారం యొక్క సాధారణ సగటు ముగింపు ప్రకటితధర ఆధారంగా, భారత రూపాయల్లో నిర్ణయిస్తారు. ఐతే, ఆన్‌లైన్లో దరఖాస్తు చేసి, చెల్లింపులను డిజిటల్‌ పద్ధతిలో చేసేవారికి జారీ ధర గ్రాముకు రూ.50 మేర తగ్గుతుంది.
10. చెల్లింపు విధానం చెల్లింపు భారతీయ రూపాయల్లో నగదు ద్వారా (గరిష్టంగా 20,000 రూపాయల వరకు) లేదా డిమాండ్ డ్రాఫ్ట్ లేదా చెక్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు.
11. జారీ రూపం ఈ పసిడి బాండ్లు భారత ప్రభుత్వ సెక్యూరిటీస్ చట్టం, 2006 కు అనుగుణంగా స్టాక్ రూపంలో జారీ చేస్తారు. ఇన్వెస్టర్లకు హోల్డింగ్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఈ బాండ్లు డీ-మ్యాట్ రూపంలోకి మార్చుకోవడానిక్ అర్హత కలిగి ఉన్నాయి.
12. విమోచన ధర బాండ్ల విమోచనా విలువను భారతీయ రూపాయల్లో IBJA ప్రచురించే 999 స్వచ్ఛత కల్గిన బంగారం యొక్క క్రితం మూడు పనిదినాల సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా నిర్ణయిస్తారు.
13. విక్రయాల ఛానల్ ఈ బాండ్లను బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అధీకృత పోస్టాఫీసులు మఱియు గుర్తించిన స్టాక్ ఎక్స్చేంజీలు, అనగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అఫ్ ఇండియా లిమిటెడ్ మరియు బోంబే స్టాక్ ఎక్స్చేంజి ద్వారా ప్రత్యక్షంగా లేదా ఏజెంట్ల ద్వారా విక్రయిస్తారు.
14. వడ్డీ రేటు ఈ బాండ్ల నామినల్ విలువపై ఏడాదికి 2.50 శాతం (స్థిరమైన రేటు) వడ్డీ చెల్లిస్తారు. వడ్డీని ఆరు నెలల కాలానికి చెల్లిస్తారు.
15. పూచీ గా ఈ పసిడి బాండ్లను రుణాల కోసం పూచీగా పెట్టుకోవచ్చు. ఆర్బీఐ ఎప్పటికప్పుడు సాధారణ పసిడి రుణాలకు జారీ చెసే ఆదేశాలకు అనుగుణంగా రుణం, విలువ నిష్పత్తి ఉంటుంది.
16. నో-యువర్-కస్టమర్ (KYC) కు కావలసిన డాక్యుమెంట్లు వస్తురూపంలో వున్న బంగారం కొనుగోలుకు ఎలాంటి నియమాలు వర్తిస్తాయో అవే నో-యువర్-కస్టమర్ (KYC) నియమాలు ఇచట వర్తిస్తాయి. వోటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు/ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్ కార్డు)కార్డు లేదా TAN / పాస్ పోర్ట్ పత్రాలు అవసరం.
17. పన్ను వ్యవహారంలో విధానం పసిడి బాండ్ల కు వచ్చే వడ్డీపై ఆదాయ పన్నుచట్టం, 1961 (43 అఫ్ 1961) ప్రకారం పన్ను విధిస్తారు. వ్యక్తులకు పసిడి బాండ్ల విమోచన వల్ల లభించే క్యాపిటల్ గెయిన్స్ పన్నుపై మినహాయింపు ఉంది. ఒకవేళ బాండ్లను బదిలీ చేస్తే, ఇండెక్సేషను లాభాలను ఆ వ్యక్తి దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ కు బదలాయిస్తారు.
18. బాండ్ల ట్రేడబిలిటీ ఈ బాండ్లను, జారీ చేసిన ఒక పక్షం లోపు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటిఫై చేసిన తేదీ నుండి, స్టాక్ ఎక్స్చేంజిలలో ట్రేడింగ్ చేయవచ్చు.
19. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (SLR) కి అర్హత ఈ బాండ్లు SLR ఉద్దేశ్యాలకు అర్హమైనవి.
20. డిస్ట్రిబ్యూషన్ పై కమీషన్ స్వీకరణ కార్యాలయాలకు అందిన మొత్తం సబ్ స్క్రిప్షన్ పై ఒక శాతం రేటు చొప్పున డిస్ట్రిబ్యూషన్ కమీషన్ చెల్లించడం జరుగుతుంది. స్వీకరణ కార్యాలయాలు ఈ విధంగా అందిన కమీషన్ నుంచి కనీసం 50 శాతాన్ని ఎవరిద్వారా అయితే బిజినెస్ పొందినవో ఆ బిజినెస్ ఏజెంట్లు లేదా సబ్ ఏజెంట్లతో పంచుకుంటాయి.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజరు

ప్రెస్ రిలీజ్: 2017-2018/957.

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?