<font face="Mangal" size="3px">సార్వభౌమ పసిడి బాండ్ల పధకం</font> - ఆర్బిఐ - Reserve Bank of India
సార్వభౌమ పసిడి బాండ్ల పధకం
ఆర్.బి.ఐ/2017-18/71 ది. అక్టోబర్ 06, 2017 ద చైర్మన్ / మేనేజింగ్ డైరెక్టర్ డియర్ సర్/మేడమ్, సార్వభౌమ పసిడి బాండ్ల పధకం భారత పభుత్వo అక్టోబర్ 06, 2017 న జారీ చేసిన నోటిఫికేషన్ నం F.No. 4(25)-B/(W&M)/2017 ద్వారా సార్వభౌమ పసిడి బాండ్ల పధకం ను ప్రకటించారు. ఈ పధకం క్రింద బాండ్లను వారాల పద్ధతిలో జారీచేస్తారు మరియు అక్టోబర్ 09, 2017 వ తేదీ నుండి మొదలిడి ప్రతి సోమవారం నుండి బుధవారం వరకు బాండ్ల దరఖాస్తులను స్వీకరిస్తారు. భారత ప్రభుత్వం ముందస్తు నోటీసుతో ఈ పధకాన్ని నిర్ణీత కాలానికన్నా ముందుగానే నిలిపివేయవచ్చు. ఈ బాండ్ల జారీకి అవసరమైన నియమనిబంధనలు ఈ క్రింది విధంగా ఉంటాయి. 1. పెట్టుబడి పెట్టడానికి అర్హత: ఈ పధకం కింద జారీ చేసే బాండ్లను భారతదేశంలో నివసించే ఏ వ్యక్తి అయినా తన వ్యక్తిగత హోదాలో కానీ, లేదా మైనర్ పిల్లల తరపున కానీ, లేదా ఇతర వ్యక్తులతో కలిసి జాయింట్ గా కానీ పొందవచ్చు. ఏదైనా ట్రస్ట్, దాతృత్వ సంస్థ మరియు యూనివర్సిటీలు కూడా వీటిని పొందవచ్చు. ‘భారత దేశ నివాసి’ అన్న పదం విదేశీ మారకద్రవ్య నిర్వహణా చట్టం, 1999 లోని సెక్షన్ 2 (v) రెడ్ విత్ సెక్షన్ 2 (u) కింద నిర్వచించబడి ఉంటుంది. 2. సెక్యూరిటీ రూపం ఈ బాండ్లను భారత ప్రభుత్వ సెక్యూరిటీస్ చట్టం, 2006 కు అనుగుణంగా స్టాక్ రూపంలో జారీ చేస్తారు. ఇన్వెస్టర్లకు హోల్డింగ్ సర్టిఫికేట్ (Form C) జారీ చేస్తారు. ఈ బాండ్లను డీ-మ్యాట్ రూపంలోకిమార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 3. జారీ చేసే తేదీ ఒక వారంలో దాఖలైన దరఖాస్తులకు తదుపరి వారం మొదటి పనిదినం రోజున బాండ్లు జారీ చేస్తారు 4. జారీ చేసిన క్యాలెండర్ అక్టోబర్ 2017 నెల నుండి డిసెంబర్ 2017 నెల వరకు ప్రతివారం, సార్వభౌమ పసిడి బాండ్ల ను ఈ కింది పేర్కొన్న క్యాలెండర్ ప్రకారం జారీ చేయడం జరుగుతుంది:
5. డినామినేషన్ (గుణిజము) బాండ్ల ను ఒక గ్రాము బంగారం యూనిట్లగా వాటికి గుణిజములుగా వర్గీకరిస్తారు. పెట్టుబడి కనిష్టంగా ఒక గ్రాముకు పెట్టవచ్చు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రకటన ప్రకారంగా ఒక ఆర్దిక సంవత్సర కాలానికి (ఏప్రిల్-మార్చ్), గరిష్టంగా ఒక వ్యక్తికి లేక అవిభాజ్య కుటుంబానికి నాలుగు (4) కిలోల వరకు; ట్రస్ట్ మరియు అటువంటి ఎంటిటీ లకు ఇరవై (20) కిలోల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ సీలింగ్ లోకి ప్రభుత్వ తొలి జారీప్రక్రియ నందు వివిధ తడవలలో (ట్రాన్చలలో) సబ్ స్క్రైబ్ చేయబడిన అన్ని బాండ్లు మరియు సెకండరీ మార్కెట్లో కొన్నవి కలుస్తాయి. ఐతే బ్యాంకులు, ఇతర ఆర్దిక సంస్థలకు పూచీగా ఉంచిన బాండ్లు ఈ సీలింగ్ పరిగణనలోకి రావు. 6. జారీ ధర బాండ్ల ధరను, సబ్ స్క్రిప్షన్ కాలానికి అంతక్రితంవారం ఇండియన్ బులియన్ మార్కెట్ మరియు జ్యూయలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ఆవారం చివరి మూడు పనిదినాల వరకు నిర్ధారించిన 999 స్వచ్ఛత కల్గిన బంగారం యొక్క సాధారణ సగటు ముగింపు ప్రకటితధర ఆధారంగా, భారత రూపాయల్లో నిర్ణయిస్తారు. ఐతే, ఆన్‌లైన్లో దరఖాస్తు చేసి, చెల్లింపులను డిజిటల్ పద్ధతిలో చేసేవారికి జారీ ధర గ్రాముకు రూ.50 మేర తగ్గుతుంది. 7. వడ్డీ ఈ బాండ్ల నామినల్ విలువపై ఏడాదికి 2.50 శాతం (స్థిరమైన రేటు) వడ్డీ చెల్లిస్తారు. వడ్డీని ఆరు నెలల కాలానికి చెల్లిస్తారు. చివరి వడ్డీని గడువుముగిసిన తర్వాత అసలుతో కలిపి చెల్లిస్తారు. 8. స్వీకరణ కార్యాలయాలు షెడ్యూల్డ్ కమర్షియల్ (RRBలు కాకుండా) బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHICL), అధీకృత పోస్టాఫీసులు మఱియు గుర్తించిన స్టాక్ ఎక్స్చేంజీలు, అనగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అఫ్ ఇండియా లిమిటెడ్ మరియు బోంబే స్టాక్ ఎక్స్చేంజి లు ఈ బాండ్ల దరఖాస్తులను ప్రత్యక్షంగా లేదా తమ ఏజెంట్ల ద్వారా స్వీకరించడానికి అధికారం కలిగి ఉన్నాయి. 9. చెల్లింపు విధానం చెల్లింపు భారతీయ రూపాయల్లో నగదు ద్వారా (గరిష్టంగా 20,000 రూపాయల వరకు) లేదా డిమాండ్ డ్రాఫ్ట్ లేదా చెక్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్ లేదా చెక్కుల విషయంలో వాటిని స్వీకరణ కార్యాలయాల పేరిట తీసుకోవాలి. 10. తిరిగి నగదు రూపం లోకి మార్చుకోవడం (రెడెంప్షణ్) బాండ్లను జారీ చేసిన తేదీ నుండి ఎనిమిదేళ్ళు గడిచిన తర్వాత వాటిని నగదుగా మార్చుకోవచ్చు. ఒకవేళ ముందస్తు గానే మర్చుకోదలచినట్లయితే, జారీ చేసిన ఐదవ సంవత్సరం నుంచి వాటిని మార్చుకోవచ్చు. వడ్డీ చెల్లించే తేదిలలో వాటిని మార్చుకునే అవకాశo ఉన్నది. బాండ్ల విమోచనా విలువను భారతీయ రూపాయల్లో, తిరిగి చెల్లించే తేదీకు ముందు, IBJA ప్రచురించే 999 స్వచ్ఛత కల్గిన బంగారం యొక్క క్రితం మూడు పనిదినాల, సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా నిర్ణయిస్తారు. 11. తిరిగి చెల్లించే విధానం రిజర్వ్ బ్యాంక్/ డిపాజిటరీ కార్యాలయాలు, పెట్టుబడిదారులకు పసిడి బాండ్ల కాలపరిమితి ముగిసే ఒక నెల ముందు ఆ విషయాన్ని తెలియపరచాలి. 12. చట్ట బద్ద ద్రవ్య నిష్పత్తి (SLR) కు అర్హత ప్లేడ్జ్ / హైపోతికేషణ్ / లీన్ పద్ధతుల ద్వారా పొందిన (ఇన్వొకింగ్) బాండ్లు మాత్రమే బ్యాంకుల చట్ట బద్ద ద్రవ్య నిష్పత్తి (SLR) కి అర్హమైనవి. 13. బాండ్ల పై ఋణం ఈ పసిడి బాండ్లను రుణాల కోసం పూచీగా పెట్టుకోవచ్చు. ఆర్బీఐ ఎప్పటికప్పుడు సాధారణ పసిడి రుణాలకు జారీ చెసే ఆదేశాలకు అనుగుణంగా రుణం, విలువ నిష్పత్తి ఉంటుంది. అధీకృత బ్యాంకులు తమ డిపాజిటరీలలో ఈ పసిడి బాండ్లపై అవి పూచికట్టులో ఉన్నట్లు గుర్తు పెడతాయి. 14. పన్ను వ్యవహారంలో విధానం పసిడి బాండ్ల కు వచ్చే వడ్డీపై ఆదాయ పన్నుచట్టం, 1961 నిబంధనల ప్రకారం పన్ను విధిస్తారు. వ్యక్తులకు పసిడి బాండ్ల విమోచన వల్ల లభించే క్యాపిటల్ గెయిన్స్ పన్నుపై మినహాయింపు ఉంది. ఒకవేళ బాండ్లను బదిలీ చేస్తే, ఇండెక్సేషను లాభాలను ఆ వ్యక్తి దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ కు బదలాయిస్తారు. 15. దరఖాస్తులు ఈ బాండ్ల కొరకు సబ్ స్క్రిప్షన్ ను నిర్దిష్ట ఫామ్ (Form ‘A’) లేదా అదే విధంగా ఉన్న ఫామ్ లో ఎన్ని గ్రాముల బంగారం కావాలో స్పష్టంగా పేర్కొంటూ, దరఖాస్తుదారు పూర్తి పేరు, చిరునామా తో దరఖాస్తు చేసుకోవాలి. స్వీకరణ కార్యాలయం ఫాం ( ‘Form’B’) రూపం లో తమ దరఖాస్తు అందినట్లు రసీదు అందజేస్తుంది. 16. నామినేషన్ నామినేషన్ మరియు దాని రద్దు ప్రభుత్వ సెక్యూరిటీస్ చట్టం 2006 (38 ఆఫ్ 2006) మరియు డిసెంబర్ 01, 2007 న గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ప్రభుత్వ సెక్యూరిటీల నిబంధనలు, 2007 లోని పార్ట్ III, సెక్షన్ 4 లో సూచించిన విధంగా Form ‘D’ మరియు Form ‘E’ రూపంలో ఉండాలి. 17. బదిలితత్వం ఈ బాండ్లను ప్రభుత్వ సెక్యూరిటీస్ చట్టం 2006 (38 ఆఫ్ 2006) నిర్దేశించిన అంశాలను అనుసరించి, మరియు భారత ప్రభుత్వo డిసెంబర్ 01, 2007 న విడుదల చేసిన గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ప్రభుత్వ సెక్యూరిటీల నిబంధనలు, 2007 లోని పార్ట్ III, సెక్షన్ 4 లో సూచించిన విధంగా Form ‘F’ లో పేర్కొన్న విధంగా రాసి ఇవ్వడం ద్వారా బదిలీ చేయవచ్చు. 18. బాండ్ల ట్రేడబిలిటీ పెట్టుబడిదారు డీమాట్ అకౌంట్ లోకి జమ అయిన తేదీ నుండి, ఈ బాండ్లను ట్రేడింగ్ చేయవచ్చు. 19. డిస్ట్రిబ్యూషన్ పై కమీషన్ స్వీకరణ కార్యాలయాలకు అందిన మొత్తం సబ్ స్క్రిప్షన్ పై వందకు ఒక రూపాయి రేటు చొప్పున డిస్ట్రిబ్యూషన్ కమీషన్ చెల్లించడం జరుగుతుంది. స్వీకరణ కార్యాలయాలు ఈ విధంగా అందిన కమీషన్ నుంచి కనీసం 50 శాతాన్ని ఎవరిద్వారా అయితే బిజినెస్ పొందినవో ఆ బిజినెస్ ఏజెంట్లు లేదా సబ్ ఏజెంట్లతో పంచుకుంటాయి. 20. భారత ప్రభుత్వ ఆర్దిక మంత్రిత్వ శాఖ (ఆర్దిక వ్యవహారాల విభాగం) అక్టోబర్ 08, 2008 తేదీ న జారీ చేసిన F.No.4(13) W&M/2008 నోటిఫికేషన్ లోని అన్ని ఇతర నియమ నిబంధనలూ ఈబాండ్లకు వర్తిస్తాయి. 21. సార్వభౌమ పసిడి బాండ్ల కు సంబంధించిన నిర్వహణాపరమైన మార్గదర్శకాలను అక్టోబర్ 06, 2017 తేదీ న సర్క్యులర్ నం. IDMD.CDD.927/14.04.050/2017-18 ద్వారా జారీ చేయడం జరిగింది. మీ విదేయులు షైనీ సునీల్ జతచేసినది: పైన పేర్కొన్నవి |