<font face="Mangal" size="3">సార్వభౌమ పసిడి బాండ్లు, 2015-16 </font> - ఆర్బిఐ - Reserve Bank of India
సార్వభౌమ పసిడి బాండ్లు, 2015-16
నవంబర్ 24, 2015 సార్వభౌమ పసిడి బాండ్లు, 2015-16 భారత ప్రభుత్వంతో సంప్రదించి, భారతీయ రిజర్వ్ బ్యాంక్, వారి సర్క్యులర్లు, IDMD.CDD.No.939/14.04.050/2015-16 తేదీ అక్టోబర్ 30, 2015, IDMD.CDD.No.968/14.04.050/2015-16 తేదీ నవంబర్ 4, 2015, ద్వారా సార్వభౌమ పసిడి బాండ్లు, 2015-2016, జారీ వివరాలు ప్రకటించింది. మొదటి విడత బాండ్లు, పెట్టుబడికై నవంబర్ 5, 2015 నుండి నవంబర్ 20, 2015 వరకు తెరిచి ఉంచబడ్డాయి. బాండ్లు, నవంబర్ 26 న జారీ చేయబడవలసి ఉంది. బ్యాంకులు, తపాలా కార్యాలయాలచే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. దరఖాస్తుల వివరాలు, రిజర్వ్ బ్యాంక్ E-kuber సిస్టమ్ లో సులభంగా 'అప్‌లోడ్' చేయడానికి వీలుగా (ప్రత్యేకించి, తపాలా కార్యాలయాలు), బాండ్ల జారీ తేదీ, నవంబర్ 26, 2015 బదులుగా నవంబర్ 30, 2015 కు మార్చబడింది. పై సర్క్యులర్ల లోని ఇతర నియమ నిబంధనలలో ఏ మార్పూ లేదు. అనిరుద్ధ డి జాధవ్ పత్రికా ప్రకటన: 2015-2016/1236 |