<font face="Mangal" size="3">సార్వభౌమ పసిడి బాండ్లు 2015-16 – కార్యనిర్వహణ మారĺ - ఆర్బిఐ - Reserve Bank of India
సార్వభౌమ పసిడి బాండ్లు 2015-16 – కార్యనిర్వహణ మార్గదర్శకాలు
RBI/2015-16/222 నవంబర్ 4, 2015 చైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్ అయ్యా/అమ్మా, సార్వభౌమ పసిడి బాండ్లు 2015-16 – కార్యనిర్వహణ మార్గదర్శకాలు దయచేసి, భారత ప్రభుత్వ అధికార ప్రకటన F.No.4(19)-W&M/2014 మరియు రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ IDM.CDD.No.939/14.04.050/ 2015-16 తేదీ అక్టోబర్ 30, 2015, చూడండి. తరుచుగా వచ్చే సందేహాలకు జవాబులు (FAQs) మా వెబ్‌సైట్ www.rbi.org.in లో ఇవ్వబడ్డాయి. ఈ పథకానికి సంబంధించి, కార్యనిర్వహణ మార్గదర్శకాలు, క్రింద సూచించబడ్డాయి: 1. దరఖాస్తు పెట్టుబడికై దరఖాస్తులు, బ్యాంక్ శాఖల్లో సాధారణ పనివేళల్లో నవంబర్ 5, 2015 నుండి నవంబర్ 20, 2015 వరకు తీసుకోబడతాయి. అవసర మైతే, దరఖాస్తుదారులనుంచి అదనపు వివరాలు సేకరించవచ్చు. బ్యాంకులు, దరఖాస్తులు అన్నివిధాలా సంపూర్ణంగా ఉన్నాయని నిర్ధారించుకోవలెను. 2. ఉమ్మడి దరఖాస్తుదారులు, నామినేషన్: పలువురు ఉమ్మడి హక్కుదారులు అనుమతించబడతారు. కావలసిన వివరాలు, వాడుక ప్రకారం, దరఖాస్తుదారులనించి పొందవచ్చు. 3. దరఖాస్తు సొమ్ముపై వడ్డీ: సొమ్ము వసూలు అయిన తేదీనుండి, సెటిల్‌మెంట్ తేదీవరకు (అనగా, చెల్లించిన సొమ్ము వారివద్ద లేని కాలంమేరకు), దరఖాస్తుదారులకు, అమలులో ఉన్న పొదుపు ఖాతా వడ్డీ రేటు ప్రకారం, వడ్డీ చెల్లించబడుతుంది. స్వీకరించిన బ్యాంక్ లో వారి ఖాతా లేని పక్షం లో, ఖాతాదారు సమర్పించిన వివరాల ప్రకారం ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సఫర్ ద్వారా వడ్డీ చెల్లించాలి. 4. దరఖాస్తుల రద్దు: ముగింపు తేదీ, నవంబర్ 20, 2015 వరకు దరఖాస్తు రద్దు చేసుకోవచ్చు. దరఖాస్తు పాక్షికంగా రద్దు చేసుకొనే వీలులేదు. దరఖాస్తు రద్దుచేసుకున్న, బాండ్ల కొనుగొలుకై చేసిన సొమ్ముపై, వడ్డీ చెల్లించనవసరం లేదు. 5. హక్కు నమోదు: ఈ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు గనుక, వీటిపై హక్కు నమోదు, అమలులో ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీల చట్టం, 2006 (Government Securities Act, 2006) లోగల న్యాయ నిబంధనలను/అందులో క్రింద రూపొందించిన నియమాలను, అనుసరించి ఉంటుంది. 6. ప్రాతినిధ్య ఒప్పందాలు: షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, తమతరఫున దరఖాస్తులు సేకరించుటకై, NBFC లు, NSC ప్రతినిధుల సేవలు వినియోగించుకోవచ్చు. దీనికై, బ్యాంకులు వారితో ఒప్పందాలు చేసుకోవచ్చు. 7. రిజర్వ్ బ్యాంక్ ఇ-కుబేర్ వ్యవస్థ: సార్వభౌమ గోల్డ్ బాండ్లు, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల శాఖలు, నిర్దేశిత తపాలా కార్యాలయాల వద్ద కొనుగోలుకై, రిజర్వ్ బ్యాంక్ ఇ-కుబేర్ వ్యవస్థ ద్వారా లభిస్తాయి. ఇ-కుబేర్ వ్యవస్థ, ఇన్‌ఫినెట్ (INFINET), ఇంటర్‌నెట్ (Internet) ద్వారా అందుబాటులో ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించే కార్యాలయాలు, దరఖాస్తుల వివరాలు దీనిలో నమోదు చేయాలి. లేదా మొత్తం సమాచారాన్ని ఒకేసారి 'అప్‌లోడ్' చెయ్యాలి. దరఖాస్తు అందినట్లు తక్షణమే ధృవీకరించబడుతుంది. ఇంతేగాక, స్వీకరించిన కార్యాలయలు, వారి డాటాబేస్ నవీకరించుకోవడానికి (to update) ఒక 'కన్‌ఫర్మేషన్ స్క్రోల్' కూడా పంపబడితుంది. బాండ్లు జారీచేసిన తేదీన అనగా నవంబర్ 26, 2015 న, దరఖాస్తుదారులకు, 'హోల్డింగ్ సర్టిఫికేట్లు' జారీ చేయబడతాయి. స్వీకరించిన కార్యాలయాలు, వీటిని 'డౌన్‌లోడ్' చేసి, ముద్రించుకోవచ్చు. ఇ-మైల్ చిరునామా ఇచ్చిన దరఖాస్తుదారులకు హొల్డింగ్ సర్టిఫికేట్లు, ఇ-మైల్ ద్వారా కూడా పంపబడతాయి. డి-మ్యాట్ ఖాతా వివరాలు ఇచ్చినట్లయితే సెక్యూరిటీలు, వారి డి-మ్యాట్ ఖాతాలకు జమచేయబడతాయి. 8. హోల్డింగ్ సర్టిఫికేట్ల ముద్రణ: హోల్డింగ్ సర్టిఫికేట్లు, A4, 100 GSM పేపర్ పై, రంగుల్లో ముద్రించబడాలి. 9. సేవలు, మరియు తదుపరి చర్యలు: స్వీకరించే కార్యాలయాలు అనగా, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, నిర్దేశిత తపాలా కార్యాలయాలు డిపాజిటర్‌ని తమ సొంత ఖాతాదారుగా భావించి, బాండ్లకు సంబంధించి, సంప్రదింపుకై వివరాలని నవీకరించడం, గడువు తేదీ ముందే నగదుగా మార్చుకోవడానికి చేసిన అభ్యర్థనలను స్వీకరించడం వంటి వ్యవహారాల్లో సేవలందించాలి. స్వీకరించిన ఆఫీసులు, దరఖాస్తులను, బాండ్ల గడువు తీరి, తిరిగి చెల్లించేవరకు భద్రపరచాలి. 10. సంప్రదింపుకై వివరాలు: సందేహాలు/వివరాలకై ఇ-మైల్ (a) సార్వభౌమ పసిడి బాండ్లకు సంబంధించి: ఇ-మైల్ (b) అదాయపు పన్నుకు సంబంధించివివరాలకై; ఇ-మైల్ విధేయులు, |