<font face="mangal" size="3">ప్ర ‌భుత్వ గోల్డ్ బాండ్ లు 2016-17 -- సిరీస్ - III</font> - ఆర్బిఐ - Reserve Bank of India
ప్ర భుత్వ గోల్డ్ బాండ్ లు 2016-17 -- సిరీస్ - III
RBI/2016-17/98 అక్టోబర్ 20, 2016 ద ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డియర్ సర్/మేడమ్, ప్రభుత్వ గోల్డ్ బాండ్ లు 2016-17 -- సిరీస్ - III భారత ప్రభుత్వం అక్టోబర్ 20, 2016న జారీ చేసిన నోటిఫికేషన్ నెం. F.No. 4(16)-W&M/2016 మేరకు ప్రభుత్వ గోల్డ్ బాండ్ లు 2016 సిరీస్-III (‘ది బాండ్స్’) అక్టోబర్ 24, 2016 నుండి నవంబర్ 2, 2016 వరకు సబ్ స్ర్కిప్షన్ కొరకు అందరికీ అందుబాటులో ఉంటాయి. భారత ప్రభుత్వం ముందస్తు నోటీసుతో ఈ పథకాన్ని నిర్ణీత కాలానికన్నా ముందుగానే క్లోజ్ చేయవచ్చు. ఈ బాండ్ల జారీకి అవసరమైన నియమ నిబంధనలు ఈ క్రింది విధంగా ఉంటాయి: 1. ఇన్వెస్ట్ మెంట్ చేయడానికి అర్హత: ఈ పథకం కింద జారీ చేసే బాండ్లను భారతదేశంలో నివసించే ఏ వ్యక్తి అయినా తన వ్యక్తిగత హోదాలో కానీ, లేదా మైనర్ పిల్లల తరపున కానీ, లేదా ఇతర వ్యక్తులతో కలిసి జాయింట్ గా కానీ పొందవచ్చు. ఏదైనా ట్రస్ట్, దాతృత్వ సంస్థ, యూనివర్సిటీ కూడా వీటిని పొందవచ్చు. ‘భారతదేశ నివాసి’ అన్న పదం విదేశీ మారకద్రవ్య నిర్వహణా చట్టం, 1999లోని సెక్షన్ 2 (v) రెడ్ విత్ సెక్షన్ 2 (u) కింద నిర్వచించబడి ఉంటుంది. 2. సెక్యూరిటీ రూపం ఈ బాండ్లను భారత ప్రభుత్వ సెక్యూరిటీస్ చట్టం, 2006కు అనుగుణంగా స్టాక్ రూపంలో జారీ చేస్తారు. ఇన్వెస్టర్లకు హోల్డింగ్ సర్టిఫికేట్ (Form C) జారీ చేస్తారు. ఈ బాండ్లను డీ-మ్యాట్ రూపంలోకి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 3. జారీ చేసే తేదీ నవంబర్ 17, 2016న వీటిని జారీ చేస్తారు. 4. డినామినేషన్ బాండ్లను ఒక గ్రాము బంగారం యూనిట్లుగా మరియు వాటికి గుణిజములుగా వర్గీకరిస్తారు. కనీస కొనుగోలు ఒక గ్రాము బంగారం కాగా గరిష్టంగా ఒక వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సర కాలానికి (ఏప్రిల్-మార్చి) 500 గ్రాములు. 5. జారీ ధర బాండ్ల నామినల్ విలువను సబ్ స్ర్కిప్షన్ కాలానికి ఒక వారం ముందు ఇండియన్ బులియన్ మార్కెట్ మరియు జ్యూవెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ఆ వారానికి (సోమవారం నుండీ శుక్రవారం వరకు) నిర్ధారించిన 999 స్వచ్ఛత కలిగిన బంగారం యొక్క సాధారణ సగటు క్లోజింగ్ ధర ఆధారంగా భారత రూపాయల్లో నిర్ణయిస్తారు. జారీ విలువ నామినల్ విలువకన్నా గ్రాముకు 50 రూపాయలు తక్కువగా ఉంటుంది. 6. వడ్డీ ఈ బాండ్ల నామినల్ విలువపై ఏడాదికి 2.50 శాతం (స్థిరమైన రేటు) వడ్డీని చెల్లిస్తారు. వడ్డీని ఆరు నెలల కాలానికి చెల్లిస్తారు. చివరి వడ్డీని మెచ్యూరిటీ తర్వాత అసలుతో కలిపి చెల్లిస్తారు. 7. స్వీకరణ కార్యాలయాలు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (RRBలు కాకుండా), గుర్తించిన పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SHCIL) మరియు గుర్తించిన స్టాక్ ఎక్స్ చేంజీలు అనగా. జాతీయ స్టాక్ ఎక్స్ చేంజ్ ఆఫ్ ఇండియా లి. మరియు బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ లు ఈ బాండ్ల కొరకు దరఖాస్తులను ప్రత్యక్షంగా లేదా తమ ఏజెంట్ల ద్వారా స్వీకరించడానికి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. 8. చెల్లింపు విధానాలు చెల్లింపులు భారతీయ రూపాయల్లో నగదు ద్వారా (గరిష్టంగా 20,000 రూపాయల వరకు) లేదా డిమాండ్ డ్రాఫ్ట్ లు లేదా చెక్కులు లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్ ల విషయంలో వాటిని స్వీకరణ కార్యాలయాల పేరిట తీసుకోవాలి. 9. తిరిగి నగదు రూపంలోకి మార్చుకోవడం i) బాండ్లను జారీ చేసిన తేదీ నవంబర్ 17, 2016 తర్వాత ఎనిమిదేళ్లు గడిచాక వాటిని నగదుగా మార్చుకోవచ్చు. ఒకవేళ బాండ్లను ముందస్తుగానే మార్చుకోదలచినట్లయితే, జారీ చేసిన ఐదవ సంవత్సరం నుంచి వాటిని మార్చుకోవచ్చు. వడ్డీ చెల్లించే తేదీలలో వాటిని మార్చుకునే అవకాశం ఉంది. ii) బాండ్ల విమోచనా విలువను భారతీయ రూపాయల్లో IBJA ప్రచురించే 999 స్వచ్ఛత కలిగిన బంగారం యొక్క గత వారపు (సోమవారం - శుక్రవారం) సాధారణ సగటు క్లోజింగ్ ధర ఆధారంగా నిర్ణయిస్తారు. iii) స్వీకరణ కార్యాలయం బంగారం బాండ్ల కాల పరిమితి ముగిసే ఒక నెల ముందు ఇన్వెస్టర్లకు ఆ విషయాన్ని తెలియపరచాలి. 10. పునః చెల్లింపు స్వీకరణ కార్యాలయాలు పెట్టుబడిదారులకు బంగారం బాండ్ల కాలపరిమితి ముగిసే ఒక నెల ముందు ఆ విషయాన్ని తెలియపరచాలి. 11. చట్టబద్ధమైన లిక్విడిటీ రేషియో (SLR) కు అర్హత ఈ బాండ్లపై పెట్టుబడులు SLRకు అర్హమైనవి. 12. బాండ్లపై ఋణం ఈ బంగారం బాండ్లను రుణాల కోసం పూచీగా పెట్టుకోవచ్చు. RBI ఎప్పటికప్పుడు సాధారణ బంగారు రుణాలకు జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా రుణం విలువ నిష్పత్తి ఉంటుంది. అధీకృత బ్యాంకులు తమ డిపాజిటరీలలో ఈ బంగారు బాండ్లపై వాటి పూచీకత్తును గుర్తిస్తాయి. 13. పన్నుపై వ్యవహరించే విధానం బాండ్లపై లభించే వడ్డీపై ఆదాయ పన్ను చట్టం, 1961లోని ప్రకారం పన్ను విధిస్తారు. వ్యక్తులకు SGBల విమోచన వల్ల లభించే క్యాపిటల్ గెయిన్స్ పన్నుపై మినహాయింపు ఉంటుంది. ఒకవేళను బాండ్లను ట్రాన్స్ ఫర్ చేస్తే వచ్చే ఇండెక్సేషన్ లాభాలను ఆ వ్యక్తి దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ కు బదిలీ చేస్తారు. 14. దరఖాస్తులు ఈ బాండ్ల కొరకు సబ్ స్ర్కిప్షన్ ను నిర్దిష్ట ఫామ్ (Form ‘A’) లేదా సుమారు అదే విధంగా ఉన్న ఫామ్లో ఎన్ని గ్రాముల బంగారు కావాలో స్పష్టంగా పేర్కొంటూ, దరఖాస్తుదారు పూర్తి పేరు, చిరునామాతో దరఖాస్తు చేసుకోవాలి. స్వీకరణ కార్యాలయం Form ‘B’ రూపంలో తమకు దరఖాస్తు అందినట్లు రిసీప్ట్ అందజేస్తుంది. 15. నామినేషన్ నామినేషన్ మరియు దాని రద్దు భారత సెక్యూరిటీల చట్టం 2006 (38 ఆఫ్ 2006) మరియు డిసెంబర్ 1, 2007న గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ప్రభుత్వ సెక్యూరిటీల నిబంధనలు, 2007లోని పార్ట్ III, సెక్షన్ 4 లో సూచించిన విధంగా Form ‘D’ మరియు Form ‘E’ రూపంలో ఉండాలి. 16. బదిలీతత్వం ఈ బాండ్లను ప్రభుత్వ సెక్యూరిటీల చట్టం 2006(38 ఆఫ్ 2006) నిర్దేశించిన అంశాలను అనుసరించి, మరియు భారత ప్రభుత్వం డిసెంబర్ 1, 2007న విడుదల చేసిన గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ప్రభుత్వ సెక్యూరిటీల నిబంధనలు, 2007లలోని పార్ట్ III, సెక్షన్ 4 లో సూచించిన విధంగా Form ‘F’లో ఏదైనా ఒక ఇన్ స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ ఫర్ ను ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా బదిలీ చేయవచ్చు. 17. బాండ్ల ట్రేడబిలిటీ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సూచించినతేదీల్లో ఈ బాండ్లను ట్రేడింగ్ చేయవచ్చు. 18. డిస్ట్రిబ్యూషన్ పై కమీషన్ స్వీకరణ కార్యాలయాలకు అందిన దరఖాస్తులపై మొత్తం సబ్ స్ర్కిప్షన్ పై వందకు రూపాయి వంతున డిస్ట్రిబ్యూషన్ కమిషన్ చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా అందిన కమిషన్ నుంచి స్వీకరణ కార్యాలయాలు కనీసం 50 శాతాన్ని ఎవరి ద్వారా అయితే బిజినెస్ పొందాయో ఆ బిజినెస్ ఏజెంట్లు లేదా సబ్ ఏజెంట్లతో పంచుకుంటాయి. 19. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ (ఆర్థిక వ్యవహారాల విభాగం) అక్టోబర్ 08, 2008న జారీ చేసిన F. No.4(13) W&M/2008 నోటిఫికేషన్ లోని అన్ని నియమ నిబంధనలూ ఈ బాండ్లకు వర్తిస్తాయి. 20. ప్రభుత్వ గోల్డ్ బాండ్ లు 2016-17 సిరీస్-IIIకు సంబంధించిన నిర్వహణాపరమైన మార్గదర్శకాలను circular IDMD.CDD.NO.894/14.04.050/2016-17 ద్వారా జారీ చేయడం జరిగింది. మీ విశ్వసనీయులు, (రాజేంద్ర కుమార్) Encls.: పైన పేర్కొన్నవి |