RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78491920

సావరిన్ గోల్డ్ బాండ్ లు 2016-17 సిరీస్ -III, నిర్వ‌హ‌ణాప‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు

RBI/2016-17/99
IDMD.CDD.No.894/14.04.050/2016-17

అక్టోబర్ 20, 2016

ద ఛైర్మ‌న్‌ / చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌
అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు,
(RRBలు కాకుండా ఇత‌ర బ్యాంకులు)
గుర్తించిన పోస్టాఫీసులు,
స్టాక్ హోల్డింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లి. (SHICL)
జాతీయ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ఆఫ్ ఇండియా లి. మ‌రియు బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ లి.

డియ‌ర్ స‌ర్‌/మేడ‌మ్‌,

సావరిన్ గోల్డ్ బాండ్ లు 2016-17 సిరీస్ -III, నిర్వ‌హ‌ణాప‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు

భార‌త ప్ర‌భుత్వ నోటిఫికేష‌న్ నెం. F.No.4(16)-W&M/2016 మ‌రియు అక్టోబ‌ర్ 20, 2016న RBI సావరిన్ గోల్డ్ బాండ్లపై జారీ చేసిన స‌ర్క్యుల‌ర్ నెం. IDMD.CDD.No.893/14.04.050/ 2016-17 కు సంబంధించి దీనిని జారీ చేయ‌డం జ‌రిగింది. దీనికి సంబంధించిన FAQల‌ను మా వెబ్ సైట్ (www.rbi.org.in) లో పెట్ట‌డం జ‌రిగింది. ఈ ప‌థ‌కానికి సంబంధించిన నిర్వ‌హ‌ణాప‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలను ఈ క్రింద ఇవ్వ‌డం జ‌రిగింది.

1. ద‌ర‌ఖాస్తు

ఇన్వెస్ట‌ర్ల ద‌ర‌ఖాస్తు ఫారాల‌ను అక్టోబ‌ర్ 24, 2016 నుండి న‌వంబ‌ర్ 2, 2016 వ‌ర‌కు శాఖ‌ల వ‌ద్ద బ్యాంకు సాధార‌ణ పని వేళ‌ల‌లో స్వీక‌రించ‌డం జ‌రుగుతుంది. పూర్తిగా నింప‌ని ద‌ర‌ఖాస్తు ఫారాల‌ను తిర‌స్క‌రించే అవ‌కాశం ఉన్నందున వాటిని స్వీక‌రించే కార్యాల‌యాలు ద‌ర‌ఖాస్తులు అన్ని విధాలుగా పూర్తి చేయ‌బ‌డ్డాయ‌ని నిర్ధారించుకోవాలి. అవ‌స‌ర‌మైన చోట‌, ద‌ర‌ఖాస్తుదారుల నుంచి కావ‌ల‌సిన‌ అద‌న‌పు వివ‌రాల‌ను తీసుకోవాలి. మ‌రింత మెరుగైన క‌స్ట‌మ‌ర్ సేవ‌లు అందించేందుకు వీలుగా దర‌ఖాస్తుల‌ను స్వీక‌రించే కార్యాల‌యాలు ఇన్వెస్ట‌ర్లు ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాలి.

2. జాయింట్ హోల్డింగ్ మ‌రియు నామినేష‌న్‌

మల్టిపుల్ జాయింట్ హోల్డ‌ర్లు మ‌రియు నామినీలను (మొద‌టి హోల్డ‌ర్ యొక్క‌) అనుమ‌తిస్తారు. వాడుక ప్ర‌కారం ద‌ర‌ఖాస్తుదారుల నుంచి అవ‌స‌ర‌మైన వివ‌రాల‌ను స్వీక‌రించ‌వ‌చ్చు.

3. నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్‌ (KYC) కు అవ‌స‌ర‌మైన‌వి:

భౌతిక రూపంలోని బంగారం కొనుగోలుకు ఏయే నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్‌ (KYC) నిబంధ‌న‌లు అవ‌స‌ర‌మో అవే ఇక్క‌డా వ‌ర్తిస్తాయి. పాస్ పోర్టు, శాశ్వ‌త అకౌంట్ నెంబ‌ర్ (PAN) కార్డు, ఓట‌ర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులాంటి గుర్తింపు ప‌త్రాలు అవ‌స‌ర‌మవుతాయి. మైన‌ర్ల విష‌యంలో మాత్ర‌మే, KYC ధ్రువీక‌ర‌ణ కొర‌కు బ్యాంకు అకౌంట్ నెంబ‌ర్ ను కూడా చెల్లుబాటుగా ప‌రిగ‌ణిస్తారు. జారీ చేసే బ్యాంకులు/SHCIL కార్యాల‌యాలు/పోస్టాఫీసులు/ఏజెంట్లు KYCని చేస్తాయి.

4. ద‌ర‌ఖాస్తు సొమ్ముపై వ‌డ్డీ

దర‌ఖాస్తుదారుల‌కు అప్ప‌టికి ఉన్న వ‌డ్డీరేట్ల‌కు అనుగుణంగా చెల్లింపు చేసిన నాటి నుండి సెటిల్ మెంట్ తేదీ వ‌ర‌కు, అన‌గా నిధులు వారి వద్ద లేని కాలానికి వ‌డ్డీని చెల్లించ‌డం జ‌రుగుతుంది. ఒక‌వేళ ద‌ర‌ఖాస్తుదారు బ్యాంక్ అకౌంట్ రిసీవింగ్ బ్యాంకు వ‌ద్ద లేనట్ల‌యితే, వడ్డీని దర‌ఖాస్తుదారు స‌మ‌ర్పించిన అకౌంట్ వివ‌రాల‌కు అనుగుణంగా ఎలెక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫ‌ర్ ద్వారా జ‌మ చేయ‌డం జ‌రుగుతుంది.

5. ర‌ద్దు

ఇష్యూ ముగిసే తేదీ అన‌గా న‌వంబ‌ర్ 02, 2016 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తును ర‌ద్దు చేసుకునేందుకు అవ‌కాశ‌మిస్తారు. గోల్డ్ బాంఢ్ ల కొనుగోలుకు స‌మ‌ర్పించిన విజ్ఞ‌ప్తుల‌ పాక్షిక ర‌ద్దును అనుమ‌తించ‌రు. ఒక‌వేళ దర‌ఖాస్తును ర‌ద్దు చేసుకుంటే ద‌ర‌ఖాస్తు సొమ్ముపై ఎలాంటి వ‌డ్డీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.

6. పూచీక‌త్తు (Lien) మార్కింగ్

బాండ్లు ప్ర‌భుత్వ సెక్యూరిటీలు కాబ‌ట్టి, పూచీక‌త్తు (Lien) మార్కింగ్ మొద‌లైన‌వి ప్ర‌భుత్వ సెక్యూరిటీస్ యాక్ట్, 2006లోని చ‌ట్ట‌ప‌ర‌మైన నిబంధ‌న‌ల మేర‌కు మ‌రియు దాని కింద ఉన్న ఇత‌ర నియ‌మాల మేర‌కు ఉంటాయి.

7. ఏజెన్సీ ఏర్పాటు

స్వీకరణ కార్యాలయాలు NBFCలు, NSC ఏజెంట్లు, LIC ఏజెంట్లు మరియు ఇతరులను తమ తరపున దరఖాస్తులను స్వీకరించడానికి నియమించుకోవచ్చు. బ్యాంకులు అలాంటి వారితో ఒప్పందాలు లేదా టై-అప్ ల‌ను చేసుకోవచ్చు. స్వీకరణ కార్యాలయాలకు అందిన దరఖాస్తుల‌పై మొత్తం సబ్ స్ర్కిప్షన్ పై వందకు రూపాయి వంతున డిస్ట్రిబ్యూషన్ కమిషన్ చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా అందిన కమిషన్ నుంచి స్వీకరణ కార్యాలయాలు కనీసం 50 శాతాన్ని ఎవ‌రి ద్వారా అయితే బిజినెస్ పొందాయో ఆ బిజినెస్ ఏజెంట్లు లేదా సబ్ ఏజెంట్లతో పంచుకుంటాయి.

8. RBI యొక్క ఈ-కుబేర్ వ్య‌వ‌స్థ ద్వారా ప్రాసెసింగ్‌

ప్ర‌భుత్వ గోల్డ్ బాంఢ్‌లు స‌బ్ స్క్రిప్ష‌న్ కొర‌కు షెడ్యూల్డ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకులు మ‌రియు కొన్ని ప్ర‌త్యేక పోస్టాఫీసుల వ‌ద్ద RBI యొక్క ఈ-కుబేర్ వ్య‌వ‌స్థ ద్వారా ల‌భ్య‌మ‌వుతాయి. ఈ-కుబేర్ వ్య‌వ‌స్థను ఇంట‌ర్నెట్ లేదా ఇన్‌ఫినెట్ ద్వారా యాక్సెస్ చేసుకోవ‌చ్చు. స్వీకరణ కార్యాల‌యాలు త‌మ‌కు అందిన స‌బ్ స్క్రిప్ష‌న్ల డాటాను ఎంట‌ర్ చేయ‌డం కానీ లేదా బ‌ల్క్ అప్‌లోడ్ చేయ‌డం కానీ చేయాలి. ఏవైనా అనుకోని త‌ప్పుల‌ను నివారించ‌డానికి అవి తాము ఎంట‌ర్ చేస్తున్న డాటా స‌రిగా ఉందా లేదా అన్న‌ది నిర్ధారించుకోవాలి. దర‌ఖాస్తు అందిన వెంట‌నే వాటికి క‌న్ఫ‌ర్మేష‌న్ అందుతుంది. దానికి తోడు ఫైల్ అప్ లోడ్ కోసం స్వీకరణ కార్యాల‌యాలు త‌మ‌ డాటాబేస్‌ను అప్ డేట్ చేసుకోవ‌డం కోసం వాటికి క‌న్ఫ‌ర్మేష‌న్ స్ర్కోల్ ను ఇవ్వ‌డం జ‌రుగుతుంది. కేటాయింపు తేదీ అన‌గా న‌వంబ‌ర్ 17, 2016న ఒకే/ప‌్ర‌ధాన హోల్డ‌ర్ పేరిట అన్ని స‌బ్ స్క్రిప్ష‌న్ల‌కు స‌ర్టిఫికేట్స్ ఆఫ్ హోల్డింగ్ ను జ‌న‌రేట్ చేయ‌డం జ‌రుగుతుంది. ఈ స‌ర్టిఫికేట్స్ ఆఫ్ హోల్డింగ్ ల‌ను ఈమెయిల్ అడ్ర‌స్‌లు ఇచ్చిన ఇన్వెస్ట‌ర్ల‌కు ఈమెయిల్ ద్వారా పంప‌డం జ‌రుగుతుంది. కేటాయింపులు జ‌రిగిన 2-3 రోజుల‌లోగా సెక్యూరిటీల‌ను వారి డీమ్యాట్ అకౌంట్ లోకి జ‌మ చేయ‌డం జ‌రుగుతుంది (డిపాజిట‌ర్ల రికార్డుల‌తో దర‌ఖాస్తులోని అంశాలు స‌రిపోయిన‌ప్పుడు).

9. స‌ర్టిఫికేట్స్ ఆఫ్ హోల్డింగ్ ల ప్ర‌చుర‌ణ‌

స‌ర్టిఫికేట్స్ ఆఫ్ హోల్డింగ్ ల‌ను A4 సైజు, 100 GSM కాగితంపై రంగులలో ముద్రిస్తారు.

10. స‌ర్వీసింగ్ మ‌రియు ఫాలో అప్‌

స్వీకరణ కార్యాల‌యాలు అన‌గా షెడ్యూల్డ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకుల శాఖ‌లు, గుర్తించిన పోస్టాఫీసులు, SHCIL మ‌రియు స్టాక్ ఎక్స్ చేంజ్‌లు (NSE Ltd. మ‌రియు BSE) క‌స్ట‌మ‌ర్ ను ‘స్వంతం’ చేసుకుని ఈ బాండ్ల‌కు సంబంధించినంత వ‌ర‌కు వారికి అవ‌స‌ర‌మైన సేవ‌లు ఉదా: కాంటాక్ట్ వివ‌రాల అప్ డేట్‌, ముంద‌స్తు ఎన్ క్యాష్ మెంట్ విజ్ఞ‌ప్తులు మొద‌లైనవి అందిస్తాయి. బాండ్లు మెచ్యూర్ అయి, వాటిపై చెల్లింపులు పూర్త‌యే వ‌ర‌కు స్వీకరణ కార్యాల‌యాలు దర‌ఖాస్తుల‌ను జాగ్త‌త్త‌గా భ‌ద్ర‌ప‌ర‌చాలి.

11. ట్రేడ‌బిలిటీ

భార‌త రిజ‌ర్వ్ బ్యాంక్ నోటిఫై చేసిన రోజున ఈ బాండ్లు ట్రేడింగ్‌కు అర్హ‌త పొందుతాయి. (డిపాజిట‌రీల‌లో ఉన్న డీమాట్ రూపంలోని బాండ్లు మాత్ర‌మే స్టాక్ ఎక్స్ ఛేంజ్ ల‌లో ట్రేడింగ్ కు అర్హ‌త క‌లిగి ఉంటాయ‌ని గుర్తించాలి)

12. కాంటాక్ట్ వివ‌రాలు

ఏవైనా ప్ర‌శ్న‌లు/వివ‌ర‌ణ‌లను ఈ క్రింది వాటికి ఈమెయిల్ చేయ‌వ‌చ్చు.

(a) ప్ర‌భుత్వ గోల్డ్ బాండ్ల‌కు సంబంధించిన‌వి. ద‌య‌చేసి ఈమెయిల్ పంప‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.

(b) ఐటీకి సంబంధించిన‌వి : ద‌య‌చేసి ఈమెయిల్ పంప‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.

మీ విశ్వ‌స‌నీయులు,

(రాజేంద్ర కుమార్‌)
జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?