<font face="mangal" size="3">ప్ర‌భుత్వ గోల్డ్ బాండ్లు 2017-18 -- సిరీస్–I - కార్య‌న&# - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రభుత్వ గోల్డ్ బాండ్లు 2017-18 -- సిరీస్–I - కార్యనిర్వాహక మార్గదర్శకాలు
RBI/2016-17/290 ఏప్రిల్ 20, 2017 ద ఛైర్మన్ / మేనేజింగ్ డైరెక్టర్ డియర్ సర్/మేడమ్, ప్రభుత్వ గోల్డ్ బాండ్లు 2017-18 -- సిరీస్–I - కార్యనిర్వాహక మార్గదర్శకాలు ఇది ప్రభుత్వ గోల్డ్ బాండ్లు 2017-18 -- సిరీస్–I పై భారత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ నెం. F.No.4(8)-(W&M)/2017 మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 20, 2017న జారీ చేసిన సర్క్యులర్ నెం. IDMD.CDD.No.2760/14.04.050/2016-17లకు సంబంధించినది. దీనికి సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలను మా వెబ్ సైట్లో పెట్టడం జరిగింది (www.rbi.org.in). ఈ పథకానికి సంబంధించిన కార్యనిర్వాహక మార్గదర్శకాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: 1. దరఖాస్తు: ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 28, 2017 వరకు బ్యాంకుల సాధారణ పని వేళలలో బ్యాంకుల శాఖల వద్ద ఇన్వెస్టర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుంది కాబట్టి, స్వీకరించే కార్యాలయాలు దరఖాస్తు అన్ని విధాలుగా పూర్తి చేయబడిందని నిర్ధారించుకోవాలి. అవసరమైనప్పుడు దరఖాస్తుదారుల నుంచి తగిన అదనపు సమాచారాన్ని స్వీకరించడం జరగాలి. మరింత మెరుగైన కస్టమర్ సేవలు అందించడంలో భాగంగా స్వీకరణ కార్యాలయాలు, ఇన్వెస్టర్లు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. 2. జాయింట్ హోల్డింగ్ మరియు నామినేషన్: బహుళ జాయింట్ హోల్డర్లు మరియు నామినీలను (మొదటి హోల్డర్ యొక్క) అనుమతించడం జరుగుతుంది. అవవసరమైన వివరాలను గతంలోలాగే దరఖాస్తుదారుల నుంచి స్వీకరించవచ్చు. 3. నో-యువర్-కస్టమర్ (KYC) కు కావలసినవి: వస్తు రూపంలో ఉన్న బంగారం కొనుగోలుకు ఎలాంటి నియమాలు వర్తిస్తాయో ఇక్కడ కూడా అవే నో-యువర్-కస్టమర్ (KYC) నియమాలు వర్తిస్తాయి. పాస్ పోర్ట్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (PAN) కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులాంటి గుర్తింపు పత్రాలు అవసరం. కేవలం మైనర్ల విషయంలో మాత్రమే KYC నిర్ధారణ కొరకు బ్యాంకు అకౌంట్ నెంబరును కూడా గుర్తించడం జరుగుతుంది. జారీ చేసే బ్యాంకులు/SHCIL కార్యాలయాలు/ పోస్టాఫీసులు/ఏజెంట్లు ఈ KYCని చేపడతాయి. 4, దరఖాస్తు సొమ్ముపై వడ్డీ: దరఖాస్తుదారులకు అప్పటికున్న సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేట్లకు అనుగుణంగా, రియలైజేషన్ తేదీ నుంచి సెటిల్మెంట్ తేదీ వరకు, అనగా నిధులు వారి వద్ద లేని కాలానికి వడ్డీ చెల్లించబడుతుంది. స్వీకరించే బ్యాంక్ వద్ద దరఖాస్తుదారుని బ్యాంక్ అకౌంట్ లేనట్లయితే, దరఖాస్తుదారుడు సమర్పించిన అకౌంట్ వివరాలకు ఎలెక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ ద్వారా వడ్డీని జమ చేయాల్సి ఉంటుంది. 5. రద్దు ఇష్యూ ముగిసే తేదీ వరకు, అనగా, ఏప్రిల్ 28, 2017 వరకు దరఖాస్తును రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. గోల్డ్ బాండ్ల కొనుగోలు కోసం సమర్పించిన దరఖాస్తులో కొంత భాగాన్ని మాత్రమే రద్దు చేసుకోవడం వీలుపడదు. దరఖాస్తు రద్దు చేసుకున్నట్లయితే, దరఖాస్తు సొమ్ముపై వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. 6. ధరావతు గుర్తు: బాండ్లు ప్రభుత్వ సెక్యూరిటీలు కావడం వల్ల, ధరావతు గుర్తు మొదలైనవి, ప్రభుత్వ సెక్యూరిటీల చట్టం, 2006 మరియు దాని కింద పేర్కొన్న చట్టపరమైన నిబంధనలకు లోబడి ఉంటాయి. 7. ఏజెన్సీ ఏర్పాటు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు తమ తరపున దరఖాస్తులను స్వీకరించేందుకు NBFCలను, NSC ఏజెంట్లను లేదా ఇతరులను నియమించుకోవచ్చు. బ్యాంకులు అలాంటి వాటితో ఒప్పందాలు లేదా టై-అప్ లు ఏర్పాటు చేసుకోవచ్చు. స్వీకరణ కార్యాలయాలకు అందిన దరఖాస్తులపై మొత్తం సబ్ స్ర్కిప్షన్ పై వందకు రూపాయి వంతున డిస్ట్రిబ్యూషన్ కమిషన్ చెల్లించడం జరుగుతుంది. స్వీకరణ కార్యాలయాలు ఈ విధంగా అందిన కమిషన్ నుంచి కనీసం 50 శాతాన్ని ఎవరి ద్వారా అయితే బిజినెస్ పొందాయో ఆ బిజినెస్ ఏజెంట్లు లేదా సబ్ ఏజెంట్లతో పంచుకుంటాయి. 8. RBI యొక్క ఈ-కుబేర్ వ్యవస్థ ద్వారా ప్రాసెసింగ్: ప్రభుత్వ గోల్డ్ బాండ్లు RBI యొక్క ఈ-కుబేర్ వ్యవస్థ ద్వారా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల శాఖలలోను మరియు అధీకృత పోస్టాఫీసులలోను సబ్ స్ర్కిప్షన్ కొరకు అందుబాటులో ఉంటాయి. ఈ ఈ-కుబేర్ వ్యవస్థను ఇంటర్నెట్ లేదా ఇన్ఫినెట్ ద్వారా అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. స్వీకరణ కార్యాలయాలు తాము అందుకున్నసబ్ స్ర్కిప్షన్ ల సమాచారాన్ని ఎంటర్ చేయడమో లేదా బల్క్ అప్ లోడ్ చేయడమో చేయాల్సి ఉంటుంది. ఏదైనా అనుకోని పొరబాట్లు జరగకుండా ఉండేందుకు అవి తాము ఎంటర్ చేసే సమాచారాన్ని సరి చూసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు అందిన వెంటనే వారికి అవి అందినట్లు కన్ఫర్మేషన్ అందుతుంది. దీనికి తోడుగా, స్వీకరణ కార్యాలయాలు తమ డాటాబేస్ ను అప్ డేట్ చేసుకునేలా ఫైళ్లను అప్ లోడ్ చేసేందుకు ఒక కన్ఫర్మేషన్ స్క్రోల్ ఏర్పాటు చేయబడుతుంది. అలాట్మెంట్ తేదీ రోజున - అనగా మే 12, 2017న అన్ని సబ్ స్ర్కిప్షన్ లకు ఏకైక/ప్రిన్సిపల్ హోల్డర్ పేరు మీద సర్టిఫికేట్స్ ఆఫ్ హోల్డింగ్ ను జనరేట్ చేయడం జరుగుతుంది. స్వీకరణ కార్యాలయాలు వాటిని డౌన్ లోడ్ చేసుకుని ప్రింటవుట్లు తీసుకోవచ్చు. సర్టిఫికేట్స్ ఆఫ్ హోల్డింగ్ ను ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన ఇన్వెస్టర్లకు ఈమెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది. డిపాజిటరీల రికార్డులలో ఉన్న దరఖాస్తులలోని వివరాలను సరిచూసుకున్న అనంతరం, కేటాయించిన 2-3 రోజులలోగా సెక్యూరిటీలను వారి డీమ్యాట్ అకౌంట్ కు జమ చేయడం జరుగుతుంది. 9. సర్టిఫికేట్స్ ఆఫ్ హోల్డింగ్ ల ముద్రణ: హోల్డింగ్ సర్టిఫికేట్ల ముద్రణను రంగులలో A4 సైజులో 100 GSM పేపర్ పై ముద్రించాల్సి ఉంటుంది. 10. సర్వీసింగ్ మరియు ఫాలో-అప్: స్వీకరణ కార్యాలయాలు - షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల శాఖలు మరియు అధీకృత పోస్టాఫీసులు, SHCIL మరియు స్టాక్ ఎక్స్చేంజ్లు (NSE Ltd. మరియు BSE) కస్టమర్ ను సొంతం చేసుకుని ఈ బాండ్ కు సంబంధించిన విషయాలలో అవసరమైన సేవలను - కాంటాక్ట్ వివరాల అప్డేట్, ముందస్తు ఎన్ క్యాష్మెంట్ కొరకు విజ్ఞప్తులు స్వీకరించడం లాంటి సేవలను అందిస్తాయి. స్వీకరణ కార్యాలయాలు బాండ్లు మెచ్యూర్ అయి, వాటిని తిరిగి చెల్లించే నాటి వరకు దరఖాస్తులను భద్రపరచాల్సి ఉంటుంది. 11. ట్రేడబిలిటీ బాండ్లను జారీ చేసిన పక్షం రోజులలో RBI నోటిఫై చేసిన తేదీ నుంచి వాటి ట్రేడింగ్ కు అవకాశముంటుంది. (డిపాజిటరీలలో డీమాట్ రూపంలో ఉన్న బాండ్లను మాత్రమే స్టాక్ ఎక్స్ చేంజ్లో ట్రేడింగ్ చేసే అవకాశం ఉందని గుర్తించాలి) 12. కాంటాక్ట్ వివరాలు ఏవైనా సందేహాలు/వివరణలను ఈ క్రింది వాటికి ఈమెయిల్ చేయవచ్చు: (ఎ) ప్రభుత్వ గోల్డ్ బాండ్లకు సంబంధించి: ఈమెయిల్ చేయడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి. (బి) ఐటీకి సంబంధించి: ఈమెయిల్ చేయడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి. మీ విశ్వసనీయులు, (షైనీ సునీల్) |