RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78510719

సార్వభౌమ పసిడి బాండ్లు, నిర్వహణ మార్గదర్శకాలు

RBI/2017-18/72
IDMD.CDD.No.927/14.04.050/2017-18

అక్టోబర్ 06, 2017

చైర్‌మన్‌ & మానేజింగ్ డైరెక్టర్
అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (RRBలు మినహా)
అధికృత తపాలా కార్యాలయాలు
స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లి. (SHCIL)
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లి. మరియు
బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ లి.

అయ్యా / అమ్మా,

సార్వభౌమ పసిడి బాండ్లు, నిర్వహణ మార్గదర్శకాలు

భారత ప్రభుత్వ నోటిఫికేషన్‌ F.No.4(25)-B/(W&M)/2017 మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ IDMD.CDD.No.929/14.04.050/2017-18 తేదీ అక్టోబర్ 06, 2017 చూడండి. తరచుగా కలిగే సందేహాలకు జవాబులు మావెబ్‌సైట్‌లో (www.rbi.org.in) ఇవ్వబడ్డాయి. ఈపథకం నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు, ఈక్రింద వివరించబడ్డాయి.

1. దరఖాస్తు

మదుపరులనుండి దరఖాస్తులు, ప్రతి సోమవారం నుండి బుధవారం (ఆ రెండురోజులూ కలిపి) బ్యాంకు పనివేళల్లో, శాఖలలో స్వీకరించబడతాయి. స్వీకరించే కార్యాలయాలు, దరఖాస్తు అన్ని విధాలా సంపూర్ణంగా ఉందని రూఢిపరచుకోవలెను. అసంపూర్ణంగా ఉన్న దరఖాస్తులు, తిరస్కరించబడతాయి. అవసరమయితే, అదనపు వివరాలు కోరవచ్చును. వినియోగదారులకు ఉత్తమ సేవలందించడానికి, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించే సదుపాయం కల్పించవలెను.

2. ఉమ్మడి హక్కుదారులు మరియు నామినేషన్‌

పలు ఉమ్మడి హక్కుదారులు, నామినీలు (మొదటి హోల్డరుకు) అనుమతించబడతారు. అవసరమైన వివరాలు, వాడుకప్రకారం సేకరించవలెను.

3. KYC ఆవశ్యకతలు

భౌతికంగా బంగారం కొనుగోలుకు వర్తించే నియమాలే, బాండ్ల కొనుగోలుకు వర్తిస్తాయి. పాస్‌పోర్ట్, PAN కార్డ్, వోటర్ గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్ అవసరమౌతాయి. కేవలం మైనర్ల విషయంలో, బ్యాంకు ఖాతా నంబరుకూడా, ధృవీకరణకు సరిపోతుంది. KYC ధృవీకరణ, బ్యాంకులు, / SHCIL కార్యాలయాలు / పోస్ట్ ఆఫీసులు / నియమించిన స్టాక్ ఎక్స్చేంజిలు / ఏజంట్లు, చేయవలెను. మదుపరి, ఇంతకు మునుపు, SGB లేక IINSC-C లో పెట్టుబడి చేసిన కారణంగా, ఇన్వెస్టర్ ID (investor ID) కలిగిఉన్నట్లయితే, ఈ పెట్టుబడులుకూడా అట్టి ప్ర్రత్యేక ఇన్వెస్టర్ ID క్రింద మాత్రమే చేయవలెను.

4. రద్దుచేయుట

జారీ ముగిసేవరకు, దరఖాస్తు రద్దు చేసుకొనవచ్చును. అనగా, ఆవారం లో చేసిన పెట్టుబడులకు, బుధవారం వరకు. పసిడి బాండ్ల కొనుగోలుకై చేసిన దరఖాస్తుల పాక్షిక రద్దు సమ్మతించబడదు.

5. లీన్‌ నమోదు (lien marking)

ఈ బాండ్లు ప్రభుత్వ సెక్యూరిటీలుగనుక, లీన్‌ నమోదు మొదలైన విషయాలు, ప్రభుత్వ సెక్యూరిటీస్ చట్టం, 2006 ప్రకారం అమలులోగల చట్టపరమైన నిబంధనలూ, వాటిక్రిందచేసిన నియమాలను, అనుసరించి ఉంటాయి.

6. ప్రాతినిధ్య ఏర్పాట్లు (Agency arrangements)

షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, NBFCలను, NSC ఏజంట్లను వారి తరఫున దరఖాస్తులు సేకరించుటకు, నియమించవచ్చును. బ్యాంకులు వారితో ఒడంబడికలు, ఒప్పందాలు చేసుకొనవచ్చును. దరఖాస్తులు స్వీకరించే కార్యాలయాలకు, సేకరించిన మొత్తంమీద, వందకు ఒక రూపాయి కమిషన్‌ చెల్లించబడుతుంది. దీనిలో కనీసం 50% ఏజంట్లతో / సబ్‌ ఏజంట్లతో, వారిద్వారా సమకూరిన వ్యాపారానికై, పంచుకోవాలి.

7. RBI e- కుబేర్ సిస్టమ్‌ (Processing through RBI’s e-Kuber System)

సార్వభౌమ పసిడి బాండ్లు, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల మరియు నిర్దిష్ట తపాలా కార్యాలయాల్లో, రిజర్వ్ బ్యాంక్ ఇ-కుబేర్ సిస్టమ్‌ద్వారా లభ్యమౌతాయి. ఇ-కుబేర్ సిస్టమ్‌, INFINET లేదా ఇంటర్‌నెట్ (Internet) ద్వారా పొందవచ్చు. దరఖాస్తులు స్వీకరించే కార్యాలయాలు, వివరాలు పూరించి ఒకేసారి బల్క్ అప్‌లోడ్ (bulk upload) చేయవచ్చు. అనుకోని తప్పులు జరగకుండా, నింపిన వివరాలు ఖచ్చితంగా ఉన్నాయని జాగ్రత్త వహించాలి. దరఖాస్తు అందనదని వెంటనే నిర్ధారించబడుతుంది. ఇంతేగాక, కార్యాలయాలు వారి డాటాబేస్ తాజాపరచుకొనేందుకు వీలుగా, ఫైల్స్ అప్‌లోడ్స్ నిర్ధారిస్తూ ఒక కన్ఫర్మేషన్‌ స్క్రోల్ (confirmation scroll) పంపబడుతుంది. జారీతేదీనాడు, అన్ని పెట్టుబడులకు వ్యక్తిగత/ప్రధాన దరఖాస్తుదారుని పేరుతో సర్టిఫికేట్ ఆఫ్ హోల్డింగ్ (Certificate of Holding) జారీచేయబడుతుంది. దరఖాస్తు స్వీకరించిన కార్యాలయాలు, దీనిని డౌన్‌లోడ్ చేసుకొని ముద్రించు కోవచ్చు. ఈ-మైల్ చిరునామా తెలిపిన దరఖాస్తుదారుకు సర్టిఫికేట్ ఆఫ్ హోల్డింగ్ ఇ- మైల్‌ద్వారా, పంపబడుతుంది. డిపాజిటరీలు, వారి రికార్డుతో, దరఖాస్తులో ఇచ్చిన వివరాలు సరిపోతే, సెక్యూరిటీలు, డి-మ్యాట్ ఖాతాకు జమచేస్తాయి.

8. సర్టిఫికేట్ ఆఫ్ హోల్డింగ్ ముద్రించుట

హోల్డింగ్ సర్టిఫికేట్, A-4 సైజ్, 100 GSM రంగు కాగితంపై ముద్రించవలెను.

9. తదనంతర సేవలు, చర్యలు

రిసీవింగ్ ఆఫీసులు – షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, నిర్దిష్ట తపాలా కార్యాలయాలు, SCHIL మరియు నిర్దిష్ట స్టాక్ ఎక్స్చేంజిలు (NSE Ltd. మరియు BSE), వినియోగదారును వారి స్వంత ఖాతాదారుగా భావించి, బాండ్‌కు సంబంధించి - సంప్రదించుటకు వివరాలు తాజాపరచుట, గడువుకు ముందే చెల్లింపుకోరుట మొదలైన అన్ని విషయాలలో అవసరమైన సేవలు అందించవలెను. రిసీవింగ్ ఆఫీసులు, బాండ్ల గడువుపూర్తి అయి తిరిగిచెల్లించేవరకు, దరఖాస్తులు భద్ర పరచవలెను.

10. క్రయ విక్రయాలు (Tradability)

రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన తేదీనాడు బాండ్లు ట్రేడింగ్ చేయవచ్చు. (డి-మ్యాట్ రూపంలో ఉన్న బాండ్లుమాత్రమే స్టాక్ ఎక్స్చేంజిలలో ట్రేడ్ చేయవచ్చునని గమనించవలెను)

11. సంప్రదింపుకై వివరాలు (contact details)

సందేహాలకు / వివరాలకు ఈ క్రిందివిధంగా ఇ-మైల్ పంపండి:

a) సార్వభౌమ పసిడి బాండ్లకు సంబంధించి: ఇ-మైల్ పంపుటకు ఇచ్చట నొక్కండి
b) IT కి సంబంధించి: ఇ-మైల్ పంపుటకు ఇచ్చట నొక్కండి

మీ విశ్వాసపాత్రులు,

(షైని సునిల్)
డెప్యూటీ జనరల్ మానేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?