<font face="mangal" size="3">శ్రీ బసవేశ్వర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బసవన్&zw - ఆర్బిఐ - Reserve Bank of India
శ్రీ బసవేశ్వర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బసవన్ బాగెవాడి, బిజాపూర్, కర్నాటక - జరిమానా విధింపు
తేదీ: 24/05/2019 శ్రీ బసవేశ్వర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బసవన్ బాగెవాడి, బిజాపూర్, కర్నాటక - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 47(A) [సెక్షన్ 46 (4) తో కలిపి] క్రింద తమకు దఖలుపరచిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, బసవేశ్వర్ కో ఆపరేటివ్ బ్యాంకు లి., బసవన్ బాగెవాడి, బిజాపూర్ పై, రూ. 1,00,000 (ఒక లక్ష రూపాయిలు) నగదు జరిమానా విధించినది. డైరెక్టర్లకు, వారి బంధువులకు అప్పులు/రుణాల జారీచేసి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశాలు మరియు మార్గదర్శకాలు ఉల్లంఘించిన కారణంగా, ఈ జరిమానా విధించబడింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్, పైన పేర్కొన్న బ్యాంకుకు, షోకాజ్ నోటీస్ జారీ చేసినది. దీనికి బ్యాంక్, ప్రత్యక్ష సమావేశము కోరినది. ఈ విషయమై నిజానిజాలు, బ్యాంక్ చేసిన మౌఖిక నివేదనలు పరిశీలించిన పిమ్మట, ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేననీ, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/2759 |