RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78528479

అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన

తేదీ: ఆగస్ట్ 06, 2021

అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన

ఈ ప్రకటన, ద్రవ్యత మరియు నియంత్రణ చర్యలతో సహా వివిధ అభివృద్ధి మరియు నియంత్రణ విధాన చర్యలను నిర్దేశిస్తుంది.

I. ద్రవ్య సంబంధిత చర్యలు

1. టిఎల్‌టిఆర్‌ఓ (TLTRO) లక్షిత దీర్ఘకాల (ఆన్-ట్యాప్) పథకం – చివరి గడువు పొడిగింపు

బాహుళ్యవ్యాప్తికి మరియు ముందూవెనుకా సహలగ్నతల ప్రభావంతో వృద్ధిని ప్రేరేపించు నిర్దిష్టమైన రంగాలలో కార్యకలాపాలకు పునరుత్తేజం కల్పించే ద్రవ్య సంబంధిత చర్యల దృష్టిని పెంచే ఉద్దేశంతో, అక్టోబర్ 9, 2020 న ఆర్‌బిఐ అయిదు ప్రధాన రంగాల కోసం మార్చి 31, 2021 వరకు లభించేలా టిఎల్‌టిఆర్‌ఓ లక్షిత దీర్ఘకాల (ఆన్ ట్యాప్) పథకం ను ప్రకటించింది. కామత్ కమిటీ గుర్తించిన ఒత్తిడికి లోనైన రంగాలను కూడా డిసెంబర్ 04, 2020 న మరియు ఎన్‌బిఎఫ్‌సిలకు బ్యాంకులు రుణాలు అందివ్వడం ను ఫిబ్రవరి 05, 2021 తేదీ నుండి, పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. ఏప్రిల్ 7 వ తేదీన, ఈ పథకం ఆరు నెలల కాలానికి పొడిగించబడింది, అనగా, సెప్టెంబర్ 30, 2021 వరకు. ఆర్థిక పునరుద్ధరణ ఇపుడిపుడే కుదుటపడుతున్న కారణంగా, ఆన్ ట్యాప్ TLTRO పథకాన్ని మూడు నెలల కాలానికి మరింత పొడిగించాలని నిర్ణయించారు, అంటే, డిసెంబర్ 31, 2021 వరకు.

2. పరిమిత స్థాయీ సౌకర్యం (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ- ఎంఎస్ఎఫ్) – సడలింపుల యొక్క పొడిగింపు

పరిమిత స్థాయీ సౌకర్యం (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ- ఎంఎస్ఎఫ్) క్రింద నిధులను పొందడానికి చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (యస్ యల్ ఆర్-SLR) నిదులలోంచి ఎన్‌డిటిఎల్ (Net Demand and Time Liabilities) అదనంగా ఒక శాతం వరకు, అంటే మొత్తం ఎన్‌డిటిఎల్ లో మూడు (3) శాతం వరకు నిధులను వినియోగించుకోవడానికి మార్చి 27, 2020 న బ్యాంకులు అనుమతించబడినవి. ప్రారంభంలో జూన్ 30, 2020 వరకు లభించిన ఈ సౌకర్యం, తరువాత మార్చి 31, 2021 వరకు దశలవారీగా పొడిగించబడింది, ఆ తరువాత మరలా ఆరు మాసాల పాటు అంటే సెప్టెంబర్ 30, 2021 వరకు, పొడిగించబడింది. ఈ సడలింపు బ్యాంకులకు వారి ద్రవ్యత్వ అవసరాలు తీర్చడానికి మరియు లిక్విడిటీ కవరేజ్ నిష్పత్తి (యల్ సీ ఆర్ – LCR) ని చేరుకోడానికి కూడా వీలు కల్పిస్తుంది. ఈ సౌకర్యం ` 1.62 లక్షలకోట్ల మేరకు నిధులు అందుబాటుగా ఉంచడమే గాకుండా లిక్విడిటీ కవేరేజ్ నిష్పత్తి (యల్ సీ ఆర్ – LCR) కోసం ఉన్నత-శ్రేణి ద్రవ్య ఆస్తులు (హెచ్ క్యూ యల్ ఎ – HQLA) గా అర్హత పొందుతుంది. ఇపుడు, మరో మూడు మాసాల పాటు అనగా డిసెంబర్ 31, 2021 వరకు ఈ పరిమిత స్థాయీ సౌకర్యం (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ- ఎంఎస్ఎఫ్) ను కొనసాగించాలని నిర్ణయించడమైనది.

II. నియంత్రణ చర్యలు

3. లైబర్ (LIBOR) పరివర్తన - మార్గదర్శకాలపై సమీక్ష

లండన్ ఇంటర్‌బ్యాంక్ ఆఫర్ రేట్ (LIBOR) ట్రాన్సిషన్ అనేది ప్రస్తుతం బ్యాంకులకు మరియు ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్న ముఖ్యమైన ఘటన. జూన్ 8, 2021 న ఆర్బిఐ (RBI) ఒక సలహా జారీ చేసింది, బ్యాంకులు మరియు ఇతర ఆర్బిఐ నియంత్రిత సంస్థలు కొత్త కాంట్రాక్టులకు లైబర్ ను రిఫరెన్స్ రేట్‌గా ఉపయోగించడాన్ని నిలిపివేయాలని మరియు బదులుగా ఏదైనా ప్రత్యామ్నాయ రిఫరెన్స్ రేట్ (ARR) ను ఆచరణకు సాధ్యమైనంతలో త్వరగా, డిసెంబర్ 31, 2021 నాటికి ఏవైనా అవలంబించాలని దీని సారంశం. దీనికోసం రిజర్వు బ్యాంకు బ్యాంకులు మరియు ఇతర మార్కెట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ నియంత్రిత సంస్థలు మరియు ఆర్థిక మార్కెట్లు అవసరమైన విధంగా, ట్రాన్సిషన్ సజావుగా మారడానికి కావలసిన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో, విదేశీ కరెన్సీలో ఎగుమతి (ఎక్స్పోర్ట్) క్రెడిట్ మరియు ఉత్పన్న ఒప్పందాల (డెరివేటివ్ కాంట్రాక్టుల) పునర్నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలను దిగువ వివరించిన విధంగా సవరించాలని నిర్ణయించారు:

(అ) విదేశీ కరెన్సీలో ఎగుమతి (ఎక్స్పోర్ట్) క్రెడిట్ - బెంచ్‌మార్క్ రేటు

LIBOR / EURO-LIBOR / EURIBOR సంబంధిత వడ్డీ రేట్ల వద్ద షిప్మెంట్ కు ముందు (ప్రీ-షిప్మెంట్) వస్తువుల కొనుగోలు, ప్రాసెసింగ్, తయారీ లేదా ప్యాకింగ్‌కు ఫైనాన్సింగ్ కోసం ఎగుమతిదారులకు ప్రీ-షిప్‌మెంట్ క్రెడిట్‌ను విదేశీ కరెన్సీలో (PCFC) అందజేయడానికి అధీకృత డీలర్లు ప్రస్తుతం అనుమతించబడ్డారు. బెంచ్‌మార్క్ రేటుగా రాబోయేరోజుల్లో LIBOR ను నిలిపివేయాలనే కారణందృష్ట్యా, సంబంధిత కరెన్సీలో విస్తృతంగా ఆమోదించబడిన ఏవైనా ప్రత్యామ్నాయ రిఫరెన్స్ రేటును ఉపయోగించి ఎగుమతి క్రెడిట్‌ను పొడిగించడానికి బ్యాంకులను అనుమతించాలని నిర్ణయించబడింది.

(ఆ) బ్యాంకుల ఆఫ్-బ్యాలెన్స్ షీట్ ఎక్స్‌పోజర్‌ల కోసం ప్రుడెన్షియల్ నిబంధనలు - డెరివేటివ్ కాంట్రాక్టుల పునర్నిర్మాణం (రీస్ట్రక్చరింగ్‌)

ఉత్పన్నమైన ఒప్పందాల (డెరివేటివ్ కాంట్రాక్టుల) కోసం, ప్రస్తుతం ఉన్న సూచనల ప్రకారం, అసలు ఒప్పందంలోని ఏదైనా పరామితులలో (పారామీటర్‌లలో) మార్పును పునర్నిర్మాణంగా (రీస్ట్రక్చరింగ్‌) పరిగణిస్తారు, అంతేగాక పునర్నిర్మాణ తేదీన (రీస్ట్రక్చరింగ్‌ డేట్) ఒప్పందం యొక్క మార్క్-టు-మార్కెట్ విలువలో జరిగిన మార్పుకు నగదు రూపేణా పరిష్కరణ ఆవశ్యకమై యున్నది. లైబర్ (LIBOR) నుండి రిఫరెన్స్ రేట్‌లో రాబోయే మార్పు అప్రత్యాశిత ("ఫోర్స్-మేజర్") ఘటన (ఈవెంట్) కాబట్టి, LIBOR/LIBOR-సంబంధిత బెంచ్‌మార్క్‌ల నుండి రిఫరెన్స్ రేట్‌ను ప్రత్యామ్నాయ రిఫరెన్స్ రేట్‌గా మార్చడాన్ని రీస్ట్రక్చరింగ్‌గా పరిగణించరాదని బ్యాంకులకు సలహా ఇవ్వడమైనది.

4. ఉపశమన ప్రణాళిక 1.0 (రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 1.0) కింద ఫైనాన్షియల్ పరామితుల సాధనకు గడువును వాయిదా వేయడం

ఆగష్టు 6, 2020 న ప్రకటించిన కోవిడ్ -19 సంబంధిత ఒత్తిడి ఉపశమనం కోసం ఉపశమన ప్రణాళిక (రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్) కింద అమలు చేయబడిన రిజల్యూషన్ ప్రణాళికలో ఆర్ధిక పరామితులకు సంబంధించిన ఐదింటిలో నాలుగింటిని మార్చి 31, 2022 నాటికి నోటిఫై చేయబడ్డ సెక్టార్ నిర్దిష్ట పరిమితులను చేరుకోవలసిన అవసరం ఉంది, ఈ నాలుగు రుణ సంస్థ యొక్క కార్యాచరణ పనితీరుకు సంబంధించినవి, అంటే, మొత్తం అప్పు నుండి EBIDTA నిష్పత్తి (మొత్తం రుణ/EBIDTA), ప్రస్తుత నిష్పత్తి (కరెంట్ రేషియో), రుణ సేవా కవరేజ్ నిష్పత్తి (డేట్ సర్వీస్ కవరేజ్ రేషియో) మరియు సగటు రుణ సేవల కవరేజ్ నిష్పత్తి (యావరేజ్ డేట్ సర్వీస్ కవరేజ్ రేషియో). వ్యాపారాల పునరుజ్జీవనంపై COVID-19 యొక్క రెండవ వేవ్ యొక్క ప్రతికూల ప్రభావాన్ని మరియు కార్యాచరణ పరామితులను చేరుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి, పైన పేర్కొన్న పరామితులకు సంబంధించి లక్ష్య తేదీని అక్టోబర్ 1, 2022 వరకు వాయిదా వేయాలని నిర్ణయించారు.

మొత్తం బయటి అప్పులు/సర్దుబాటు చేసిన టోటల్ నెట్ వర్త్ (TOL/ATNW) పరామితికి సంబంధించి, ఈ నిష్పత్తి రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్అమలు నియమావళి కి అవసరమైన విధంగా సవరించిన మూలధన నిర్మాణాన్ని (అనగా రుణ-ఈక్విటీ మిక్స్) ప్రతిబింబిస్తుంది మరియు ఉపశమన ప్రణాళికలో భాగంగా ముందుగనే దీని స్పష్టీకరణ జరగాలి. దీని ప్రకారం, అది సాధించబడాల్సిన తేదీ అనగా, మార్చి 31, 2022 లో మార్పులేదు.

దీనికి సంబంధించిన సర్క్యులర్, సెప్టెంబర్ 7, 2020 నాటి గత సూచనలను సవరిస్తూ, త్వరలో జారీ చేయబడుతుంది.

(యోగేశ్ దయాల్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2021-2022/645

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?