<font face="mangal" size="3">ప్రగతిశీల మరియు నియంత్రణ విధానాల పై నివేదిక - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రగతిశీల మరియు నియంత్రణ విధానాల పై నివేదిక–ఫిబ్రవరి2018
వస్తు మరియు సేవా పన్నుల క్రింద నమోదు కాబడిన ఎంఎస్ఎంఇ,
రుణ గ్రహీతలకు ఊరట
February 07 2018 ప్రగతిశీల మరియు నియంత్రణ విధానాల పై నివేదిక–ఫిబ్రవరి2018 1. వస్తు మరియు సేవా పన్నుల క్రింద క్రమబద్ధీకరణ జరుగుతున్న దశలో, కొన్ని చిన్న సంస్థలకు నగదు సమస్యలు తలెత్తి,బ్యాంకులకు, బ్యాంకిగేతర ఆర్థిక సంస్థలకు చెల్లింపు చేయుటలో కష్టాలు కల్పించింది. ఆగస్ట్ 31, 2017 న ప్రమాణికంగా ఉన్న ఇట్టి సంస్థల క్రమబద్ధీకరణకు తోడ్పడుటకు, ఈ క్రింది విధంగా నిశ్చయించుట జరిగినది – జనవరి 31, 2018 తేదీన మొత్తం, రూ.250 మిలియన్ కన్నఎక్కువ బాకీ లేని ఎంఎస్ఎంఇ లు, సెప్టెంబర్ 1, 2017 చెల్లించ వలసిన బకాయిలు; సెప్టెంబర్ 1, 2017 మరియు జనవరి 31, 2018 మధ్యలో చేయవలసిన చెల్లింపులు, వాటి అసలు చెల్లింపు తేదీ నుండి 180 రోజుల వరకు, వారి రుణాల శ్రేణి, తక్కువ చేయకుండా అంగీకరించవలెను. ప్రాధాన్యరంగం క్రింద, ఎంఎస్ఎంఇ (సేవలు)పరపతిపై,పరిమితి తొలగింపు 2. వివిధ సహ భాగస్వాముల అభిప్రాయాలు, ఆర్థిక వ్యవస్థలో సేవారంగపు ప్రాధాన్యత పెరుగుతున్న సంగతి దృష్టిలో ఉంచుకొని, ప్రాధాన్యరంగ వర్గీకరణకై, ప్రస్తుతం ప్రతి మైక్రో రుణ గ్రహీతపై విధించిన రూ. 50 మిలియన్; మరియు ప్రతిచిన్న / మధ్యమ రుణగ్రహీతపై విధించిన రూ.100 మిలియన్, పరిమితులు, ఎత్తివేయాలని నిశ్చయించడం జరిగింది.తదనుసారంగా, ఎంఎస్ఎంఇడి ఏక్ట్, 2006 లో నిర్వచించిన సేవలు కల్పిస్తున్న / అందిస్తున్న సంస్థలకు జారీచేసిన రుణాలు, పరిమితితో ప్రమేయం లేకుండా, ప్రాధాన్య రంగ రుణాల క్రింది వస్తాయి. 20 కన్న ఎక్కువ శాఖలు గల విదేశీ బ్యాంకులకు,చిన్న మరియు అతిచిన్న వర్గం రైతులు/సూక్ష్మ సంస్థలకు,వర్తించే ఉప – లక్ష్యాలు (sub-targets). 3. ప్రాధాన్య రంగాలకు రుణ వితరణలో సమానావకాశాలు కల్పించుటకు, ఏప్రిల్ 2015 లో, మార్గదర్శకాలు జారీచేసిన మూడు సంవత్సరాల తరువాత (అనగా 2018 లో), 20 లేక అంతకు మించి శాఖలుగల విదేశీ బ్యాంకులకు, చిన్నమరియు అతిచిన్న రైతులు / సూక్ష్మ సంస్థలు మధ్య ఉప-లక్ష్యాలు నిర్దేశించబడతాయని ప్రకటించడం జరిగింది. తదనుసారంగా, 20 లేక అంతకు మించి శాఖలుగల విదేశీ బ్యాంకులకు, 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి చిన్న, అతిచిన్న రైతులకు ఉపలక్ష్యం 8% గా; సూక్ష్మ సంస్థలకు లక్ష్యం 7.5%గా నిశ్చయించడం జరిగింది [అడ్జస్టెడ్నెట్బ్యాంక్క్రెడిట్ (ANBC) లేదా క్రెడిట్ ఈక్వివలెంట్ అమౌంట్ ఆఫ్, ఆఫ్-బ్యాలెన్స్షీట్ ఎక్స్పోజర్ (CEOBE), ఏది ఎక్కువ అయితే దాని ఆధారంగా]. బెంచ్ మార్క్రేట్విధానాన్ని సమన్వయంచేయుట. 4. బేస్రేట్విధానంలో గల ఇబ్బందులను గమనించి, రిజర్వ్బ్యాంక్, ఏప్రిల్ 1, 2016 నుండి, నిధుల మార్జినల్ధరపై (Marginal Cost of Funds based Lending Rates, MCLR, ఎంసిఎల్ఆర్) ఆధారిత, రుణరేట్లవిధానంప్రవేశపెట్టింది. ప్రస్తుతం, బేస్రేటుకు జోడించి నరుణాలు కూడా ఎంసిఎల్ఆ ర్‌కు, మారతాయని ఆశించడం జరిగింది. అయితే, రిజర్వ్బ్యాంక్ ఇదివరలో ద్రవ్యవిధాన నివేదికలలో, ఈవి షయంపై పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసినా, బ్యాంకు రుణాల్లో అధిక భాగం, ఇంకా బేస్రేట్మీదనే ఆధారపడటం కొనసాగుతోంది. విధాన రేట్లలో మార్పులకు, ఎంసిఎల్ఆర్, మరింతగా స్పందిస్తుంది గనుక, ఏప్రిల్ 1, 2018 నుండి, బేస్రేటును, ఎమ్‌సిఎల్ఆర్ తో జోడించి, బెంచ్మార్క్నిర్ణయించే పద్ధతి ప్రవేశ పెట్టాలని నిశ్చయించింది. అవసరమైన ఆదేశాలు, వచ్చేవారం చివరిలో జారీ చేయబడతాయి. రెపోకు సంబంధించి,సమగ్ర మార్గదర్శకాలు 5. ప్రస్తుతం రెపో మార్గదర్శకాలు, ప్రభుత్వ సెక్యూరిటీలకు, కార్పొరేట్రుణాలకు, విడిగా జారీ చేయబడుతున్నాయి. వీటిలో, రెపో లావాదేవీలు జరుపుటకు అర్హతగల సంస్థలు మరియు, తనఖాగా పెట్టే కార్పొరేట్బాండ్లకు కావలసిన కనీస రేటింగ్, సూచించబడ్డాయి. కార్పొరేట్రుణాల ప్రాచుర్యం పెంచడానికి, వివిధరకాల తాకట్లపై (collateral) గల నియమాలను సమ్మిళితం చేయుటకు, రెపో మార్గదర్శకాలను చక్కపరచి, సరళీకరించాలని నిశ్చయించడం జరిగింది. ఈనెల చివరిలోగా, సవరించిన మార్గదర్శకాలు జారీ చేయబడతాయి. ప్రవాసులకు, దేశంలోనే విదేశీ మారక హెడ్జింగ్చేయుటకు వెసులుబాటు 6. ప్రస్తుతం, ప్రవాస భారతీయులు (non-resident Indians) వారి కరెంట్మరియుక్యాపిటల్లావాదేవీలపై రాగల INR కరెన్సీ నష్టభయాలను (currency risks)హెడ్జింగ్చేసుకోవాలనుకొంటే, హెడ్జింగ్చేయుటకు అనుమతించబడిన నష్టభయాలు మరియు హెడ్జింగ్సాధనాలపై(instruments),కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఈ ప్రక్రియ సరళీకరించుటకు, ఇకపై వారి కరెన్సీ, వడ్డీరేట్లు(మసాలా బాండ్లతో కలిపి),దేశంలోనే, అనుమతించబడిన సాధనాల ద్వారా, హెడ్జ్చేసుకోవచ్చు. ఈ విషయమై FEMA ప్రకటన చేసిన తరువాత, సర్క్యులర్జారీ చేయబడును. ఎక్స్చేంజ్ట్రేడెడ్కరెన్సీ డిరైవేటివ్స్ (Exchange Traded Currency Derivatives, ETCD) పై, పరిమితుల సవరణ 7. ప్రస్తుతం యూఎస్ $ - ఐఎన్‌ఆర్ (US $ -INR)లోయుఎస్ $ 15 మిలియన్ వరకు; ఇతర కరెన్సీలు – ఐఎన్‌ఆర్, యుఎస్ $ విలువ 5 మిలియన్ వరకు, హెడ్జింగ్చేయుటకు, దానికి ఆధారమైన లావాదేవీ రుజువుగా చూపనవసరంలేదు. ఈ పరిమితి,మార్చ్ 2015లో సమీక్షించబడినది. తరువాత, మారకంలో INR ఉన్నట్లయితే, కరెన్సీఆప్షన్ కాంట్రాక్టులను, అనుమతించింది. ఎక్స్చేంజ్ట్రేడెడ్కరెన్సీ డిరైవేటివ్‌లను మరింతగా ప్రోత్సహించుటకు, విదేశీ కరెన్సీ – ఐఎన్‌ఆర్లావాదేవీలకు, వివిధస్థాయిలలోగల అన్నిపరిమితులూకలిపి, ప్రతిఒక్కరికి (రెసిడెంట్, నాన్-రెసిడెంట్ ఇద్దరికీ), యుఎస్ $ 100 మిలియన్ పరిమితి (అన్ని ఎక్స్చేంజ్ట్రెడ్డిరైవేటివ్ లకు, అన్నిఎక్స్చేంజిలలో కలిపి) కల్పించాలని,నిశ్చయింఛడం జరిగింది. ఇందుకు అవసరమైన సర్క్యులర్, ఈ నెల చివరకు జారీ చేయబడుతుంది. జి–సెక్బెంచ్‌మార్క్మరియు విదేశీ మారక రెఫరెన్స్రేట్, FBIL ఆధీనంలోకి 8. కమిటీ ఆన్ ఫైనాన్షియల్బెంచ్‌మార్క్స్ (Committee on Financial Benchmarks) సిఫారసుల ఆధారంగా, ఫైనాన్షియల్బెంచ్‌మార్క్స్ఇండియాప్రై.లి. (ఎఫ్బిఐఎల్, Financial Benchmarks India Private Ltd., FBIL) 2014 లో,స్థాపించబడింది.ఎఫ్బిఐఎల్, ఇంతవరకు ప్రస్తుతం ఉన్న, ముంబై ఇంటర్‌బ్యాంక్ఔట్‌రైట్రేట్ (MIBOR) మరియు ఆప్షన్ వొలటిలిటీ వంటి బెంచ్‌మార్కులను తీసుకొని, మార్కెట్రిపో ఓవర్‌నైట్రేట్ (MIROR), సర్టిఫికేట్ ఆఫ్డెపాజిట్స్ (Certificate of Deposits, CDs) మరియు టి-బిల్స్ ఈల్డ్కర్వులవంటి (T-Bills yield Curve) క్రొత్త బెంచ్‌మార్కులను, ప్రవేశ పెట్టింది. ఎఫ్ఐబిఎల్, అన్ని ఫైనాన్షియల్బెంచ్‌మార్కులను (వాటి విలువకట్టుటతో సహా) నిర్వహించే స్వతంత్ర సంస్థగా వికసించడం,ఈ బెంచ్‌మార్కుల, విశ్వసనీయతకు, ఆర్థిక విపణుల నిజాయితీకి, ఎంతో ముఖ్యం. తదనుసారంగా, ఈ క్రింది విధంగా నిశ్చయించడం జరిగింది - (i) ప్రభుత్వ సెక్యూరిటీల(కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన) విలువ కట్టడంలో ప్రామాణికత కల్పించే బాధ్యత ఎఫ్బిఐఎల్స్వీకరిస్తుంది. (ప్రస్తుతం ఈ బాధ్యత, FIMMDA నిర్వహిస్తోంది), మరియు (ii) ప్రస్తుతం రిజర్వ్బ్యాంక్నిర్వహిస్తున్న, యుఎస్ $ -ఐఎన్ ఆర్ (Spot US $-INR reference rate) /ఇతర ప్రముఖ కరెన్సీలయొక్క స్పాట్రెఫరెన్స్రేట్గణన మరియు ప్రసారం చేసే బాధ్యత కూడా ఎఫ్బిఐఎల్, చేపడుతుంది. ఇది అమలులోకి వచ్చే తేదీ, ఎఫ్బిఐఎల్, రిజర్వ్బ్యాంక్తెలియచేస్తాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఖాతాదారులకు,ఆంబుడ్జ్‌మన్ పథకం 9. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బిఎఫ్సిలు, Non-banking Financial Companies, NBFCs) ఖాతాదారులు శీఘ్రతరమైన ఫిర్యాదుల పరిష్కార విధానం ఉచితంగా పొందుటకు, NBFC లకు ఆంబుడ్జ్‌మన్ పథకం ప్రవేశ పెట్టాలని నిశ్చయించడం జరిగింది. డిపాజిట్లు స్వీకరిస్తున్న అన్ని ఎన్ బిఎఫ్సిలు మరియు వినియోగదారులతో లావాదేవీలు జరుపుతూ, రూ 1 బిలియన్ అంతకుమించి ఆస్తులుగల ఎన్‌బిఎఫ్సి లకు, ఈ పథకం వర్తిస్తుంది. ఈ నెల చివరకు, డిపాజిట్ల స్వీకరిస్తున్న అన్నిఎన్ బిఎఫ్సిలలో,ఈ పథకం ప్రారంభించ బడుతుంది. కరెన్సీ నిర్వహణ వ్యవస్థపై సమీక్ష 10. అక్టోబర్ 4, 2016 తేదీన జరిగిన నాలుగవ ద్వైమాసిక ద్రవ్య విధాన నివేదికలో ప్రకటించినట్లుగా, రిజర్వ్బ్యాంక్, కరెన్సీ నిర్వహణ (రవాణాలోఉన్ననిధుల రక్షణతో సహా) విధానాన్ని కూలం కషంగా సమీక్షించుటకు రెండు ఉన్నత స్థాయి అంతర్-సంస్థాగత సంఘాలను (inter-agency committees)నియమించింది. ప్రభుత్వాన్ని సంప్రదించి, రిజర్వ్బ్యాంక్, నాలుగు కరెన్సీ ముద్రణాలయాల (రిజర్వ్బ్యాంక్సబ్సిడియరీ చే నిర్వహించబడుతున్న విరెండు; ప్రభుత్వ విభాగంచే నిర్వహించబడుతున్నవిరెండు) ఆడిట్ ఏర్పాటు చేసింది. నోట్ముద్రణ విధానం, ముడి సరకు సేకరణ, నాణ్యత ప్రక్రియలు, రక్షణ మొదలైన అంశాలు, ప్రమాణీకరించుట,ఈ ఆడిట్ యొక్క ఉద్దేశము. పై కమిటీల సిఫారసులను తొమ్మిది నెలలలోగా, అమలు చేయుటకు, ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబడుతోంది. కరన్సీ వితరణ మరియు మార్పిడి పథకం (CDES) 11. కరెన్సీ క్రియాకలాపాలలో సాంకేతికత వినియోగాన్ని పెంచి, తద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలందించుటకు అవసరమైన వివిధ యంత్రాల వ్యవస్థాపనకు,రిజర్వ్బ్యాంక్ ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ ప్రయోజనం చాలా మేరకు నెరవేరింది. ఆర్థిక వవస్థలో, నగదు వినియోగం తగ్గించే దిశగా, ప్రొత్సాహకపథకాలు సమీక్షించడం జరిగింది. క్యాష్రిసైక్లర్మషీన్లు (CRMs), ఆటోమేటెడ్ మెషీన్స్ (ATMs) స్థాపనకు ఇకపై ప్రోత్సాహకాలు నిలిపివేయాలని నిశ్చయించబడింది. జోస్జెకత్తూర్ పత్రికా ప్రకటన: 2017-2018/2147 |