<font face="mangal" size="3px">అభివృద్ధి మ‌రియు నియంత్ర‌ణా విధానాలపై ప్ర‌& - ఆర్బిఐ - Reserve Bank of India
అభివృద్ధి మరియు నియంత్రణా విధానాలపై ప్రకటన భారతీయ రిజర్వ్ బ్యాంక్
ఏప్రిల్ 06, 2017 అభివృద్ధి మరియు నియంత్రణా విధానాలపై ప్రకటన ఈ ప్రకటన రిజర్వ్ బ్యాంక్ ఇటీవల తన విధానపరమైన ప్రకటనలలో పేర్కొన్న వివిధ అభివృద్ధి మరియు నియంత్రణా విధాన చర్యల పురోగతిని సమీక్షించి, లిక్విడిటీ మేనేజ్ మెంట్ వ్యవస్థను మరింత సంస్కరించుటకు; బ్యాంకింగ్ నియంత్రణ మరియు పర్యవేక్షణను బలోపేతం చేసేందుకు; ఫైనాన్షియల్ మార్కెట్లను విస్తృతపరిచేందుకు; చెల్లింపులు మరియు ఒప్పందాల వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం ద్వారా ఆర్థిక సేవల అందుబాటును విస్తృతపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. I. ద్రవ్య విధాన కార్యకలపాల కోసం లిక్విడిటీ మేనేజ్ మెంట్ ఫ్రేమ్ వర్క్ 2. డ్యూరబుల్ మరియు ఫ్రిక్షనల్ లిక్విడిటీ రెండింటిలో భరోసా ఇచ్చేలా, లిక్విడిటీ మేనేజ్ మెంట్ ఫ్రేమ్ వర్క్ లో ఏప్రిల్, 2016లో మార్పులు చేయడం జరిగింది. వ్యవస్థలోని సగటు ex-ante లిక్విడిటీ డఫిషిట్ ను క్రమక్రమంగా తగ్గిస్తూ న్యూట్రాలిటీకి చేరుకోవడమే దీని లక్ష్యం. ఈ భరోసాకు అనుగుణంగా, RBI ప్రస్తుత సంవత్సరం నవంబర్ 8, 2016 వరకు ఓపెన్ మార్కెట్ కొనుగోళ్ల కార్యకలాపాలు, నెట్ ఫారెక్స్ మార్కెట్ కార్యకలాపాలు మరియు ప్రభుత్వ సెక్యూరిటీల బైబ్యాక్ ల ద్వారా సుమారు రూ.2.1 ట్రిలియన్ల డ్యూరబుల్ లిక్విడిటీతో ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేసింది. దీని వల్ల Q1 లో సిస్టమ్ లెవల్ ex-ante లిక్విడిటీ స్థాయి రోజువారీ సగటు రూ.813 బిలియన్ల లోటు నుంచి Q2 లో రూ.292 బిలియన్ల అదనపు స్థాయికి, Q3 లో రూ.64 బిలియన్లకు చేరుకుంది (నవంబర్ 8, 2016 వరకు) 3. డీమానిటైజేషన్ అనంతరం, బ్యాంకింగ్ వ్యవస్థను ఒక నిరంతర భారీ స్ట్రక్చరల్ లిక్విడిటీ సర్ ప్లస్ ప్రభావితం చేసింది. రిజర్వ్ బ్యాంక్ సాధారణ, అసాధారణ చర్యల కలయికతో మనీ మార్కెట్ రేట్లు రెపో రేటుకు అనుగుణంగా ఉండేట్లు ఈ సర్ ప్లస్ లిక్విడిటీని తనలోకి ఇముడ్చుకుంది. జనవరి ప్రారంభంలో అత్యధిక స్థాయిలో ఉన్న సర్ ప్లస్ క్రమక్రమంగా తగ్గిపోవడంతో, MSS అథరైజేషన్ కింద ఉన్న సెక్యూరిటీల కాలపరిమితి ముగియడంతో సర్ ప్లస్ లిక్విడిటీని ఇముడ్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ క్రమంగా వేరియబుల్ రివర్స్ రెపో రేటు వైపు మరలింది. ఈ సర్ ప్లస్ లిక్విడిటీ 2017-18 వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. 4. సర్ ప్లస్ లిక్విడిటీ నిర్వహణ: రిజర్వ్ బ్యాంక్ తన ద్రవ్య విధానానికి అనుగుణంగా సిస్టమ్ లిక్విడిటీని న్యూట్రాలిటీకి దగ్గరగా తెచ్చేందుకు కట్టుబడి ఉంది. ఈ లక్ష్యం సాధించే దిశగా రిజర్వ్ బ్యాంక్ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా లిక్విడిటీకి అవసరమైన పలు చర్యలను తీసుకుంటుంది.
5 నవంబర్, 2015 నుంచి రిజర్వ్ బ్యాంక్ RBI చట్టాన్ని సవరించడం ద్వారా ఒక స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది. ఇది ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే, రిజర్వ్ బ్యాంకుకు లిక్విడిటీ కార్యకలాపాల నిర్వహణ చాలా సులభతరమవుతుంది. 6. మానిటరీ పాలసీ రేట్ కారిడార్ను తగ్గించడం: ద్రవ్య విధాన ఫ్రేమ్ వర్క్ ను సవరించి, బలోపేతం చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన నిపుణుల బృందం (ఛైర్మన్: డాక్టర్ ఉర్జిత్ ఆర్.పటేల్) ప్రతిపాదనలకు అనుగుణంగా, ద్రవ్య విధాన ఆపరేటింగ్ లక్ష్యం అయిన వెయిటెడ్ యావరేజ్ కాల్ రేట్ (WACR) కు మరియు రెపో రేటుకు అనుబంధంగా ఉండేలా పాలసీ రేట్ కారిడార్ ను +/- 100 bps నుంచి +/- 50 bpsకు తగ్గించడం జరిగింది. అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో లేదా ఎక్కువ లిక్విడిటీ కొనసాగే పరిస్థితులలో, వేగవంతమైన లిక్విడిటీ కోసం అనేక మార్కెట్ పార్టిసిపెంట్స్ మార్కెట్ కు ఒకే వైపున ఉన్న సందర్భాలలో, పాలసీ రేట్ కారిడార్ ను తగ్గించడం వల్ల ఆపరేటింగ్ లక్ష్యాన్ని పాలసీ రేటుతో అనుసంధానించడం సులభతరమవుతుంది. తదనుగుణంగా పాలసీ రేట్ కారిడార్ ను వెనువెంటనే పాలసీ రెపో రేట్ చుట్టూ, +/- 50 bps నుంచి +/-25 bps కు తగ్గించడం జరిగింది. తత్ఫలితంగా, లిక్విడ్ అడ్జస్ఠ్ మెంట్ ఫెసిలిటీ (LAF) కింద ఉన్న రివర్స్ రెపో రేటు పాలసీ రెపో రేటుకన్నా 25 bps లు తక్కువగా ఉండి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు పాలసీ రెపో రేటు కన్నా 25 bps ఎక్కువగా ఉంటుంది. 7. LAF టర్మ్ రెపోస్ కింద కొల్లాటరల్ ప్రత్యామ్నాయము. : ప్రస్తుతం రెపోల కింద LAF పార్టిసిపెంట్లు రిజర్వ్ బ్యాంక్ కు కొల్లాటరల్గా సెక్యూరిటీలను ఆఫర్ చేసే అవకాశం లేదు. అయితే మార్కెట్ పార్టిసిపెంట్లు టర్మ్ రెపోల రూపేణా LAF కింద కొల్లాటరల్లను ప్రత్యామ్నాయంగా అనుమతించాలని నిర్ణయించడంమైనది. దీని వల్ల వాటికి నిర్వహణాపరమైన సర్దుబాటు లభించి, కొల్లాటరల్స్ లిక్విడిటీ పెరుగుతుంది. ఈ సదుపాయం ఏప్రిల్ 17, 2017 నుంచి అందుబాటులోకి వస్తుంది. II. బ్యాంకింగ్ నియంత్రణ మరియు పర్యవేక్షణ 8. బ్యాంకులకు రివైజ్డ్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (PCA) ఫ్రేమ్ వర్క్: ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి మండలి (FSDC-SC) సబ్ కమిటీ ప్రతిపాదనల ఆధారంగా, బ్యాంకుల యొక్క ప్రస్తుత PCA ఫ్రేమ్ వర్క్ ను బోర్డ్ ఫర్ ఫైనాన్షియల్ సూపర్ విజన్ (BFS) యొక్క అనుమతితో సమీక్షించి, అప్ డేట్ చేసి, ఆమోదించడం జరిగింది. అప్ డేటెడ్ PCA ను ట్రిగ్గర్ చేసే సూచికల్లో క్యాపిటల్ (క్యాపిటల్-టు-రిస్క్ వెయిడ్ అసెట్ రేషియో (CRAR) మరియు కామన్ ఈక్విటీ టయర్ 1 (CET1 ) నిష్పత్తి), నికర నిరర్థక ఆస్తుల (NPA) నిష్పత్తి మరియు ఆస్తులపై రిటర్న్స్ ఉంటాయి. అదనంగా లివరేజ్ను కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. PCA క్రింద ఉన్న బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిన విధంగా తప్పనిసరి మరియు విచక్షణాపూర్వక చర్యలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. బ్యాంకులకు రివైజ్డ్ PCA ను 2017 ఏప్రిల్ మధ్యభాగంలో విడుదల చేయడం జరుగుతుంది. 9. అసెట్ రీ- కన్స్ట్రక్షన్ కంపెనీలు (ARC): నెట్ ఓన్డ్ ఫండ్స్ (NOF)ల కనీస స్థాయిని పెంచడం - సెక్యూరిటైజేషన్ అండ్ రీ- కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ (SARFAESI) యాక్ట్, 2002లో గతంలో కనీసం ‘రూ.2 కోట్ల సొంత నిధులు’ అన్న ఏర్పాటును 2016లో కనీసం ‘రూ.2 కోట్ల నికర సొంత నిధులు’ (NOF) అని మార్చడం జరిగింది. సొంత నిధులపై ఉన్న ఆర్థిక సంపదపై ఉన్న 15 శాతం పరిమితిని ఎత్తివేయడం జరిగింది. పెరిగిన ARC ల పాత్ర, మరియు నగదు ఆధారిత కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో, ARC లకు కనీస NOF లను రూ.100 కోట్లుగా చేయాలని ప్రతిపాదించడమైనది. అవసరమైన సూచనలను 2017 ఏప్రిల్ చివరి భాగంలో విడుదల చేయడం జరుగుతుంది. 10. పార్షిక పరపతి పెంపు (PCE): క్యాపిటల్ అవసరాలు - PCE ఎన్ హ్యాన్స్డ్ బాండ్ యొక్క ప్రీ -ఎన్హ్యాన్స్డ్ రేటింగ్ తదుపరి కాలంలో జారీ చేసినప్పటికన్నా పెరిగినట్లయితే, లెక్కించిన క్యాపిటల్ ఎన్హ్యాన్స్ మెంట్ రేటింగ్కు ముందు, తర్వాత ఉన్న తేడా ప్రకారం ఉంటుందని ప్రతిపాదించడమైనది. అది ఎక్స్ టెంట్ ఫ్లోర్ (PCE ఎన్హ్యాన్స్డ్ బాండ్లు జారీ చేసే సందర్భంలో PCE లకు కావలసిన క్యాపిటల్ అవసరాలు) లేదా జారీ చేసే సందర్భంలో రేటింగ్లో నాచెస్ ఆఫ్ ఇంప్రూవ్ మెంట్ సంఖ్య మెయిన్ టెయిన్ చేయడం లాంటి పరిమితులకు లోబడి ఉండదు. అవసరమైన సూచనలను 2017 ఏప్రిల్ మధ్య భాగంలో విడుదల చేయడం జరుగుతుంది. బ్యాంకుల ద్వారా PCE లకు అర్హత పొంది ఉండాలంటే, ఆ బాండ్లు రిజర్వ్ బ్యాంక్ అక్రెడిటేషన్ పొందిన రెండు సంస్థల ద్వారా రేటింగ్ పొందాల్సి ఉంటుంది. 11. బ్యాంకింగ్ ఔట్ లెట్లు: తుది మార్గదర్శకాలు - బ్యాంకింగ్ ఔట్ లెట్ అనగా ఏమిటి? అనేదానిపై స్పష్టతనిచ్చేందుకు మరియు అన్-డిజర్వఢ్ ప్రాంతాలలో ఔట్ లెట్లు తెరవడం కోసం అన్ని రకాల బ్యాంకుల పట్ల ఏకరీతిగా వ్యవహరించేందుకు బ్యాంకింగ్ ఔట్ లెట్లకు తుది మార్గదర్శకాలు విడుదల చేయాలని ప్రతిపాదించడమైనది, ఇవి ప్రస్తుతం అమలులో ఉన్న శాఖల లైసెన్సింగ్ మార్గదర్శకాల స్థానంలో అమలులోకి వస్తాయి. సవివరమైన మార్గదర్శకాలను ఏప్రిల్ చివరి వారం, 2017లో విడుదల చేస్తారు. 12. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్ (REITS) మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్ (InvITs): బ్యాంకుల భాగస్వామ్యం - సెక్యూరిటీస్ మరియు ఎక్చ్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) REITS మరియు InvITsలకు నిబంధనలను ఏర్పాటు చేసి, బ్యాంకులు ఈ పథకాలలో భాగస్వామ్యం పంచుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం బ్యాంకులు తమ NOF లలో 20 శాతం వరకు నిధులను ఈక్విటీ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ మరియు ఈక్విటీలలో పెట్టేందుకు అనుమతిస్తున్నారు. ఇప్పుడు అదే పరిమితితో బ్యాంకులు REITS మరియు InvITs లలో కూడా పెట్టుబడి పెట్టేందుకు అనుమతించాలని ప్రతిపాదిస్తున్నారు. సవివరమైన మార్గదర్శకాలను ఏప్రిల్ చివరి వారం, 2017లో విడుదల చేస్తారు. 13. కౌంటర్ సైక్లికల్ క్యాపిటల్ బఫర్: కౌంటర్ సైక్లికల్ క్యాపిటల్ బఫర్ (CCCB) యొక్క ఫ్రేమ్ వర్క్ ను రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 5, 2015న విడుదల చేసిన మార్గదర్శకాల ద్వారా పేర్కొనడం జరిగింది. వాటిలో అవసరమైన పరిస్థితులు తలెత్తినపుడు CCCB ని యాక్టివేట్ చేస్తామని సూచించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని సాధారణంగా నాలుగు త్రైమాసికాల ముందస్తు కాలపరిమితితో ప్రకటిస్తారు. ఈ ఫ్రేమ్ వర్క్ క్రెడిట్ - టు - GDP అంతరం ప్రధాన సూచికగా తీసుకుంటుంది. దీనిని ఇతర సూచికలు - మూడేళ్ల కదిలే కాలానికి క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి (క్రెడిట్-టు- GDP అంతరం మరియు GNPA అభివృద్ధితో దాని సంబంధం మీద ఆధారపడి), పారిశ్రామిక దృక్పథ అంచనా సూచిక (GNPA అభివృద్ధితో దానికున్న సంబంధాన్ని గుర్తిస్తూ) మరియు ఇంటరెస్ట్ కవరేజ్ నిష్పత్తి (క్రెడిట్-టు- GDPతో దాని అంతరాన్ని గుర్తిస్తూ) ఇతర అదనపు సూచికలతో కలిసి వాటిని ఉపయోగించుకోవచ్చు. CCCB సూచికల సమీక్ష మరియు ఎంపిరికల్ టెస్టింగ్ ఆధారంగా, ప్రస్తుతం CCCB ని యాక్టివేట్ చేయడం అవసరం లేదని భావించడం జరిగింది. III. ఫైనాన్షియల్ మార్కెట్లు 14. విదేశీ మారకద్రవ్య ఎక్స్ పోజర్ కొరకు సింప్లిఫైడ్ హెడ్జింగ్ సౌకర్యం: ముసాయిదా మార్గదర్శకాలు - ఆగస్టు 25, 2016న రిజర్వ్ బ్యాంక్ ఎక్చ్ చేంజ్ రేట్ రిస్క్ ఉన్న సంస్థలు, అవి మన దేశానికి చెందినవైనా, విదేశాలకు చెందినవైనా, ఏ సమయంలోనైనా 30 మిలియన్ల అమెరికా డాలర్ల పరిమితి వరకు సింప్లిఫైడ్ ప్రొసీజర్స్ తో కూడిన హెడ్జింగ్ కార్యకలాపాలను చేపట్టేందుకు అనుమతినిచ్చే పథకాన్ని ప్రకటించింది. ఈ పథకానికి చెందిన ముసాయిదా మార్గదర్శకాలను ఏప్రిల్ మధ్యభాగం, 2017 వరకు పబ్లిక్ డొమైన్ లో ఉంచడం జరుగుతుంది. 15. ట్రైపార్టీ రెపో పరిచయం: ముసాయిదా ఫ్రేమ్ వర్క్ - భారతదేశంలో కార్పొరేట్ బాండ్ మార్కెట్ అభివృద్ధి పై వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదించినట్లుగా (ఛైర్మన్: శ్రీ హెచ్ ఆర్ ఖాన్) ట్రై పార్టీ రెపోను ప్రవేశపెట్టడానికి ఒక ముసాయిదా పాలసీ ఫ్రేమ్ వర్క్ ను ఏప్రిల్ మధ్యభాగం, 2017 వరకు పబ్లిక్ డొమైన్ లో ఉంచడం జరుగుతుంది. IV. చెల్లింపులు మరియు పరిష్కారాలు 16. జాతీయ ఎలెక్ట్రానిక్ నిధుల బదిలీ (NEFT) కొరకు అదనపు సెటిల్ మెంట్ బ్యాచుల ఏర్పాటు - చెల్లింపులు మరియు పరిష్కారాలపై విడుదల చేసిన విజన్ - 2018 డాక్యుమెంట్ లో సూచించినట్లుగా NEFT సెటిల్మెంట్ కాలచక్రాన్ని గంట బ్యాచ్ ల నుంచి అరగంట బ్యాచ్ లకు తగ్గించడం జరుగుతుంది. తదనుగుణంగా, 11 అదనపు సెటిల్ మెంట్ల బ్యాచ్ లను ఉదయం 8.30 గంటల తర్వాత అనుమతించడం జరుగుతుంది. దీంతో మొత్తం అరగంట సెటిల్ మెంట్ బ్యాచ్ల సంఖ్య 23కు చేరుతుంది. దీని వల్ల నెఫ్ట్ వ్యవస్థ యొక్క సామర్థ్యం మెరుగుపడి, ఖాతాదారులకు అందుబాటులో ఉండే సమయం పెరుగుతుంది. గతంలోలాగే ప్రారంభ బ్యాచ్ ఉదయం 8 గంటలకు తెరచుకొని, రాత్రి 7 గంటలకు మూసివేయబడుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న అలవాటు ప్రకారం, రిటర్న్ డిసిప్లిన్ కూడా ఎప్పటిలాగే, అనగా బీ B+ 2 గంటలు (సెటిల్ మెంట్ బ్యాచ్ టైమ్ ప్లస్ రెండు గంటలు) ఉంటుంది. 17. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR): హేతుబద్ధీకరణ - రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 16, 2017న ‘‘డెబిట్ కార్డ్ లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) హేతుబద్ధీకరణ’’పై ముసాయిదా సర్క్యులర్ ను విడుదల చేసింది. దీనిపై ప్రభుత్వం నుంచి, కార్డ్ నెట్ వర్క్ ల నుంచి, భారతీయు బ్యాంకుల అసోసియేషన్ నుంచి, పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి, ప్రైవేట్ సంస్థల నుంచి, వ్యక్తుల నుంచి విస్తృతమైన ఫీడ్ బ్యాక్ అందగా, ప్రస్తుతం దానిని పరిశీలించడం జరుగుతోంది. తుది మార్గదర్శకాలు విడుదలయ్యేంతవరకు డెబిట్ కార్డు లావాదేవీలకు MDR పై యిప్పుడు ఉండే సూచనలే కొనసాగుతాయి. 18. భారతదేశంలో ప్రీపెయిడ్ ఇన్ స్ట్రుమెంట్స్ (PPI) జారీ మరియు కార్యకలాపాలు - రిజర్వ్ బ్యాంక్ ‘‘భారతదేశంలో ప్రీపెయిడ్ ఇన్ స్ట్రుమెంట్స్ (PPI) జారీ మరియు కార్యకలాపాల’’పై మార్చి 20, 2017న ముసాయదా సర్క్యులర్ ను విడుదల చేసింది. దానిపై కామెంట్స్కు మార్చి 31, 2017న తుదిగడువుగా నిర్ణయించింది. వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞాపనలను అనుసరించి, కామెంట్స్ గడువును ఏప్రిల్ 15, 2017 వరకు పొడిగించింది. PPI లపై తుది మార్గదర్శకాలను 2017 మే చివరి భాగంలో విడుదల చేయడం జరుగుతుంది. V. ఆర్థిక సమీకృతం 19. ఆర్థిక అక్షరాస్యతపై పైలెట్ ప్రాజెక్టు: ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు (CFL) - ఆర్థిక అక్షరాస్యతలో సృజనాత్మక, భాగస్వామ్య విధానాలను పెంపొందించేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక అక్షరాస్యతపై బ్లాక్ స్థాయిలో ఒక పైలెట్ ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. ఈ పైలెట్ ప్రాజెక్టు తొమ్మిది రాష్ట్రాలలోని 80 బ్లాకులలో స్పాన్సర్ బ్యాంకులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రారంభించబడుతుంది. డిపాజిటర్ విద్య మరియు అవగాహన నిధితో రిజిష్టర్ చేసుకున్న ఆరు స్వచ్ఛంద సంస్థలు - క్రిసిల్ ఫౌండేషన్, ముంబై; ధన్ ఫౌండేషన్; స్వధార్ ఫిన్ యాక్సెస్, ముంబై; ఇండియన్ స్కూల్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఫర్ విమెన్(ISMW), సమర్పిత్, చత్తీస్గఢ్; పేస్ ఫౌండేషన్లు బ్యాంకుల సహకారంతో ఈ పైలెట్ ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయించడం జరిగింది. ఈ పైలెట్ ప్రాజెక్టును ఈ క్రింది విస్తృత ప్రయోజనాల లక్ష్యంతో ప్రారంభించడం జరుగుతోంది: పొదుపు అలవాటును పెంచడం, సులభసాధ్యమైన రుణవిధానాలను ప్రోత్సహించడం; ఆర్థిక ప్రణాళికలు మరియు లక్ష్యాల నిర్దేశం; డిజిటల్ వైపుగా మరలడం మరియు వినియోగదారుల రక్షణ. ఈ CFLను ఒక ‘‘మనీ-వైస్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ’’ అన్న కామన్ పేరు మరియు లోగోతో ప్రారంభించడం జరుగుతుంది. స్పాన్సర్ బ్యాంకులు గుర్తించిన స్వచ్చంద సంస్థలతో మూడు నెలలలో, అనగా జూన్ 30, 2017 నాటికి ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. బ్యాంకులతో ఒప్పందాలు కుదిరిన మూడు నెలలలోగా ఈ స్వచ్ఛంద సంస్థలు CFLలుగా పని చేయడం ప్రారంభిస్తాయి. జోస్ జె.కట్టూర్ ప్రెస్ రిలీజ్: 2016-2017/2691 |