RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78508812

అభివృద్ధి, నియంత్రణ విధానాలపై నివేదిక, భారతీయ రిజర్వ్ బ్యాంక్

తేదీ: ఆగస్ట్ 02, 2017

అభివృద్ధి, నియంత్రణ విధానాలపై నివేదిక, భారతీయ రిజర్వ్ బ్యాంక్

1. ద్రవ్య విధానాన్ని మరింత ప్రభావశీలంగా చేయడానికి చర్యలు (Measures to Improve Monetary Policy Transmission)

ద్రవ్య సరఫరా మెరుగుపరచడానికి ఏప్రిల్ 2016 లో ప్రవేశపెట్టిన, నిధుల పరిమిత వెలపై ఆధారపడి వడ్డీరేట్ నిర్ణయించే విధానం (Marginal Cost of Funds Based Lending Rate, MCLR, ఎం సి ఎల్ ఆర్), బేస్ రేట్ విధానం కన్న మేలైనదయినా, తగినంత సంతృప్తికరంగా లేదు. ద్రవ్య సరఫరా మెరుగుచేయడానికి, ఎం సి ఎల్ ఆర్‌కు సంబంధించిన వివిధ అంశాలు మరియు బ్యాంకు రుణాల రేట్లు తిన్నగా మార్కెట్ ద్వారా నిర్ణయించబడ్డ రేట్లకు జోడించే అవకాశాలను పరిశీలించడానికి, రిజర్వ్ బ్యాంక్ ఒక అధ్యయిన బృందాన్ని నియమించింది. ఈ బృందం, సెప్టెంబర్ 24, 2017 లోగా నివేదిక సమర్పిస్తుంది.

ఇదిగాక, బ్యాంకు బేస్ రేట్లపై చేసిన అధ్యయనంలో, ఎం సి ఎల్ ఆర్ ప్రవేశ పెట్టిన తరువాత ఈ బేస్ రేట్లు, ఎం సి ఎల్ ఆర్ కంటే తక్కువగా మార్పులు చెందాయని తేలింది. బేస్ రేట్‌లో మొడితనం (బేస్ రేట్లలోమార్పు, ఎం సి ఎల్ ఆర్ లో సవరణలవల్లే కాకపోయినా), వాస్తవ ఆర్థిక వ్యవస్థను, ద్రవ్య విధానం సమర్థవంతంగా ప్రభావితం చేయలేకపోతోందని, ఆందోళన కలిగిస్తోంది. బ్యాంకుల ఫ్లోటింగ్‌ రేట్ రుణాల్లో సింహ భాగం, బేస్‌ రేట్‌కు జోడించి ఉండడం వల్ల, బ్యాంకుల నిధుల సమీకరణ ధరకు, బేస్ రేట్ మరింతగా స్పందించే దిశగా, రిజర్వ్ బ్యాంక్, అతిత్వరలో చర్యలు చేపడుతుంది.

2. లిక్విడిటీ కవరేజ్ నిష్పత్తి మార్గదర్శకాలలో సవరణలు (Amendment to LCR Guidelines)

ప్రస్తుతం అమలులో ఉన్న లిక్విడిటీ కవరేజ్ నిష్పత్తి మార్గదర్శకాల ప్రకారం, కనీస నగదు నిల్వల నిష్పత్తికి మించి ఉన్న నగదు (నగదు నిల్వలతో కలిపి), స్థాయి I, ఉత్తమ శ్రేణి ద్రవ్య సంపదగా (Level I, High Quality Liquid Asset, ఎచ్ క్యు ఎల్ ఎ) గుర్తించబడుతుంది. అయితే, ఇతర కేంద్రీయ బ్యాంకులలో ఉన్న అధిక నిల్వలు, ఎచ్ క్యు ఎల్ ఎ గా గుర్తించబడవు.

ఈ విషయాన్ని, సమీక్షించిన పిదప, భారత దేశంలో స్థాపనచేయబడ్డ బ్యాంకులు, విదేశీ కేంద్రీయ బ్యాంకులలో, ఆదేశంలో అవసరమైన నియమిత నిల్వల కన్న అధికంగా ఉంచిన నగదుకూడా ఎచ్ క్యు ఎల్ ఎ గా గుర్తి0C02చాలని, నిశ్చయించబడింది.

ఈ రోజు ఈ విషయమై, సర్క్యులర్ జారీ చేయబడుతోంది.

3. భారతదేశంలో పబ్లిక్ క్రెడిట్ రెజిస్ట్రీపై (Public Credit Registry, PCR, పి సి ఆర్) ఉన్నతస్థాయి కార్యాచరణ సంఘం (High Level Task Force)

రుణదాతలకూ/గ్రహీతలకు మధ్య సమాచార అంతరాలు లేకుండా చూడడానికీ, క్రెడిట్ మార్కెట్ సమర్థవంతంగా పనిచేయడానికీ, చాలాదేశాల్లో, సాధారణంగా, కేంద్రీయ బ్యాంకు / పర్యవేక్షణ సంస్థల ఆధ్వర్యంలో, ప్రైవేట్ పరపతి సంస్థలూ, పబ్లిక్ క్రెడిట్ రెజిస్ట్రీలు కలిసికట్టుగా కృషి చేస్తాయి. ప్రస్తుతం, భారత దేశంలో, రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో [పరపతి సమాచార సంస్థలు (నియంత్రణ) చట్టం, 2005 క్రింద, Credit Information Companies (Regulation) Act, 2005 (CICRA 2005)], నాలుగు సంస్థలు – CIBIL, Equifax, Experian, CRIF Highmark, పనిచేస్తున్నాయి. అతి పెద్ద రుణాలను పర్యవేక్షించడానికి, రిజర్వ్ బ్యాంకులో, పెద్ద రుణాల కేంద్రీయ సమాచార భండారం (సెంట్రల్ రెపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ ఆన్‌ లార్జ్‌ క్రెడిట్స్, Central Repository of Information on Large Credits) ఏర్పాటు చేయబడింది. ఖాతాగురించిన ప్రతి చిన్న సమాచారం కొరకు, సంగ్రహమైన బేసిక్ స్టాటిస్టికల్ రిటర్న్‌ (BSR-I) గణాంకాలు, రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్నాయి.

పరపతి అంచనాకు, వడ్డీ శాతం నిర్ణయించడానికి, కౌంటర్ సైక్లికల్ కేటాయింపులు బలపరచుకోవడనికి పి సి ఆర్ దోహదపడుతుంది. ద్రవ్య విధానం ప్రభావశీలంగా ఉందాలేదా, లేకపోతే దీనికి అడ్డంకులు ఏమిటి అని తెలిసికోవడానికి పి సి ఆర్, రిజర్వ్ బ్యాంకుకు సహాయపడుతుంది. ఇంకా, పర్యవేక్షకులు, నియంత్రణాధికారులు, బ్యాంకులు, ముందుగానే మేల్కొని, ఒత్తిడిలో ఉన్న బ్యాంకు రుణాలను పునర్వ్యవస్థీకరించడానికి కూడా పి సి ఆర్, ఉపకరిస్తుంది.

పైన పేర్కొన్నవాటిదృష్ట్యా- (i) పరపతిపై ప్రస్తుతం భారతదేశంలో లభ్యమౌతున్న సమాచార సమీక్షకు (ii) సమగ్రమైన పి సి ఆర్ ద్వారా లోపాలు సవరించడానికి (iii) అంతర్జాతీయ వాడుకలను అధ్యయనం చేయడానికి మరియు (iv) పారదర్శకంగా, ప్రాధాన్య అంశాలను గుర్తించి, వాస్తవ స్థితికి వీలయినంత దగ్గరగా ఉన్న పి సి ఆర్ అందించేందుకు మార్గాన్ని సూచించడానికి, నిపుణులు, ప్రధాన భాగస్వాములు సభ్యులుగా ఒక ఉన్నత స్థాయి కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించబడింది.

4. పరపతి సమాచార సంస్థలచే (Credit Information Companies, CICs, సి ఐ సి) సమగ్ర పరపతి సమాచార నివేదికల (Credit Information Reports, CIRs, సి ఐ ఆర్) జారీ

సి ఐ సి లు, పరపతి సంస్థలకు, వాణిజ్య / వినియోగదారుల / MFI డాటా వంటి నిర్దిష్టమైన అంశాల క్రింద పరిమితమైన వివరాలు అందజేయడం ఆనవాయితీగా ఉంది.

పరపతి సంస్థలు సమర్థవంతంగా అంచనాలు చేయడానికీ, రుణదాతలకు/గ్రహీతలకు మధ్య ఉన్న సమాచార అంతరాలు తగ్గించడానికీ, సి ఐ సిలు వారి డాటాబేస్‌లోగల అన్ని అంశాలక్రింద సమాచారాన్ని, సి ఐ లకు అందించాలని, సి ఐ సిలను ఆదేశించాలని నిర్ణయించబడింది.

ఈరోజు ఈ విషయమై సర్క్యులర్ జారీ చేయబడుతోంది.

5. రిజర్వ్ బ్యాంకుచే కుటుంబ సర్వేలు

ద్రవ్య విధానాన్ని రూపొందించడానికి రిజర్వ్ బ్యాంక్ అనేక సర్వేలు చేపడుతూ ఉంటుంది. సర్వేలకు పేరుగడించిన సంస్థలనుండి సభ్యులు గల సాంకేతిక సలహా సమితి (Technical Advisory Committee on Surveys, TACS, టి ఎ సి ఎస్) రిజర్వ్ బ్యాంకుకు ఈ విషయంలో సలహానిస్తుంది. ద్రవ్యోల్బణంపై కుటుంబ అంచనాల సర్వే (Inflation Expectation Survey of Households, IESH, ఐ ఇ ఎస్ ఎచ్), 18 నగరాల్లో, 5, 500 కుటుంబాలపై జరపబడింది. వినియోగదారుల విశ్వాస సర్వే (Consumer Confidence Survey, CCS, సి సి ఎస్) 6 నగరాల్లో, 5,400 కుటుంబాలపై జరపబడింది. సర్వేల ప్రాతినిధ్యత పెంచడానికి, టి ఎ సి ఎస్ సిఫారసులమేరకు, గ్రామాలకు , చిన్న పట్టణాలకు ప్రాంతాలకు ఐ ఇ ఎస్ ఎచ్ విస్తరించడానికీ, 6 నగరాల్లో బదులు 13 నగరాల్లో సి సి ఎస్ నిర్వహించడానికీ, ప్రయత్నాలు జరుగుతున్నాయి.

6. త్రైపాక్షిక రెపో (Tri-party REPO)

త్రైపాక్షిక రెపో ప్రవేశపెట్టడంద్వారా, కార్పొరేట్ బాండ్ రెపో మార్కెట్‌లో ద్రవ్యత పెరిగి, తద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్‌కు ప్రత్యామ్నాయ రెపో సాధనం దొరుకుతుంది. ప్రజాభిప్రాయ సేకరణకు, త్రైపాక్షిక రెపో మార్గదర్శకాల ముసాయిదా, ఏప్రిల్ 11, 2017 తేదీన రిజర్వ్ బ్యాంక్ వెబ్‌సైట్‌లో, ఉంచబడింది. వచ్చిన అభిప్రాయాలు పరిశీలించడంజరిగింది. ఈ విషయమై ఖరారు చేయబడ్డ సర్క్యులర్ ఆగస్ట్, 2017 మధ్యకాలంలో జారీచేయబడుతుంది.

7. సరళంచేసిన హెడ్జింగ్ సదుపాయం

సరళీతరం చేసిన హెడ్జింగ్ పథకం మొదటిసారిగా ఆగస్ట్ 2016 లో రిజర్వ్ బ్యాంకుచే ప్రకటించబడి, ముసాయిదా పథకం ఏప్రిల్ 12, 2017 తేదీన విడుదలచేయబడింది. మారకపు రేట్‌ మారడం వల్ల కలిగే నష్టభయాన్ని హెడ్జింగ్ చేసే విధానాన్ని, ఈ క్రింద తెలిపిన మార్గాలద్వారా సులభతరం చేయడానికి, ఈ పథకం, ఉద్దేశించబడింది - ప్రమాణపత్రాల అవసరం తగ్గించడం; ఉత్పత్తులు, ప్రయోజనం, హెడ్జింగ్‌చేయుటలో వెసులుబాటు మొదలైన అంశాలపై అమలులో ఉన్న నిర్దిష్ట నిబంధనలు తొలగించడం. ఈ పథకాన్ని అమలుచేయడానికి సర్క్యులర్ సిద్ధంగా ఉన్నది. ప్రభుత్వం, FEMA ప్రకటన విడుదల చేసిన తరువాత ఇది జారీచేయబడుతుంది.

8. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లకు (Foreign Portfolio Investors, FPI, ఎఫ్ పి ఐ) వడ్డీరేటు ఫ్యూచర్లలో (Interest Rate Futures, IRFs, ఐ ఆర్ ఎఫ్) మదుపుకు ప్రత్యేక పరిమితి

విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లకు (FPI, ఎఫ్ పి ఐ) ప్రభుత్వ సెక్యూరిటిలలో పెట్టగల పరిమితి, సెక్యూరిటీలు, బాండ్ల ఫ్యూచర్ల మధ్యలో అంతర్మార్పిడి చేయవచ్చు (fungible). మార్కెట్ మరింత అభివృద్ధి చెందడానికీ, ప్రభుత్వ సెక్యూరిటీల వేలం సమయంలో, ఎఫ్ పి ఐ లకు, ఫ్యూచర్లు నిరంతరాయంగా అందుబాటులో ఉండడానికి, ఎఫ్‌ పి ఐ లకు 5000 కోట్ల ప్రత్యేక పరిమితి కేటాయించబడింది. ప్రభుత్వ సెక్యూరిటీలలో మదుపుకు ఎఫ్ పి ఐ లకు కేటాయించిన పరిమితి, పూర్తిగా అటువంటి సెక్యూరిటీలను పొందడానికి లభ్యమౌతుంది. హెడ్జింగ్ కోసం ఐ ఆర్ ఎఫ్‌లు, ఇంతకు ముందు వలెనే లభిస్తాయి. ఈ విషయమై సర్క్యులర్, ప్రభుత్వంతో సంప్రదించి, రిజర్వ్ బ్యాంక్ విడుదల చేస్తుంది.

జోస్ జె కత్తూర్
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2017-2018/326

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?