RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78515893

నియంత్రణా నివేదికల (regulatory reports) సమర్పణ – కాలవ్యవధుల (timeline) పొడిగింపు

RBI/2019-20/228
DOR.BP.BC.N0.68/21.04.018/2019-20

ఏప్రిల్ 29, 2020

అన్ని వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులతో సహా); చెల్లింపు బ్యాంకులు; స్థానిక బ్యాంకులు; జాతీయ ఆర్థిక సంస్థలు; సహకార బ్యాంకులు

అమ్మా / అయ్యా,

నియంత్రణా నివేదికల (regulatory reports) సమర్పణ – కాలవ్యవధుల (timeline) పొడిగింపు

కోవిడ్–19 వ్యాధి వ్యాప్తి కారణంగా, సకాలంలో నియంత్రణా నివేదికలు సమర్పించడంలో కలుగుతున్న సమస్యలు తేలిక చేయుటకు, అవి సమర్పించవలసిన కాలవ్యవధులు (timeline) పొడిగించుటకు నిశ్చయించబడినది.

2. తదనుసారంగా, పై సంస్థలు నియంత్రణా విభాగానికి సమర్పించవలసిన నివేదికలు, గడు వుతేది నుండి 30 రోజుల జాప్యంతో సమర్పించవచ్చు. జూన్ 30, 2020 తేదీవరకు సమర్పించవలసిన నివేదికలకు ఈ పొడిగింపు వర్తిస్తుంది. మరిన్ని వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. వీలుకలిగిన సంస్థలు, నివేదికలు ముందే సమర్పించవచ్చు.

3. అయితే, చట్టబద్ధంగా నిర్దేశించిన నివేదికలు సమర్పించవలసిన కాలవ్యవధులలో ఎట్టి పొడిగింపూ లేదు – ఉదా: బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949; రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లేక నగదు నిల్వల నిష్పత్తి / చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (సి ఆర్ ఆర్ /ఎస్ ఎల్ ఆర్, CRR / SLR) లకు సంబంధించిన నివేదికలు.

4. ఇంతేగాక, నియంత్రణా విభాగానికి అన్ని సందేశాలు, వీలయినంతవరకు కార్పొరేట్ ఇ –మెయిల్ ద్వారా పంపవలెను (అనగా, భౌతికంగా పత్రాల కదలిక అవసరం లేకుండా). ఈ ఏర్పాటు, తిరిగి నోటీసు జారీ చేసేవరకు అమలులో ఉంటుంది.

మీ విశ్వాసపాత్రులు,

(సౌరవ్ సిన్హా)
చీఫ్ జనరల్ మానేజర్ ఇన్-చార్జ్


అనుబంధం: గడువుతేదినుండి, గరిష్ఠంగా ఒక నెలజాప్యంతో
సమర్పించుటకు అనుమతించబడ్డ నివేదికల జాబితా

క్రమ సంఖ్య నివేదిక పేరు సంబంధిత చట్టం లేక సర్క్యులర్ వర్తించే, నియంత్రిత సంస్థలు తరచుదనం ప్రస్తుత గడువు
1 డివిడెండ్ చెల్లింపు DBOD.NO.BP.BC.88/21.02.067/2004-05
MAY 04, 2005
రాష్ట్ర సహకార బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా) అవసరమయినప్పుడు డివిడెండ్ ప్రకటించిన పక్షంలోగా
2 సబార్డినేటేడ్ డెట్, అప్పర్ టైర్ II క్యాపిటల్, పర్పెచ్యువల్ డెట్స్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ (QIP), ప్రోమోటర్స్ కు ప్రిఫరెన్షియల్ ఇస్స్యూ, GDR ఇస్స్యూ (పత్రం నకలుతో సహా) బాజెల్ III క్యాపిటల్ రెగ్యులేషన్స్ – రెవ్యూ, జూన్ 23, 2016 అనుసారంగా నివేదిక; ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులచే షేర్ల జారీ మరియు వాటి ధరపై మాస్టర్ సర్క్యులర్, ఏప్రిల్ 21, 2016;
DBR. NO. BP.BC.01/21.06.201/2015-16, జులై 01, 2015
అన్ని వాణిజ్య బ్యాంకులు (స్థానిక బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తప్ప) అవసరమయినప్పుడు జారీచేసిన వారం లోపుగా
3 ఫార్మ్ I 3044.30.01.002/2017-18, సెప్టెంబర్ 27, 2017 ద్వారా, డి ఇ ఏ ఫండ్ పథకం, 2014 నిర్వహణపై అన్ని బ్యాంకులకు జారీచేసిన మార్గదర్శకాలు ఎస్ సి బి లు (ఆర్ ఆర్ బీలతో కలిపి), స్థానిక బ్యాంకులు, యు సి బి లు, ఎస్టి సి బి లు, డి సి సి బి లు, ఎస్ ఎఫ్ బి లు మరియు పి బి లు ప్రతి నెల 30 రోజులలోగా
4 ఫార్మ్ II 3044.30.01.002/2017-18, సెప్టెంబర్ 27, 2017 ద్వారా, డి ఇ ఏ ఫండ్ పథకం, 2014 నిర్వహణపై అన్ని బ్యాంకులకు జారీచేసిన మార్గదర్శకాలు ఎస్ సి బి లు (ఆర్ ఆర్ బీలతో కలిపి), స్థానిక బ్యాంకులు, యు సి బి లు, ఎస్టి సి బి లు, డి సి సి బి లు, ఎస్ ఎఫ్ బి లు మరియు పి బి లు ప్రతి నెల 25 రోజుల లోగా
5 పసిడి నగదీకరణ పథకం, 2015 మాస్టర్ డైరెక్షన్ No.DBR.IBD.No.45/23.67.003/2015-16, అక్టోబర్ 22, 2015 (ఆగస్ట్ 16, 2019 వరకు నవీకరించబడినది) ఎస్ సి బి లు (ఆర్ ఆర్ బీలు తప్ప) ప్రతి నెల 30 రోజులలోగా
6 ఆ నెలలో దిగిమతి చేసికొన్న బంగారం మరియు వెండి నివేదిక IBS.1758/23.67.003/2015-16, ఏప్రిల్ 23, 2003 ఎస్ సి బి లు (ఆర్ ఆర్ బీలు తప్ప) ప్రతి నెల 30 రోజులలోగా
7 క్యూ సి సి పి ఎక్స్పో జర్ పై నివేదిక సెంట్రల్ కౌంటర్ పార్టీలకు బ్యాంకుల ఎక్స్పోజర్ (CCPs) – మధ్యంతర ఏర్పాట్లు DBOD.No.BP.BC.82/21.06217/2013-14, జనవరి 7, 2014 ఎస్ సి బి లు (ఆర్ ఆర్ బీలు తప్ప) ప్రతి నెల 30 రోజులలోగా
8 సమీకరించిన మొత్తం వనరులపై, నెల వారీ నివేదిక ఆర్థిక సంస్థలచే వనరుల సమీకరణపై మాస్టర్ సర్క్యులర్ DBR.No.FID.FIC.1/01.02.00/2015-16, జులై 01, 2015 జాతీయ ఆర్థిక సంస్థలు ప్రతి నెల 10 రోజులలోగా
9 పెద్ద మొత్తం ఎక్స్పోజర్ల పై నివేదిక లార్జ్ ఎక్స్పోజర్ ఫ్రేమ్ వర్క్ (నాన్ – సెంట్రల్లీ క్లియర్డ్ డిరైవేటివ్ ఎక్స్పోజర్స్) DBR.No.BP.BC.43/21.01.003/2018-19, జూన్ 3, 2019 ఎస్ సి బి లు (ఆర్ ఆర్ బీలు తప్ప) ప్రతి, త్రైమాసికము 30 రోజులలోగా
10 ఇండ్ ఏ ఎస్ (IndAS) ప్రోఫార్మా ప్రతి త్రైమాసికం చివర బ్యాంకులకు ఇ – మెయిల్ ద్వారా తెలపబడుతుంది ఎస్ సి బి లు (ఆర్ ఆర్ బీలు తప్ప) ప్రతి, త్రైమాసికము 60 రోజులలోగా
11 బి సి ఔట్లెట్లపై రిజర్వ్ బ్యాంక్ కు తాత్కాలిక నివేదిక, ఫార్మాట్ శాఖల అనుమతి విధానం హేతుబద్ధీకరణ - మార్గదర్శకాల సమీక్ష ఆర్ ఆర్ బీలు ప్రతి, త్రైమాసికము 20 రోజులలోగా
12 పి ఎస్ యు పెట్టుబడుల నివేదిక RPCD.No.RF.ROC.9/07.02.03/98-99, జూన్ 23, 1999 ఎస్టి సి బి లు, డి సి సి బి లు ప్రతి, త్రైమాసికము 30 రోజులలోగా
13 ఫార్మ్ III 3044.30.01.002/2017-18, సెప్టెంబర్ 27, 2017 ద్వారా, డి ఇ ఏ ఫండ్ పథకం, 2014 నిర్వహణపై అన్ని బ్యాంకులకు జారీచేసిన మార్గదర్శకాలు ఎస్ సి బి లు (ఆర్ ఆర్ బీలతో కలిపి), స్థానిక బ్యాంకులు, యు సి బి లు, ఎస్టి సి బి లు, డి సి సి బి లు, ఎస్ ఎఫ్ బి లు మరియు పి బి లు 31 మార్చి, 30 సెప్టెంబర్ కు ముగిసే అర్ధ సం.లు 30 రోజులలోగా
14 మర్చంట్ ఎక్వైరింగ్ బిజి నెస్ ఆఫ్ ఆర్ ఆర్ బి, నివేదిక మర్చంట్ ఎక్వైరింగ్ బిజినెస్ ఆఫ్ ఆర్ ఆర్ బి – మార్గదర్శకాలు – ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, DOR.RRB.BL.BC.No.31/31.01.001/2019-20, ఫిబ్రవరి 06, 2020 ఆర్ ఆర్ బి లు 31 మార్చి, 30 సెప్టెంబర్ కు ముగిసే అర్ధ సం.లు 10 రోజులలోగా
15 ఎ ఐ ఎఫ్ ఐ ల (AIFI) కొరకు ఆర్థిక నివేదిక, ఇండ్ ఎ ఎస్ (IndAS) ప్రోఫార్మా భారత అకౌంటింగ్ ప్రమాణాల (IndAS) అమలుపై ఏ ఐ ఎఫ్ ఐ లకు (AIFI), ఆగస్ట్ 4, 2016 న జారీచేసిన సర్క్యులర్ జాతీయ ఆర్థిక సంస్థలు 31 మార్చి, 30 సెప్టెంబర్ కు ముగిసే అర్ధ సం.లు 60 రోజులలోగా
16 షేర్ హోల్డింగ్ నివేదిక (షేర్లు కలిగి ఉండుటపై ఆంక్షలు) ACD.B.R.388/A.11(19)65-6, మార్చి 01, 1966 ఎస్టి సి బి లు, డి సి సి బి లు ప్రతి సంవత్సరం 30 రోజులలోగా
17 బ్యాంకింగేతర ఆస్తులు RPCD.RF/ROC.No.15/07.07.11/2000-01, డిసెంబర్ 15, 2000 ఎస్టి సి బి లు, డి సి సి బి లు ప్రతి సంవత్సరం 30 రోజులలోగా
18 టేబుల్ 34 (గ్రూపులవారిగా కార్యాలయాల / జనాభా వితరణ) RPCD.CO.RF.No.BC.9/07.06.00/2005-06, జులై 06, 2005 ఎస్టి సి బి లు, డి సి సి బి లు ప్రతి సంవత్సరం 30 రోజులలోగా

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?