<font face="mangal" size="3">బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (సహకార సంఘాలకు వ - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (సహకార సంఘాలకు వర్తించే మేరకు) - నివేదికల సమర్పణ - కాల పరిమితి పొడిగింపు
RBI/2021-22/49 జూన్ 04, 2021 చైర్‌మన్ / మానేజింగ్ డైరెక్టర్ / చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్ అయ్యా /అమ్మా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (సహకార సంఘాలకు వర్తించే మేరకు) - నివేదికల సమర్పణ - కాల పరిమితి పొడిగింపు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 31 (సెక్షన్ 56 తో కలిపి) ప్రకారం, అకౌంట్లు, బాలన్స్ షీట్లు (సెక్షన్ 29 లో పేర్కొన్నట్లు) ఆడిటర్ రిపోర్ట్ తో సహా, సంబంధిత తేదీ ముగిసిన మూడునెలలలోగా ప్రకటించాలి, మరియు మూడు ప్రతులు రిజర్వ్ బ్యాంకుకు సమర్పించాలి. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, సెక్షన్ 31 ప్రకారం (సెక్షన్ 56 (t) (ii) తో కలిపి), రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్రీయ సహకార బ్యాంకులు, వీటిని, జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకుకు కూడా (ఎన్ ఏ బి ఏ ఆర్ డి) నివేదికలుగా సమర్పించాలి. 2. అనేక ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్రీయ సహకార బ్యాంకులు, కోవిడ్ -19 సమయంలో, వార్షిక ఖాతాలు ముగించుటలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా పై నివేదికలు సమర్పించుటకు మరికొంత సమయం ఇవ్వడం అవసరమనిపించింది. 3. పై కారణంగా, సెక్షన్ 31 క్రింద మార్చి 31, 2021 తేదీన ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నివేదికలు సమర్పించుటకు సమయం, రిజర్వ్ బ్యాంక్ మరొక మూడునెలలు పొడిగించింది. తదనుసారంగా, అన్ని నగర సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్రీయ సహకార బ్యాంకులు, సెప్టెంబర్ 30, 2021 తేదీన లేక అంతకు ముందు రిజర్వ్ బ్యాంకుకు నివేదికలు సమర్పించవలెను. రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్రీయ సహకార బ్యాంకులు, సెప్టెంబర్ 30, 2021 తేదీన లేక అంతకు ముందు, జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకుకు (ఎన్ ఏ బి ఏ ఆర్ డి) కూడా, సెప్టెంబర్ 30, 2021 తేదీన లేక అంతకు ముందు నివేదికలు సమర్పించాలి. మీ విశ్వాసపాత్రుడు, (థామస్ మేత్యూ) |