<font face="mangal" size="3">బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 31 (సెక్షన - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 31 (సెక్షన్ 56 తో కలిపి) క్రింద నివేదికలు (రిటర్న్స్) సమర్పించడం - సమయం పొడిగింపు
ఆర్.బి.ఐ/2020-2021/55 అక్టోబర్ 13, 2020 ది చైర్మెన్ / మేనేజింగ్ డైరెక్టర్ /ముఖ్య కార్య నిర్వహణాధికారి మేడమ్/డియర్ సర్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 31 (సెక్షన్ 56 తో కలిపి) క్రింద నివేదికలు (రిటర్న్స్) సమర్పించడం - సమయం పొడిగింపు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 31 (సెక్షన్ 56 తో కలిపి) [బ్యాంకింగ్ నియంత్రణ (సవరణ) ఆర్డినెన్స్, 2020 చే సవరించబడిన ] క్రింద మార్చి 31, 2020 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలు (రిటర్న్స్) సమర్పించడానికి నిర్దేశించిన వ్యవధిని మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30, 2020 వరకు పొడిగిస్తూ ఆగస్టు 26, 2020 న అన్ని ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకులకు (యుసిబి) జారీ చేయబడిన మా సర్కులర్ డిఓఆర్ (పిసిబి) బిపిడి.సిఐఆర్.నం.02/12.05.001/2020-21 ను దయచేసి పరికించండి. 2. కోవిడ్ 19 మహమ్మారి మూలంగా ఆర్థిక నివేదికలను ఖరారు చేయడంలో యూసీబీ లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా, భారత ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు సిఫారసు మేరకు సెప్టెంబర్ 29, 2020 న గెజిట్ నోటిఫికేషన్ నెం. S.O. 3377 (ఇ) (కాపీ పరివేష్టితo) జారీచేసి, సెక్షన్ 56 క్లాజ్ (టి) తో కలిపి సెక్షన్ 31 లోని సదరు చట్టం నిబంధనలు ప్రాథమిక సహకార బ్యాంకులకు డిసెంబర్ 31, 2020 వరకు వర్తించవని ప్రకటించింది. దీని ప్రకారం, అన్నియూసీబీలు పైన పేర్కొన్న నివేదికలను (రిటర్న్స్) డిసెంబర్ 31, 2020 న లేదా అంతకులోపున రిజర్వు బ్యాంకుకు సమర్పించేలా చూసుకోవాలి. 3. బ్యాంకింగ్ నియంత్రణ (సవరణ) చట్టం, 2020 ను, ఇప్పటివరకు రాష్ట్ర సహకార బ్యాంకులు మరియు కేంద్ర సహకార బ్యాంకులకు నోటిఫై జేయబడలేదుగాబట్టి, వారు వారి అకౌంట్స్ మరియు ఆడిటర్ నివేదిక తో కూడిన బ్యాలెన్స్ షీట్ యొక్క నఖళ్ళు మూడింటిని ఆరు మాసాల లోపున అంటే పైన ఉటంకించిన ఆర్ధిక సంవత్సరం 2019-20 నకు సంబంధించి సెప్టెంబర్ 30, 2020 నాటికి రిజర్వు బ్యాంకు మరియు నేషనల్ బ్యాంక్ (నాబార్డ్)కు సమర్పించవలసిన అగత్యం ఉన్నది. అయితే, కోవిడ్ 19 మహమ్మారి వల్ల రాష్ట్ర సహకార బ్యాంకులు మరియు కేంద్ర సహకార బ్యాంకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మార్చి 31, 2020 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సెక్షన్ 31 క్రింద రిటర్న్ సమర్పించడానికి ఉన్న వ్యవధిని సదరు సెక్షన్ మొదటి ప్రొవిజో ప్రకారం మరో మూడు నెలల వరకు , భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగించింది. దీని ప్రకారం, అన్ని రాష్ట్ర సహకార బ్యాంకులు మరియు కేంద్ర సహకార బ్యాంకులు పైన పేర్కొన్న రిటర్న్ లను రిజర్వు బ్యాంకు మరియు నాబార్డ్ లకు డిసెంబర్ 31, 2020 న లేదా అంతకులోపున సమర్పించేలా చూసుకోవాలి. మీ విధేయులు, (నీరజ్ నిగం) |