<font face="mangal" size="3">ది అనంతపూర్ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు లిమిటెడ - ఆర్బిఐ - Reserve Bank of India
ది అనంతపూర్ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు లిమిటెడ్, అనంతపురము, ఆంధ్రప్రదేశ్ పై జరిమానా విధింపు
అక్టోబర్ 12, 2017. ది అనంతపూర్ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు లిమిటెడ్, అనంతపురము, ఆంధ్రప్రదేశ్ పై జరిమానా విధింపు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 47A(1) (b) మరియు సెక్షన్ 46 (4) (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం, రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా తమకు దఖలుపరచబడిన ఆధికారాలతో ది అనంతపూర్ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు లిమిటెడ్, అనంతపురము, ఆంధ్రప్రదేశ్ పై రూ. 50,000/- (యాభైవేల రూపాయలు) నగదు జరిమానా విధించింది. డైరెక్టర్స్ మరియు వారి బంధువులకు లోన్స్ మరియు అడ్వాన్సులకు సంబంధించి రిజర్వు బ్యాంకు ఆదేశాలు మరియు నిబంధనలు ఆ అర్బన్ బ్యాంకు ఉల్లంఘించినందులకు, ఈ జరిమానా విధించడం జరిగింది. 2. రిజర్వు బ్యాంకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు బ్యాంకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినది. నిజానిజాలు మరియు మౌఖిక వినతి పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చినది. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2017-2018/1019 |