<font face="mangal" size="3">ది భావన రిషి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమి - ఆర్బిఐ - Reserve Bank of India
ది భావన రిషి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణా, పై జరిమానా విధింపు
అక్టోబర్ 10, 2017. ది భావన రిషి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణా, పై జరిమానా విధింపు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం ,1949 సెక్షన్ 47A(1) (b) మరియు సెక్షన్ 46 (4) (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ప్రకారం, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమకు దఖలుపరచబడిన ఆధికారాలతో ది భావన రిషి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణా, పై రూ. 1,00,000/- (ఒక లక్ష రూపాయలు) నగదు జరిమానా విధించింది. డైరెక్టర్స్ మరియు వారి బంధువులకు లోన్స్ మరియు అడ్వాన్సులకు సంబంధించి రిజర్వు బ్యాంకు ఆదేశాలు మరియు నిబంధనలు ఆ అర్బన్ బ్యాంకు ఉల్లంఘించినందుకు, ఈ జరిమానా విధించడం జరిగింది. 2. రిజర్వు బ్యాంకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు బ్యాంకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినది. నిజానిజాలు పరిశీలించినప్పుడు, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగ్గవేనని, రిజర్వు బ్యాంకు నిర్ణయానికి వచ్చినది. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2017-2018/980 |