<font face="mangal" size="3">ది బడ్జె బడ్జె నంగి సహకార బ్యాంకు లిమిటెడ్, 63,  - ఆర్బిఐ - Reserve Bank of India
ది బడ్జె బడ్జె నంగి సహకార బ్యాంకు లిమిటెడ్, 63, మహాత్మా గాంధీ రోడ్, బడ్జె బడ్జె, సౌత్ 24 పరగణాస్, పశ్చిమ బెంగాల్ - జరిమానా విధించబడింది
తేది : 16/10/2019 ది బడ్జె బడ్జె నంగి సహకార బ్యాంకు లిమిటెడ్, 63, మహాత్మా గాంధీ రోడ్, బడ్జె బడ్జె, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని సెక్షన్ 20, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది), మరియు జూలై 01, 2015 నాటి మాస్టర్ సర్క్యులర్ DCBR.CO.BPD (PCB) No.13/13.05.000/2015-16 యొక్క పేరా 5.1.1 మరియు పేరా 5.1.3 లో పేర్కొన్న విధంగా, ఎక్స్పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర పరిమితులు - పట్టణ సహకార బ్యాంకులు ఫై ఆర్బీఐ జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల ఉల్లంఘనలకు, ఆదేశాలు పాటించనందుకు, ది బడ్జె బడ్జె నంగి సహకార బ్యాంకు లిమిటెడ్, 63, మహాత్మా గాంధీ రోడ్, బడ్జె బడ్జె, సౌత్ 24 పరగణాస్, పశ్చిమ బెంగాల్ ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 1,00,000 (లక్ష రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. మార్చ్ 31, 2017, ఆర్ధిక సంవత్సరానికి జరిగిన బ్యాంకు యొక్క చట్టబద్ధమైన తనిఖీలో కనుగొన్న విషయాల ఆధారంగా, జరిమానా ఎందుకు విధించకూడదు అని బ్యాంకుకు మార్చ్ 25, 2019 న నోటీసు జారీ చేయబడింది. ప్రతిస్పందనగా, బ్యాంకు ఒక లిఖిత సమాధానం సమర్పించింది. బ్యాంకు ఇచ్చిన లిఖిత సమాధానం మరియు అదనపు నివేదనలను పరిగణించిన అనంతరం, జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల ఉల్లంఘన వాస్తవమని నమ్ముతూ, జరిమానా విధించాలని ఆర్.బి.ఐ నిర్ధారణకు రావడం జరిగింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/965 |