<font face="mangal" size="3">ది చిత్తూర్ కో-ఆపరేటివ్ టౌన్‌ బ్యాంక్ లి., చిత - ఆర్బిఐ - Reserve Bank of India
ది చిత్తూర్ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లి., చిత్తూర్, ఆంధ్ర ప్రదేశ్ – జరిమానా విధింపు
తేదీ: 13/02/2019 ది చిత్తూర్ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లి., చిత్తూర్, ఆంధ్ర ప్రదేశ్ – జరిమానా విధింపు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సెక్షన్ 47A (1)(c) [సబ్ సెక్షన్ (4), సెక్షన్ 46 తో కలిపి], తమకు దఖలు పరచిన అధికారాలతో రిజర్వ్ బ్యాంక్, ది చిత్తూర్ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లి., చిత్తూర్, ఆంధ్ర ప్రదేశ్పై, రూ. 50,000/- (ఏభైవేల రూపాయిలు) నగదు జరిమానా విధించింది. పై చట్టంలోని, సెక్షన్ 26(A) లో తెలిపిన విధంగా, హక్కు కోరబడని ఖాతాలలోని (unclaimed accounts) డిపాజిట్లను, ‘డిపాజిటర్ల శిక్షణ మరియు అవగాహన నిధికి’ (Depositor Education and Awareness Fund), బదిలీ చేయని కారణంగా ఈ జరిమానా విధించడమైనది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పైన తెలిపిన బ్యాంకుకు షోకాజ్ నోటీస్ జారీచేసింది. దీనికి, బ్యాంకు లిఖితపూర్వక జవాబు ఇచ్చింది. ఈవిషయమై వాస్తవాలు, బ్యాంక్ సమర్పించిన జవాబు, పరిశీలించిన తరువాత, ఉల్లంఘనలు నిరూపితమైనట్లు, అవి జరిమానా విధింపతగినవేనని రిజర్వ్ బ్యాంక్, నిర్ధారణకు వచ్చినది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/1929 |