<font face="mangal" size="3">కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, కు - ఆర్బిఐ - Reserve Bank of India
కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, కుప్పం, ఆంధ్రప్రదేశ్ – జరిమానా విధించడం
ఫిబ్రవరి, 27, 2018 కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, కుప్పం, ఆంధ్రప్రదేశ్ – జరిమానా విధించడం రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు మరియు డైరెక్టర్లు/వారి బంధువులకు రుణాలు ఇవ్వడంలో మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే విధానంగా) లోని సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(b) లోని అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు, కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, కుప్పం, ఆంధ్రప్రదేశ్ ఫై రూ.0.50 లక్షల (యాభై వేల రూపాయలు) జరిమానా విధించింది. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకుకు జారీచేసిన షో- కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించింది. ఈ కేసులోని వాస్తవాలను, బ్యాంక్ ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంపై, రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను పాటించడంలో బ్యాంకు ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి జరీమానా విధించాలని నిర్ణయించడం జరిగింది. అనిరుద్ధ డి. జాధవ్ పత్రికా ప్రకటన: 2017-2018/2300 |