<font face="mangal" size="3">కుప్పం పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్., కుప్పం, &# - ఆర్బిఐ - Reserve Bank of India
కుప్పం పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్., కుప్పం, ఆంధ్రప్రదేశ్ – జరిమానా విధింపు
June 06, 2018 కుప్పం పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్., కుప్పం, ఆంధ్రప్రదేశ్ – జరిమానా విధింపు కుప్పం పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్., కుప్పం, ఆంధ్రప్రదేశ్ ఫై ₹ 50,000/-(యాభై వేల రూపాయలు మాత్రమే), బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే విధంగా) లోని సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, సదరు చట్టం లోని సెక్షన్ 27(2) ఉల్లంఘనకు, భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధించింది. భారతీయ రిజర్వు బ్యాంకు, బ్యాంకుకు జారీచేసిన షో- కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించింది. ఈ కేసులోని వాస్తవాలను, బ్యాంక్ ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంపై, భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను పాటించడంలో బ్యాంకు ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి జరిమానా విధించాలని నిర్ణయించడం జరిగింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/3205 |