<font face="mangal" size="3">ఓఝార్ మర్చంట్స్ సహకార బ్యాంకు లిమిటెడ్, ఓఝాĸ - ఆర్బిఐ - Reserve Bank of India
ఓఝార్ మర్చంట్స్ సహకార బ్యాంకు లిమిటెడ్, ఓఝార్, జిల్లా- నాసిక్, మహారాష్ట్ర – జరిమానా విధింపు
తేది: 05/08/2019 ఓఝార్ మర్చంట్స్ సహకార బ్యాంకు లిమిటెడ్, ఓఝార్, జిల్లా- నాసిక్, మహారాష్ట్ర – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, ఓఝార్ మర్చంట్స్ సహకార బ్యాంకు లిమిటెడ్, ఓఝార్, జిల్లా- నాసిక్, మహారాష్ట్ర ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 4.00 (నాలుగు లక్షల రూపాయలు మాత్రమే) ఆర్ధిక జరిమానా విధించింది. డైరెక్టర్ సంబంధిత రుణాలు మరియు సహకార బ్యాంకుల ద్వారా డివిడెండ్ ప్రకటించడం ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాలు/సూచనలు/మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు, ఈ జరిమానా విధించబడింది. భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసు (SCN) కు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖిత పూర్వక సమాధానాన్ని సమర్పించింది. కేసులోని వాస్తవాలను, బ్యాంక్ ప్రత్యుత్తరం పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2019-2020/345 |