RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501114

ది సిర్సిల్లా కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., సిర్సిల్లా, తెలంగాణాపై జరిమానా విధింపు.

తేదీ: 01/02/2018

ది సిర్సిల్లా కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., సిర్సిల్లా, తెలంగాణాపై
జరిమానా విధింపు.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47(A) 1 (b) (సెక్షన్‌ 46 (4) తో కలిపి) క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, ది సిర్సిల్లా కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంకు లి., సిర్సిల్లా, తెలంగాణాపై 0.50 లక్షల (రూపాయిలు 50 వేలు) నగదు జరిమానా విధించినది. ఎక్స్పోజర్ నిబంధనలు; చట్టబద్ధ / ఇతర పరిమితులు; మీ వినియోగదారుణ్ణి తెలుసుకోండి (KYC) నిబంధనలు; ఏంటి మనీ లాండరింగ్ చర్యలకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను / ఆదేశాలను ఉల్లంఘించినందున ఈ జరిమానా విధించడం జరిగింది.

రిజర్వ్ బ్యాంక్, ది సిర్సిల్లా కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంకుకు షోకాజ్ నోటీస్ జారీ చేసినది. దీనికి బ్యాంక్, లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చినది. ఈ విషయమై నిజానిజాలు, బ్యాంక్ ఇచ్చిన జవాబు, మౌఖిక వినతులు పరిశీలించిన పిమ్మట, ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేననీ, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/2094

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?