<font face="mangal" size="3px">ది శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్‌ బ్యాంక్ ల - ఆర్బిఐ - Reserve Bank of India
ది శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లి., శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ – జరిమానా విధింపు
తేదీ: 21/02/2019 ది శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లి., శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సెక్షన్ 47A(1)(c) [సబ్-సెక్షన్ (4), సెక్షన్ 46 తో కలిపి], తమకు దఖలు పరచిన అధికారాలతో, ది శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లి., శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్పై, రూ. 50,000/- (కేవలం ఏభైవేల రూపాయిలు) నగదు జరిమానా విధించింది. అమలు నివేదిక సమర్పణపై రిజర్వ్ బ్యాంక్ సూచించిన మార్గదర్శక సూత్రాలు / ఆదేశాలు, ఉల్లంఘించిన కారణంగా ఈ జరిమానా విధించడమైనది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పైన తెలిపిన బ్యాంకుకు షోకాజ్ నోటీస్ జారీచేసింది. దీనికి, బ్యాంకు లిఖితపూర్వక జవాబు ఇచ్చింది. ఈవిషయమై వాస్తవాలు, బ్యాంక్ సమర్పించిన జవాబు, పరిశీలించిన తరువాత, ఉల్లంఘనలు నిరూపితమైనట్లు, అవి జరిమానా విధింపతగినవేనని రిజర్వ్ బ్యాంక్, నిర్ధారణకు వచ్చినది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/1998 |