<font face="mangal" size="3">నగర సహకార బ్యాంకు లిమిటెడ్, మౌనత్ భంజన్, (ఉత్త&# - ఆర్బిఐ - Reserve Bank of India
నగర సహకార బ్యాంకు లిమిటెడ్, మౌనత్ భంజన్, (ఉత్తర్ ప్రదేశ్) - జరిమానా విధించబడినది
మార్చ్ 13, 2019 నగర సహకార బ్యాంకు లిమిటెడ్, మౌనత్ భంజన్, (ఉత్తర్ ప్రదేశ్) - జరిమానా విధించబడినది బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా), సెక్షన్ 36(1) క్రింద ఇచ్చిన పర్యవేక్షక సూచనలు, రుణ సమాచార కంపెనీల (CICs) సభ్యత్వం, ఇంటర్-బ్యాంక్ స్థూల మరియు కౌంటర్ పార్టీ పరిమితిపై ప్రూడెన్షియల్ నిబంధనలు, డైరెక్టర్ సంబంధిత రుణాలు, అసురక్షిత రుణాలు మరియు నియమించబడిన డైరెక్టర్ మొదలగు అంశాలపై భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క సూచనలు/మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, నగర సహకార బ్యాంకు లిమిటెడ్, మౌనత్ భంజన్, (ఉత్తర్ ప్రదేశ్) ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 3,00,000/- (మూడు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖిత పూర్వక సమాధానాన్ని సమర్పించింది. కేసులోని వాస్తవాలను, బ్యాంక్ ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరీమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. అనిరుధ డి జాదవ్ పత్రికా ప్రకటన సంఖ్య : 2018-2019/2171 |