<font face="mangal" size="3">తిరుమల కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., హైదరా - ఆర్బిఐ - Reserve Bank of India
తిరుమల కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లి., హైదరాబాద్, తెలంగాణా - జరిమానా విధింపు
తేదీ: ఆగస్ట్ 02, 2017 తిరుమల కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లి., హైదరాబాద్, తెలంగాణా - భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 47 (A)(1)(b) మరియు సెక్షన్ 46(4) క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, తిరుమల అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., హైదరాబాద్, తెలంగాణాపై, ₹ 2.00 లక్షల (కేవలం రెండు లక్షల రూపాయిలు) నగదు జరిమానా విధించినది. ఈ క్రింది విషయాలలో, రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు, మార్గదర్శకాలూ ఉల్లంఘించినం దున ఈ జరిమానా విధించబడింది:
రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన షో కాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చి, దానిపై మౌఖిక వినతులుకూడా చేసినది. ఈ విషయంలో నిజానిజాలు మరియు బ్యాంక్ సమర్పించిన జవాబు పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/331 |