<font face="mangal" size="3">యు.పి. సివిల్ సెక్రటేరియట్ ప్రాథమిక సహకార బ్ - ఆర్బిఐ - Reserve Bank of India
యు.పి. సివిల్ సెక్రటేరియట్ ప్రాథమిక సహకార బ్యాంకు లిమిటెడ్, లక్నో (యు.పి) – జరిమానా విధింపు
తేది: 11/07/2019 యు.పి. సివిల్ సెక్రటేరియట్ ప్రాథమిక సహకార బ్యాంకు లిమిటెడ్, లక్నో (యు.పి) – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, యు.పి. సివిల్ సెక్రటేరియట్ ప్రాథమిక సహకార బ్యాంకు లిమిటెడ్, లక్నో (యు.పి) ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 1,00,000/- (లక్ష రూపాయలు మాత్రమే) ఆర్ధిక జరిమానా విధించింది. పెట్టుబడి లావాదేవీల యొక్క ఏకకాలిక ఆడిట్, ఇంటర్-బ్యాంక్ స్థూల మరియు కౌంటర్ పార్టీ పరిమితిపై ప్రూడెన్షియల్ నిబంధనలు, రుణ సమాచార కంపెనీల (CICs) సభ్యత్వం, ‘మీ వినియోగదారుని తెలుసుకోండి’ (KYC), ఆర్బీఐ తనిఖీ నివేదికకు అనుపాలన నివేదిక సమర్పించకపోవడం, మునపటి సంవత్సరంలో పోగైన నష్టాలు ఉన్నప్పటికీ విరాళం ఇవ్వడం మొదలగు అంశాలపై భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క సూచనలు/మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, ఈ జరిమానా విధించబడింది. భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖిత పూర్వక సమాధానాన్ని సమర్పించింది. కేసులోని వాస్తవాలను, బ్యాంక్ ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2019-2020/119 |