<font face="mangal" size="3px">యు.పి. పోస్టల్ ప్రాథమిక సహకార బ్యాంక్ లిమిటె&# - ఆర్బిఐ - Reserve Bank of India
యు.పి. పోస్టల్ ప్రాథమిక సహకార బ్యాంక్ లిమిటెడ్, లక్నో, ఉత్తర ప్రదేశ్ – జరిమానా విధించబడింది
మార్చ్ 01, 2019 యు.పి. పోస్టల్ ప్రాథమిక సహకార బ్యాంక్ లిమిటెడ్, లక్నో, ఉత్తర ప్రదేశ్ – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, ఇంటర్-బ్యాంక్ స్థూల మరియు కౌంటర్ పార్టీ పరిమితిపై ప్రూడెన్షియల్ నిబంధనలు, పెట్టుబడి లావాదేవీల యొక్క ఏకకాలిక ఆడిట్, రుణ సమాచార కంపెనీల (CICs) సభ్యత్వం, ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ, ప్రొవిజనింగ్ మరియు ఇతర సంబంధిత విషయాలు - నగర సహకార బ్యాంకులు, బ్యాంకు యొక్క రోజువారీ వ్యవహారాల్లో డైరెక్టర్ల జోక్యం, మీ వినియోగదారుని తెలుసుకోండి’ (KYC)/ఎఎంఎల్ (AML) మార్గదర్శకాలు మరియు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 29 మొదలగు అంశాలపై భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క సూచనలు/మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, యు.పి. పోస్టల్ ప్రాథమిక సహకార బ్యాంక్ లిమిటెడ్, లక్నో, ఉత్తర ప్రదేశ్ ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 5,00,000/- (ఐదు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖిత పూర్వక సమాధానాన్ని సమర్పించింది. కేసులోని వాస్తవాలను, బ్యాంక్ ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరీమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన సంఖ్య : 2018-2019/2076 |