<font face="mangal" size="3">యునైటెడ్ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నగీన - ఆర్బిఐ - Reserve Bank of India
యునైటెడ్ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నగీనా, (యు. పి) –
జరిమానా విధింపు
తేదీ: 23/05/2019 యునైటెడ్ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నగీనా, (యు. పి) – యునైటెడ్ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నగీనా, (యు. పి) పై, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రూ. 50,000 (ఏభై వేల రూపాయిలు) నగదు జరిమానా విధించింది. కె వై సి మరియు రిజర్వ్ బ్యాంక్ తనిఖీ నివేదికపై (Inspection Report) అమలు నివేదిక (compliance) సమర్పణకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన ఆదేశాలు / మార్గదర్శకాలు, అతిక్రమించినందుకు; ఈ జరిమానా విధించబడింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సెక్షన్ 47A(1)(c) [సెక్షన్ 46 (4) తో కలిపి], తమకు దఖలు పరచిన అధికారాలతో ఈజరిమానా విధించడమైనది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పైన తెలిపిన బ్యాంకుకు షోకాజ్ నోటీస్ జారీచేసింది. దీనికి, బ్యాంకు లిఖితపూర్వక జవాబు ఇచ్చింది. ఈవిషయమై బ్యాంక్ సమర్పించిన జవాబు, వాస్తవాలు పరిశీలించి, ఉల్లంఘనలు నిరూపితమైనట్లు, అవి జరిమానా విధింపతగినవేనని, రిజర్వ్ బ్యాంక్, నిర్ధారణకు వచ్చినది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/2748 |