<font face="mangal" size="3px">నగర సహకార బ్యాంకు లిమిటెడ్ బదౌన్ (ఉత్తర్ ప్ర&# - ఆర్బిఐ - Reserve Bank of India
నగర సహకార బ్యాంకు లిమిటెడ్ బదౌన్ (ఉత్తర్ ప్రదేశ్) - జరిమానా విధించబడింది
మార్చ్ 01, 2019 నగర సహకార బ్యాంకు లిమిటెడ్ బదౌన్ (ఉత్తర్ ప్రదేశ్) - జరిమానా విధించబడింది బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, బ్యాంకుకు జారీ చేసిన పర్యవేక్షక సూచనలు, ఇంటర్-బ్యాంక్ స్థూల మరియు కౌంటర్ పార్టీ ఎక్సపోజర్ డిపాజిట్ పరిమితిపై ప్రూడెన్షియల్ నిబంధనలు, పెట్టుబడి లావాదేవీల యొక్క ఏకకాలిక ఆడిట్, ప్రొఫెషనల్ డైరెక్టర్, ‘మీ వినియోగదారుని తెలుసుకోండి’ (KYC)/ఎఎంఎల్ (AML) మార్గదర్శకాలు మరియు రుణ సమాచార కంపెనీల సభ్యత్వం (CICs) మొదలగు అంశాలపై, భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క సూచనలు/మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, నగర సహకార బ్యాంకు లిమిటెడ్ బదౌన్ (ఉత్తర్ ప్రదేశ్) ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 5,00,000/- (ఐదు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ లిఖిత పూర్వక సమాధానాన్ని సమర్పించలేదు. కేసులోని వాస్తవాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరీమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన సంఖ్య : 2018-2019/2074 |