<font face="mangal" size="3">ఏటీఎంల వినియోగం - క‌స్ట‌మ‌ర్ చార్జీల ర‌ద్దు</font> - ఆర్బిఐ - Reserve Bank of India
ఏటీఎంల వినియోగం - కస్టమర్ చార్జీల రద్దు
RBI/2016-17/132 నవంబర్ 14, 2016 ద ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, డియర్ సర్, ఏటీఎంల వినియోగం - కస్టమర్ చార్జీల రద్దు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కస్టమర్లు తమ ఏటీఎంలు మరియు ఇతర ఏటీఎంలలో చేసుకునే లావాదేవీల విషయంలో తప్పనిసరి ఉచిత ఏటీఎం లావాదేవీల క్రమబద్ధీకరణ గురించి ఆగస్ట్ 14, 2014 న జారీ చేసిన సర్క్యులర్ DPSS.CO.PD.No.316/02.10.002/2014-2015 ను ప్రస్తుతం గుర్తు చేయడమైనది. ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 నోట్ల (స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లు - SBN) చట్టబద్ధ చలామణి లక్షణం రద్దుపై నవంబర్ 08. 2016 న జారీ చేసిన సర్క్యులర్ నెం. DCM(Plg) No.1226/10.27.00/2016-17 మరియు ఏటీఎంల మూసివేత మరియు డిసెంబర్ 30, 2016 వరకు ఏటీఎంల విత్ డ్రాయల్స్ పై చార్జీల రద్దుతో పాటు ఇతర అంశాలపై నవంబర్ 08, 2016 న జారీ చేసిన సర్క్యులర్ నెం. RBI/2016-17/111 DPSS. CO.PD.No./02.10.002/2016-2017 ను కూడా ఇందుమూలంగా గుర్తు చేయడమైనది. 2. ఈ నేపథ్యంలో బ్యాంకులు తమ సేవింగ్స్ బ్యాంక్ కస్టమర్లు తమ సొంత బ్యాంకుల ఏటీఎంలు మరియు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నిర్వహించే అన్ని లావాదేవీలపై (ఆర్థిక మరియు ఆర్థికేతర లావాదేవీలు కలుపుకుని), నెలలో నిర్వహించే లావాదేవీల సంఖ్యతో సంబంధం లేకుండా, ఏటీఎం చార్జీలను రద్దు చేయాలని నిర్ణయించడమైనది. 3. సమీక్షను బట్టి నవంబర్ 10, 2016 నుండి డిసెంబర్ 30, 2016 వరకు ఏటీఎంలలో నిర్వహించే అన్ని లావాదేవీలకూ ఈ చార్జీల రద్దు వర్తిస్తుంది. 4. చెల్లింపులు మరియు పరిష్కార వ్యవస్థ చట్టం 2007 (యాక్ట్ 51 ఆఫ్ 2007) లోని సెక్షన్ 10 (2) రెడ్ విత్ సెక్షన్ 18 కు అనుగుణంగా ఈ సూచనలను జారీ చేయడం జరిగింది. మీ విశ్వసనీయులు, (నంద ఎస్.దవే) |