మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, నాసిక్ కు చెందిన నాసిక్ డిస్ట్రిక్ట్ గిర్నా సహకార బ్యాంక్ లిమిటెడ్ కు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35A, సబ్-సెక్షన్ 2 క్రింద జారీచేసిన ఉత్తర్వుల ఉపసంహరణ
నవంబర్ 03, 2017 మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, నాసిక్ కు చెందిన నాసిక్ డిస్ట్రిక్ట్ గిర్నా సహకార బ్యాంక్ లిమిటెడ్ భారతీయ రిజర్వ్ బ్యాంక్, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, నాసిక్ కు చెందిన నాసిక్ డిస్ట్రిక్ట్ గిర్నా సహకార బ్యాంక్ లిమిటెడ్ కు సెప్టెంబర్ 08, 2015 న జారీచేసిన ‘ఆల్-ఇంక్లుసివ్’ (All Inclusive) ఉత్తర్వులను నవంబర్ 02, 2017 తేదీ నుంచి ఉపసంహరించుకుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35A, సబ్-సెక్షన్ (2) ద్వారా తమకు సంక్రమించిన అధికారాలను అనుసరించి, జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటోంది. నవంబర్ 01,2017 తేదీ నాటి ఆ ఉత్తర్వుల నకలును ఆసక్తి గల ప్రజల పరిశీలనార్ధం బ్యాంకు పరిసరాలలో ప్రదర్శించటం జరుగుతుంది. ఇకనుండి బ్యాంకు తన సాధారణ వ్యాపార కార్య కలాపాలను కొనసాగిస్తుంది. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2017-2018/1222 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: