<font face="mangal" size="3">ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్ బి ఎఫ్ సి (NBFC) లకు మం - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్ బి ఎఫ్ సి (NBFC) లకు మంజూరు చేయబడిన మినహాయింపుల ఉపసంహరణ
ఆర్బిఐ/2017-18/181 మే 31, 2018 అన్ని ప్రభుత్వ ఎన్ బి ఎఫ్ సి (NBFC) లు మాడం / సర్, ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్ బి ఎఫ్ సి (NBFC) లకు మంజూరు చేయబడిన ఎన్ బి ఎఫ్ సిలు గా భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా రిజిస్ట్రేషన్ చేయబడి కంపెనీల చట్టం, 2013 (సెక్షన్ 617, కంపెనీ చట్టం, 1956) లోని సెక్షన్ 2 నిబంధన (45) లో నిర్వచించిన ప్రభుత్వ యాజమాన్య కంపెనీలు, ప్రస్తుతం క్రింద ఉదహరించిన నియంత్రణ మరియు చట్టపరమైన నిబంధనల నుండి మినహాయించబడ్డాయి : (i) ఆర్బిఐ చట్టం, 1934, సెక్షన్లు 45-IB మరియు 45-IC. (ii) మాస్టర్ డైరెక్షన్ - నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ - వ్యవస్థాపరంగా ముఖ్యమైన డిపాజిట్ తీసుకోని కంపెనీ మరియు డిపాజిట్ కంపెనీ (రిజర్వు బ్యాంకు) దిశలు, 2016 మరియు మాస్టర్ డైరెక్షన్ - నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ - వ్యవస్థాపరంగా ముఖ్యం కాని డిపాజిట్ తీసుకోని కంపెనీ (రిజర్వు బ్యాంకు) దిశలు, 2016 (ఈ దిశల యొక్క 23 వ పేరాలో ఉన్న నిబంధనలు తప్ప). (iii) మాస్టర్ డైరెక్షన్ - నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ పబ్లిక్ డిపాజిట్ల ఆమోదం (రిజర్వు బ్యాంకు) ఆదేశాలు, 2016 (ఈ దిశలో 36, 37 మరియు 41 వ పేరాలో ఉన్న నిబంధనలు తప్ప) 2. సమీక్షణానంతరం, ఎన్ బి ఎఫ్ సి నిబంధనలను ప్రభుత్వ ఎన్ బి ఎఫ్ సిలకు ఈ సర్కులర్ అనుబంధం లో సూచించిన కాలక్రమం విధంగా వర్తింపచేయబడుతుంది. ఇప్పటికే సమర్పించిన రోడ్ మ్యాప్ ప్రకారం ప్రూడెన్షియల్ నిబంధనలు అనుసరిస్తున్న ప్రభుత్వ ఎన్ బి ఎఫ్ సిలు, అదే విధంగా కొనసాగుతాయి. 3. ఆర్బిఐ చట్టం, 1934 నిబంధనల నుండి మినహాయింపులపై మాస్టర్ డైరెక్షన్స్-నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ-వ్యవస్థాపరంగా ముఖ్యం కాని డిపాజిట్ తీసుకోని కంపెనీ (రిజర్వు బ్యాంకు) దిశలు, 2016 మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ - వ్యవస్థాపరంగా ముఖ్యం కాని డిపాజిట్ తీసుకోని మరియు డిపాజిట్ తీసుకునే కంపెనీ (రిజర్వు బ్యాంకు) దిశలు, 2016 మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ పబ్లిక్ డిపాజిట్ల ఆమోదం (రిజర్వు బ్యాంకు) ఆదేశాలు, 2016, తదనుగుణంగా నవీకరించబడినవి. 4. ఆర్బిఐ చట్టం, 1934, సెక్షన్ 45 NC క్రింద మినహాయింపు ఉపసంహరణ విడిగా జారీ చేయబడుతుంది. మీ విధేయులు, (మనోరంజన్ మిశ్రా) |