<font face="Mangal" size="3">రూ.500. రూ.1000 నోట్ల చట్టబద్ధమైన చలామణి ల‌క్ష‌ణం రద - ఆర్బిఐ - Reserve Bank of India
రూ.500. రూ.1000 నోట్ల చట్టబద్ధమైన చలామణి లక్షణం రద్దు: RBI ప్రకటన
నవంబర్ 12. 2016 రూ.500. రూ.1000 నోట్ల చట్టబద్ధమైన చలామణి లక్షణం రద్దు: RBI ప్రకటన రూ.500. రూ.1000 నోట్ల చట్టబద్ధమైన చలామణి రద్దు చేసి, ఆ స్సెసిఫైడ్ బ్యాంకు నోట్లను ప్రజలు అతి వేగంగా మరియు వీలైనంత తక్కువ అసౌకర్యంతో ఉపసంహరించుకోవడానికి, చట్టబద్ధమైన చలామణి కలిగిన ఇతర నో్ట్లతో వాటిని మార్చుకోవడానికి వీలు కల్పించేలా చేయడానికి బ్యాంకింగ్ వ్యవస్థపై ఒక పెద్ద బాధ్యతను మోపడం జరిగింది. ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటలలోగా RBI ఆ స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్లను ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునేలా చేసింది. వాటిని ఇతర చట్టబద్ధ చలామణి కలిగిన నోట్లతో మార్పిడి చేసుకొనేందుకు వీలుగా ఆ ఏటీఎంలను రెండు రోజుల వ్యవధిలో రీకాలిబ్రేట్ చేసి, వాటిని తిరిగి లోడ్ చేసింది. ప్రకటన వెలువడిన ఒక రోజులోగా ప్రజలు ఆ నోట్లను అన్ని బ్యాంకుల శాఖలలో మార్చుకొనే అవకాశం కల్పించింది. ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని వీలైనంత తగ్గించేందుకు అన్ని బ్యాంకుల శాఖలు మరియు RBI కార్యాలయాలు సాధారణ పనిగంటలకన్నా అదనంగా పని చేస్తున్నాయి. పెద్ద ఎత్తున వస్తున్న ప్రజల కోసం అదనపు కౌంటర్లను కూడా తెరవడం జరిగింది. నవంబర్ 10, 2016న సుమారు 10 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నివేదికలు అందాయి. అంతే కాకుండా పరిస్థితి క్లిష్టత దృష్ట్యా ప్రజల అత్యవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు, మరియు RBI కార్యాలయాలను శనివారం మరియు ఆదివారం కూడా తెరచి ఉంచడం జరిగింది. చట్టబద్ధమైన చలామణి కలిగిన ఇతర నోట్ల (రూ.2000 సహా) అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ నోట్లను తగిన ఫరిమాణంలో దేశంలోని 4,000కు పైగా ప్రదేశాలలో ఉన్న కరెన్సీ ఛెస్ట్ లలో సిద్ధంగా ఉంచడం జరిగింది. బ్యాంకుల అవసరాలకు అనుగుణంగా వాటితో అనుసంధానించడం జరిగింది. పెద్ద ఎత్తున్న వస్తున్న డిమాండ్ ను తట్టుకొనేందుకు వీలుగా ప్రింటింగ్ ప్రెస్లు పూర్తి స్థాయిలో నోట్లను ముద్రిస్తూ తగిన పరిమాణఃలో నోట్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఒకవైపు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే, ప్రజలు కూడా ప్రీ-పెయిడ్ కార్డులు, రుపే/క్రెడిట్/డెబిట్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి ఇతర ప్రత్యామ్నాయ చెల్లింపు పద్ధతుల వైపు మరలాలని ప్రోత్సహించడం జరుగుతోంది. ఎవరి కోసమైతే జన్ ధన్ యోజన బ్యాంకు అకౌంట్లను తెరిచి, కార్డులను జారీ చేయడం జరిగిందో వారంతా వాటిని ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. ఇలా పలు ప్రత్యామ్నాయ పద్ధతులను ఆశ్రయించడం వల్ల భౌతికమైన కరెన్సీపై ఒత్తిడి తగ్గడమే కాకుండా మనం ఒక డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నామన్న అనుభూతి మరింత పెరుగుతుంది. ఈ స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్లను ఇతర మూల్యవర్గపు నోట్లతో మార్చుకునే పథకం దేశవ్యాప్తంగా డిసెంబర్ 30, 2016 వరకు, ఆ తర్వాత కూడా నిర్దిష్టమైన RBI కార్యాలయాలలో అందుబాటులో ఉంటుంది. తగినంత సమయం ఉన్నందువల్ల ప్రజలు అనవసరంగా హైరానా పడి బ్యాంకింగ్ వ్యవస్థపై ఒత్తిడి పెంచవద్దని విజ్ఞప్తి చేయడమైనది. అల్పనా కిల్లావాలా ప్రెస్ రిలీజ్ : 2016-2017/1190 |