RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78472480

దీన్‌దయాల్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం – [National Rural Livelihoods Mission (DAY-NRLM)]– ఆజీవిక – వడ్డీపై ఆర్థిక సహాయ కార్యక్రమం (Interest Subvention Scheme)

RBI/2016-17/42
FIDD. GSSD.CO.BC.No.13/09.01.03/2016-17

ఆగస్ట్ 25, 2016

చైర్‌మన్‌/మానేజింగ్ డైరెక్టర్
ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకులు
అయ్యా/అమ్మా,

దీన్‌దయాల్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం – [National Rural Livelihoods Mission (DAY-NRLM)]– ఆజీవిక – వడ్డీపై ఆర్థిక సహాయ కార్యక్రమం (Interest Subvention Scheme)

జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం (National Rural Livelihoods Mission (NRLM) క్రింద వడ్డీ పై ఆర్థిక సహాయం గురించి, మాచే జనవరి 21, 2016 తేదీన జారీ చేయబడ్డ సర్క్యులర్ FIDD.GSSD.CO.BC.NO.19/09.01.03/2015-16 ను దయచేసి చూడండి.

2. 2016-17 సంవత్సరంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం (National Rural Livelihoods Mission (NRLM) క్రింద వడ్డీపై ఆర్థిక సహాయం అందించడానికి భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖచే సవరించబడిన మార్గదర్శకాలు దీనితో జత చేయబడినవి. అన్ని ప్రభుత్వ బ్యాంకులు, 15 ప్రైవేట్ రంగ బ్యాంకులు (జాబితా జతచేయబడినది) ఈ మార్గదర్శకాలను పాటించవలెను.

విధేయులు,

(ఉమా శంకర్)
చీఫ్ జనరల్ మేనేజర్
ఆనుబంధములు: పైన సూచించినవి


స్త్రీల స్వయం సహాయక సంఘాలకు (SHGs)
జారీచేసిన రుణాల వడ్డీపై ఆర్థిక సహాయ పథకం 2016-17

I. 2016-17 సంవత్సరంలో స్త్రీల స్వయంసహాయక సంఘాలకు జారీ చేసిన రుణాల వడ్డీపై, ఆర్థిక సహాయ పథకానికి సంబంధించి, అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, 250 జిల్లాలలోని సహకార బ్యాంకులు, పాటించవలసిన మార్గదర్శకాలు

i. అన్ని స్త్రీల స్వయంసహాయక సంఘాలు 3 లక్షల వరకు రుణం 7% వడ్డీకి పొందడానికి అర్హులు. SGSY క్రింద క్యాపిటల్ సబ్సిడీ పొందుతున్న SHGలు ఈ పథకం క్రింద ప్రయోజనం పొందడానికి అర్హులు కావు.

ii. వాణిజ్య బ్యాంకులు/సహకార బ్యాంకులు, ఆనుబంధం I లో పేర్కొన్న జిల్లాలలో ఉన్న స్త్రీల స్వయంసహాయక సంఘాలకు 7% వడ్డీకే రుణాలు మంజూరు చెయ్యాలి.

iii. సాధారణంగా వసూలు చేయబడే సగటు వడ్డీ రేటుకూ, 7%నికి మధ్యగల వ్యత్యాసం మేరకు, [Weighted Average Interest Charged (ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం 2016-2017 సంవత్సరానికి సూచించిన WAIC ఆధారంగా)] బ్యాంకులకు ఆర్థిక సహాయం అందజేయబడుతుంది. 2016-17 సంవత్సరానికి దీనిపై గరిష్ఠ పరిమితి 5.5%. సూచించబడిన 250 జిల్లాలలో, SHG లకు 7% వడ్డీకే రుణాలు జారీచేసిన అన్ని బ్యాంకులకు ఈ ఆర్థిక సహాయం లభిస్తుంది.

iv. ఇంతేగాక, సకాలంలో తిరిగి చెల్లించిన రుణాలపై, అదనంగా మరో 3% సహాయం లభిస్తుంది. ఒక SHG సకాలంలో రుణం తిరిగి చెల్లించింది అనడానికి RBI విధించిన ఈ క్రింది ప్రమాణాలు నెరవేర్చి ఉండాలి.

a. నగదు రుణాల పరిమితికొరకు (for Cash Credit Limit):

  1. అనుమతించిన రుణ పరిమితిని మించి, బకాయిలు వరుసగా 30 రోజులు దాటి ఉండరాదు.

  2. ఖాతాలో నిత్యమూ క్రెడిట్/ డెబిట్ లావాదేవీలు జరుగుతూ ఉండాలి. ఏమయినాగాని, కనీసం నెలకు ఒక్కటయినా, వినియోగదారు ప్రేరణద్వారా జరిగిన జమ, ఉండితీరాలి.

  3. వినియోగదారు ప్రేరణద్వారా జమ అయిన మొత్తం, ఆనెలలో వసూలు చేసిన వడ్డీకి సరిపోయినంత ఉండాలి.

b. నిర్ణీతకాల రుణాలకొరకు (for Term Loans): వడ్డీ మరియు/లేక అసలు వాయిదాలు, గడువుతేదీ పూర్తి అయిన 30 రోజుల లోపు చెల్లించబడితే, అట్టి రుణాలు, సకాలంలో చెల్లించబడినట్లు పరిగణించబడతాయి.

ఇకపైకూడా, సకాల చెల్లింపులపై రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు అమలులో ఉంటాయి.

సకాలంలో చెల్లింపులు జరిపిన SHG ఖాతాలు, రిపోర్టింగ్ త్రైమాసికం పూర్తయిన తరువాత, వడ్డీపై 3% అదనపు ఆర్థిక సహాయానికి అర్హులౌతాయి. ఈ మొత్తాన్ని, బ్యాంకులు ముందు SHG ఖాతాలకు జమచేసి, ఆతరువాత భర్తీకై కోరవలెను.

v.ఈ పథకం, గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీల SHGలకు పరిమితం.

vi. ఈ పథకానికి ఆర్థిక సహాయం, DAY-NRLM కొరకై కేంద్రం కేటాయించిన నిధుల నుండి సమకూర్చబడుతుంది.

vii. ప్రభుత్వ/ప్రైవేట్ బ్యాంకులలో ఈ పథకం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoRD) ఎంపికచేసిన నోడల్ బ్యాంక్ ద్వారా అమలుచేయబడుతుంది. నోడల్ బ్యాంక్, MoRD సూచించిన విధంగా 'వెబ్' ద్వారా ఈ పథకం అమలు చేస్తుంది. 2016-17 సంవత్సరానికి నోడల్ బ్యాంకుగా, కెనరా బ్యాంకును MoRD ఎంపికచేసింది.

viii. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ [Core Banking solutions, (CBS)] నిర్వహిస్తున్న అన్ని బ్యాంకులు, వడ్డీపై ఆర్థిక సహాయ పథకం వినియోగించుకోవచ్చు.

ix. SHG లకు 7% వడ్డీపై జారీ చేసిన రుణాలపై సాధారణ ఆర్థిక సహాయంపొందడానికి, SHG యొక్క రుణ వివరాలను, అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు, నోడల్ బ్యాంక్ పోర్టల్‌లో, వారు సూచించిన సాంకేతిక ప్రమాణాలను అనుసరించి, అప్‌లోడ్ చెయ్యాలి. 3% అదనపు సహాయంకూడా అదే పోర్టల్‌ ద్వారా క్లైమ్‌ చెయ్యాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణ క్లైములు (WAIC కి 7% మధ్యగల వ్యత్యాసం) మరియు అదనపు క్లైములు (సకాల చెల్లింపులపై 3%), త్రైమాసిక కాల అవధుల్లో (జూన్‌ 30, 2016, సెప్టెంబర్ 30, 2016, డిసెంబర్ 31, 2016 మరియు మార్చ్ 31, 2017), తదుపరి నెల ఆఖరి వారంలో క్లైమ్‌ చెయ్యాలి.

x. ఫ్రభుత్వరంగ/ప్రైవేట్ రంగ బ్యాంకులు, SHGలకు 7% వడ్డీకి రుణాల మంజూరుకు, అదనపు 3% పై ఆర్థిక సహాయం పొందడానికి, నోడల్ బ్యాంకుకు మూడు నెలలకొకసారి క్లైమ్‌ ధృవపత్రాలు సమర్పించాలి. బ్యాంకులు సమర్పించిన క్లైములతోబాటు, క్లైమ్‌ నిజమైనది, సరైనది అని ధృవ పత్రపు అసలు, జతచేయాలి. (Annexure – III to V). మార్చ్ 2017 త్రైమాసపు క్లైమ్‌, 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ సర్టిఫికేట్ సమర్పించిన తరువాతే, చెల్లించబడుతుంది.

xi ప్రభుత్వ/ప్రవేట్ రంగ బ్యాంకులు, 2016-17 సం.లో చేసిన చెల్లింపులు ఆసంవత్సరంలో క్లైమ్‌ చేయనట్లయితే అటువంటి క్లైమ్‌లు అన్నీ కలిపి 'అడిషనల్‌ క్లైమ్‌' అని సూచిస్తూ, ఆడిటర్ సర్టిఫికేట్‌తోబాటు, జూన్‌ 30, 2017 లోగా నోడల్ బ్యాంకుకు సమర్పించాలి.

xii. బ్యాంకులు చేసిన క్లైమ్‌లో ఏవేని సవరణలు ఉంటే, అవి ఆడిటర్ సర్టిఫికేట్ ఆధారంగా, తరువాతి క్లైముల నుండి సర్దుబాటు చేయబడతాయి. ప్రభుత్వ/ప్రైవేట్ రంగ బ్యాంకులు, అవసరమైన దిద్దుబాట్లు, నోడల్‌ బ్యాంక్ పోర్టల్‌ ద్వారా చేయవలెను.

II. వడ్డీపై ఆర్థిక సహాయ పథకం - II శ్రేణి జిల్లాలకొరకు (250 జిల్లాలు గాక)

250 జిల్లాలలోనేగాక, ఇతర II శ్రేణి జిల్లాలలోని స్త్రీల స్వయం సహాయక సంఘాలుకూడా DAY-NRLM క్రింద, 7% వడ్డీపై రుణాలు పొందవచ్చు. ఈ సహాయం, DAY-NRLM క్రింద కేటాయించిన నిధులనుండి, రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి వ్యవస్థల ద్వారా (SRLMs) అందచేయబడుతుంది. బ్యాంకులు SHGల నుండి, వారి రుణ నిబంధలను అనుసరించి వడ్డీ వసూలు చేస్తాయి. అయితే ఈవడ్డీరేటుకూ, 7% మధ్యగల వ్యత్యాసం, SRLM, ద్వారా SHGల ఖాతాల్లో జమ చేయ బడుతుంది. (2016-17 ఆర్థిక సంవత్సరానికి గరిష్ఠ పరిమితి 5. 5%).

తదనుసారంగా, II శ్రేణి జిల్లాలకు, వడ్డీపై ఆర్థిక సహాయానికి (Interest Subvention Scheme) వర్తించే మారదర్శకాలు ఈ క్రింద పేర్కొనబడ్డాయి:

(A) బ్యాంకుల పాత్ర:

కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్‌ (CBS) నిర్వహిస్తున్న అన్ని బ్యాంకులు, MoRD సూచించిన నమూనాలో, నేరుగా MoRD కి (FTP ద్వారా), SRLM లకు, వారి వారి జిల్లాల్లో SHG లకు మంజూరు చేసిన రుణాలు, బకాయిలకు సంబంధించిన అన్ని వివరాలూ తెలియచెయ్యాలి. SHGలకు, వడ్డీపై ఆర్థిక సహాయం చెల్లించడానికి వీలుగా, ఈ వివరాలు నెలవారీగా సమర్పించాలి.

(B) రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర:

i. అన్ని స్త్రీ స్వయంసహాయక సంఘాలు, DAY-NRLM క్రింద, స్వయంసహాయక సంఘాలుగా పరిగణించబడతాయి. రుణాలు సకాలంలో చెల్లిస్తే, 3 లక్షలవరకు రుణం, 7% వడ్డీకే పొందడానికి అర్హులౌతాయి.

ii. ఈ పథకం రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి వ్యవస్థలద్వారా (SRLMs) ద్వారా నిర్వహించబడుతుంది. అర్హులైన SHGలకు, వాణిజ్య/సహకార బ్యాంకులనుండి పొందిన, రుణంపై చెల్లించవలసిన వడ్డీపై ఆర్థిక సహాయం అందించబడుతుంది. దీనికై నిధులు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయానుసారం, కేంద్రంచేసిన కేటాయింపుల నుండి, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా ఇచ్చిన నిధులనుండి సమకూర్చబడతాయి.

iii. బ్యాంకులు SHG లనుండి వసూలుచేసిన వడ్డీకి, 7% కి మధ్యగల వ్యత్యాసాన్ని (2016-17 లో, గరిష్ఠంగా 5. 5%) SRLMs నేరుగా నెల/త్రైమాసిక వ్యవధుల్లో, భర్తీ చేస్తాయి. సకాలంలో రుణం తిరిగి చెల్లించిన SHGల ఖాతాలకు ఈ సొమ్ము SRLMs చే, ఇ-ట్రాన్స్ఫర్ (e-transfer) ద్వారా జమచేయబడుతుంది.

iv. సకాలంలో రుణం తిరిగిచెల్లించబడింది అనడానికి, RBI సూచించిన ఈ క్రింది ప్రమాణాలు నెరవేర్చి ఉండాలి:

a. నగదు రుణాల పరిమితికొరకు (for Cash Credit Limit):

1. అనుమతించిన రుణ పరిమితిని మించి, బకాయిలు వరుసగా 30 రోజులు దాటి ఉండరాదు.

2. ఖాతాలో నిత్యమూ క్రెడిట్/ డెబిట్ లావాదేవీలు జరుగుతూ ఉండాలి. ఏమయినాగాని, కనీసం నెలకు ఒక్కటయినా, వినియోగదారు ప్రేరణద్వారా జరిగిన జమ, ఉండితీరాలి.

3. వినియోగదారు ప్రేరణద్వారా జమ అయిన మొత్తం, ఆనెలలో వసూలు చేసిన వడ్డీకి సరిపోయినంత ఉండాలి.

b. నిర్ణీతకాల రుణాలకొరకు (for Term Loans): వడ్డీ మరియు/లేక అసలు వాయిదాలు, గడువుతేదీ పూర్తి అయిన 30 రోజుల లోపు చెల్లించబడితే, అట్టి రుణాలు, సకాలంలో చెల్లించబడినట్లు పరిగణించబడతాయి.

ఇకపైకూడా, సకాల చెల్లింపులపై రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు అమలులో ఉంటాయి.

III. వడ్డీపై ఆర్థిక సహాయానికి ప్రత్యేకమైన పథకాలున్న రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి మార్గదర్శకాలను కేంద్ర పథకంతో సమన్వయించవలసిందిగా సూచించబడినది.

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?