<font face="mangal" size="3">భారత బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) అమలు - మార్గదర్శక - ఆర్బిఐ - Reserve Bank of India
భారత బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) అమలు - మార్గదర్శకాలు
RBI/2014-15/327 నవంబర్ 28, 2014 ద ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డియర్ సర్/మేడమ్, భారత బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) అమలు - మార్గదర్శకాలు 2012-13 దవ్యవిధానం యొక్క రెండో త్రైమాసిక సమీక్షలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశంలో ఒక ఎలెక్ట్రానిక్ GIRO పేమెంట్ వ్యవస్థను అమలు చేసేందుకు అవసరమైన నియమనిబంధనలు తయారు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘పేమెంట్ సిస్టమ్స్ విజన్ ఇన్ ఇండియా 2012-15’ కూడా దేశంలో వివిధ జాతీయ/స్థానిక ప్లేయర్లతో, ప్రైవేట్/పప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న సంస్థలతో వైవిధ్యమైన, క్లిష్టమైన భారీ బిల్ పేమెంట్ల మార్కెట్ ఉందని గుర్తించింది. 2. తదనుగుణంగా, RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ శ్రీ. జి.పద్మనాభన్ ఛైర్మన్‌షిప్ ఆధ్వర్యంలో దేశంలో ఒక ఎలెక్ట్రానిక్ GIRO పేమెంట్ వ్యవస్థ అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ప్రతిపాదనల ఆధారంగా, దేశంలోని ఖాతాదారుల బిల్ పేమెంట్ల కోసం, బిల్లర్లు భౌగోళికంగా ఎక్కడ ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా వర్తించే టచ్ పాయింట్లను సృష్టించేందుకు ఒక ఫ్రేమ్‌వర్క్ ను కనుగొనే లక్ష్యంతో, బాంబే ఐఐటీ ప్రొఫెసర్ ఉమేష్ బెల్లూర్ ఛైర్మన్‌షిప్ కింద ఒక GIRO అడ్వైజరీ బృందం (GAG) ను ఏర్పాటు చేశారు. మార్చి 20, 2014న తన నివేదిక సమర్పించిన GAG, దేశంలో బిల్ పేమెంట్ల వ్యవస్థ కోసం ఒక శ్రేణీయ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. దీనిలో ఒక సెంట్రల్ యూనిట్ ప్రమాణాలను నిర్దేశిస్తుంది. BBPS కొరకు నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా మరియు వాటికి కట్టుబడి వివిధ ఆపరేటింగ్ యూనిట్లు పని చేస్తాయి. తదనుగుణంగా, భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) అమలు కోసం రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలను ప్రజాభిప్రాయం కోసం RBI ఆగస్టు 07, 2014న వాటిని తన వెబ్‌సైట్‌లో పెట్టింది. 3. భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) అమలు కోసం రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలపై వచ్చిన ప్రజాభిప్రాయాల ఆధారంగా, ప్రస్తుతం తుది మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది(అనుబంధం). BBPS కు ప్రమాణాలు నిర్దేశించేందుకు భారత జాతీయ పేమెంట్ కార్పొరేషన్ (NPCI) అథరైజ్డ్ భారత్ బిల్ పేమెంట్ సెంట్రల్ యూనిట్ (BBPCU)గా పని చేస్తుంది. ఈ ప్రమాణాలకు అన్ని ఆపరేటింగ్ యూనిట్లు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. మార్గదర్శకాలలో పేర్కొన్నట్లుగా BBPCU గా NPCI, BBPSకు సంబంధించిన క్లియరింగ్ మరియు సెటిల్ మెంట్ కార్యకలాపాలు కూడా చేపడుతుంది. 4. BBPS వ్యవస్థలో కాబోయే భాగస్వాములు NPCI తో ఇంటరాక్ట్ అయి, BBPS నియమనిబంధనల రూపుకల్పనలో భాగస్వామ్యం పంచుకోవాలని కోరడమైనది. అదే విధంగా పేమెంట్ మరియు సెటిల్మెంట్ యాక్ట్, 2007కు అనుగుణంగా అవి అథరైజేషన్/ఆమోదం కోసం, సందర్భానుసారంగా, దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కోరడమైనది. అథరైజేషన్ కొరకు దరఖాస్తులను భారతీయ రిజర్వ్ బ్యాంకుకు 2015 మొదటి త్రైమాసికం నుంచి సమర్పించవచ్చు. దరఖాస్తులు సమర్పించాల్సిన ఖచ్చితమైన తేదీ/అథరైజేషన్/ఆమోదం కొరకు సమర్పించాల్సిన దరఖాస్తు ఫార్మాట్‌ను తొందరలో నోటిఫై చేయడం జరుగుతుంది. 5. ఈ మార్గదర్శకాలను పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 (యాక్ట్ 51 ఆఫ్ 2007)లోని సెక్షన్ 18 రెడ్ విత్ సెక్షన్ 10(2) కింద, ఇతర ఏ చట్టానికి సంబంధించిన అనుమతులు/ అప్రూవల్స్ కు ఆటంకం లేకుండా, ఏవైనా ఉంటే, జారీ చేయడం జరిగింది. మీ విశ్వసనీయులు, ప్రిన్సిపాల్ చీఫ్ జనరల్ మేనేజర్ భారత బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) అమలు - మార్గదర్శకాలు పరిచయం 1. రిటైల్ పేమెంట్ లావాదేవీలలో బిల్ పేమెంట్ అనేది ఒక ప్రధానమైన అంశం. GIRO ఆధారిత పేమెంట్ సిస్టమ్స్(2013)ను అమలు చేసే అవకాశాలను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ (ఛైర్మన్: జి.పద్మనాభన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, RBI) దేశంలోని 20 ప్రధాన నగరాలలో ప్రతి యేటా రూ.6223 బిలియన్ల విలువ చేసే 30,800కు పైగా బిల్లులను జనరేట్ చేస్తున్నారని అంచనా వేసింది. 2. ప్రస్తుతమున్న పద్ధతులు సురక్షితంగా, పటిష్టంగా ఉన్నప్పటికీ, అవి వినియోగదారులు/ ఖాతాదారులు యుటిలిటీ బిల్లులు, స్కూల్/యూనివర్సిటీ బిల్లులు, మున్సిపల్ పన్నులు మొదలైన పలు రకాల బిల్లులను చెల్లించేలా వారి అవసరాలకు అనుగుణంగా లేవు. బిల్ పేమెంట్ విధానంలో అంతరనిర్వాహక అనుసంధాన అవకాశం లేకపోవడం, చాలా మంది వినియోగదారులకు వివిధ రకాల ఎలెక్ట్రానిక్ చెల్లింపులు చేసే అవకాశం అందుబాటులో పోవడం కారణంగా అవి వినియోగదారులు/ఖాతాదారుల అవసరాలను ప్రస్తుత పద్ధతులు పూర్తిగా తీర్చలేకపోతున్నాయి. 3. అందువల్ల, దేశంలో వినియోగదారుల కోసం... ఏజెంట్ల నెట్‌వర్క్ ద్వారా, అంతరనిర్వాహక విధానాలనకు అనుమతించే, చెల్లింపులను వెంటనే నిర్ధారించే ఒక అనుసంధానిత, అందరికీ అందుబాటులో ఉండేలా బిల్ పేమెంట్ సేవలను అందించే సమగ్ర బిల్ పేమెంట్ వ్యవస్థ అవసరం ఒకటుంది. ఈ బిల్ పేమెంట్ వ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తూ, ప్రస్తుత వ్యవస్థకన్నా తక్కువ ఖర్చు అయ్యేలా ఉండాలి. తద్వారా, దేశంలో బిల్ పేమెంట్ల ప్రమాణాలను నిర్దేశించేలా, వినియోగదారుల విశ్వాసం, అనుభవాన్ని పెంచేలా ఉండాలి. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ఉన్న బిల్ పేమెంట్ వినియోగదారుల కోసం దేశవ్యాప్త టచ్ పాయింట్ల రూపకల్పనకు అనుమతించే ఒక ఫ్రేమ్ వర్క్ ను తయారు చేసేందుకు GIRO అడ్వైజరీ కమిటీ (ఛైర్మన్: ప్రొఫెసర్. ఉమేష్ బెల్లూరు, బాంబే ఐఐటీ) (2014)ను ఏర్పాటు చేయడం జరిగింది. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్స్ (BBPS) అమలు కోసం ఆ కమిటీ రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలను ఆగస్టు 7, 2014న RBI ప్రజాభిప్రాయం కోసం తన వెబ్ సైట్‌లో ఉంచింది. 4. GAG ప్రతిపాదలనపై వచ్చిన ప్రజాభిప్రాయాల ఆధారంగా, దేశంలో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్స్ (BBPS) అమలు కోసం రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలను ప్రజలు/భాగస్వాముల అభిప్రాయాల కోసం రిజర్వ్ బ్యాంక్ తన వెబ్ సైట్‌లో ఉంచింది. వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించి, విస్తృత సమాలోచనల అనంతరం తుది మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. పథకం 5. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) దేశంలో బిల్ పేమెంట్ వ్యవస్థ కోసం ఒక శ్రేణీయ నిర్మాణంగా పని చేస్తూ, ఒక సింగిల్ బ్రాండ్ ఇమేజ్ ద్వారా వినియోగదారులు ఎప్పుడైనా/ఎక‌్కడైనా విధానంలో బిల్లు చెల్లించే వెసులుబాటును కల్పిస్తుంది. 6. BBPSలో రెండు రకాల వ్యవస్థలు ఉంటాయి. ఇవి భిన్నరకాల కార్యకలాపాలు నిర్వహిస్తాయి - i) భారత్ బిల్ పేమెంట్ సెంట్రల్ యూనిట్ (BBPCU) అనేది BBPS ను నిర్వహించే ఏకైక అధీకృత వ్యవస్థగా ఉంటుంది. BBPCU మొత్తం వ్యవస్థకు మరియు దానిలో భాగస్వాములకు అవసరమైన కార్యనిర్వాహక, సాంకేతిక, వ్యాపార ప్రమాణాలను నెలకొల్పుతుంది. అంతే కాకుండా, క్లియరింగ్ మరియు సెటిల్మెంట్ కార్యకలాపాలు కూడా చేపడుతుంది. ii) భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) అనేవి అధీకృత కార్యనిర్వాహక యూనిట్లు. ఇవి BBPCU నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి పని చేస్తాయి. ఈ శ్రేణీయ నిర్మాణాన్ని ఒక సమర్థమైన BBPOUల ఏజెంట్ల నెట్ వర్క్ తో మరింత బలోపేతం చేయవచ్చు. ఒకే ఒక BBPCU ఉండగా, BBPS కింద పలు BBPOUలు పని చేస్తుండవచ్చు. BBPS పరిధి 7. ప్రస్తుతం దేశంలో ఆన్‌లైన్ వాణిజ్య పరిధిలో స్థూలంగా ఒకవైపు కాంటెంట్ ప్రొవైడర్లు, మరోవైపు పేమెంట్ స్వీకరణదారులు ఉన్నారు. చెల్లింపుల వైపు బ్యాంకులు, బ్యాంకేతర మధ్యవర్తులు పేమెంట్ సేవల స్వీకరణదారులుగా ఉన్నారు. కాంటెంట్ ప్రొవైడర్ల వైపు డిజిటల్ మార్కెట్ ప్లేస్ లను హోస్ట్ చేసే మధ్యవర్తులు, వ్యాపారులకు స్పెసిఫిక్ వెర్టికల్స్ కల్పించే వారితో పాటు భిన్నరకాల మధ్యవర్తులు ఉన్నారు. ఈ మధ్యవర్తులలో కొందరు బిల్ పేమెంట్ల స్వీకరణ వ్యాపారంలో కూడా ఉన్నారు. కొందరు కాంటెంట్ ప్రొవైడర్లు తమ సొంత ఏర్పాట్ల ద్వారా పేమెంట్ చెల్లింపులకు వీలు కల్పిస్తుండగా, ఇతరులు ప్రత్యేక చెల్లింపుల స్వీకరణదారుల సేవలను ఉపయోగించుకుంటున్నారు. 8. దేశంలో ఏజెంట్ల నెట్ వర్క్ ద్వారా, అంతర-నిర్వాహక విధానాలనకు అనుమతించే, చెల్లింపులను వెంటనే నిర్ధారించే ఒక అనుసంధానిత, తక్కువ ఖర్చుతో బిల్ పేమెంట్ సేవలను అందించే ఒక సమగ్ర బిల్ పేమెంట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం BBPS యొక్క లక్ష్యం. అందువల్ల బిల్ పేమెంట్ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న ప్లేయర్లు (బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు రెండూ) రెండింటినీ, మరియు పేమెంట్ సేవల స్వీకరణదారులను BBPS లో భాగస్వాములుగా ఉంచాలని నిర్ణయించడమైనది. 9. మొదటగా, BBPS లో యుటిలిటీ సర్వీస్ ప్రొవైడర్లు అందించే రోజువారీ యుటిలిటీ సేవల పునరుక్త చెల్లింపుల (నెలవారీ, ద్వైమాసిక, త్రైమాసిక మొద.) స్వీకరణ లాంటి కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తారు. క్రమంగా రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా BBPS పరిధిని విస్తరించి, ఇతర రకాల పునరుక్త చెల్లింపులు ఉదా.స్కూల్/యూనివర్సిటీ ఫీజులు, మున్సిపల్ పన్నులు/చెల్లింపులు మొదలైన వాటిని స్వీకరించే వీలు కల్పిస్తారు. 10. అందువల్ల, ప్రస్తుతం పైన పేర్కొన్న పరిధిలోని కార్యకలాపాలు చేపడుతున్న సంస్థలు, తగిన అర్హతా ప్రమాణాలను కలిగి, కింద పేర్కొన్నట్లుగా అథరైజేషన్ ను పొందాలి. భాగస్వాములు 11. BBPSలో BBPCUలు, BBPOUలు, వాటి ఏజెంట్లు, పేమెంట్ గేట్ వేలు, బ్యాంకులు, బిల్లర్లు, సర్వీస్ ప్రొవైడర్లు మరియు BBPS కింద అవసరమైన అథరైజ్డ్ ప్రీపెయిడ్ ఇన్ స్ట్రుమెంట్ ఇష్యూవర్స్‌తో పాటు ఇతర ఎంటిటీలు కూడా భాగస్వాములుగా ఉంటారు. మరింత స్పష్టత కొరకు ఈ క్రింద తిరిగి వివరించడం జరిగింది: ఎ. భారత బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) ఏజెంట్ల నెట్ వర్క్ ద్వారా, అంతర-నిర్వాహక విధానాలనకు అనుమతించే, చెల్లింపులను వెంటనే నిర్ధారించే ఒక అనుసంధానిత, తక్కువ ఖర్చుతో బిల్ పేమెంట్ సేవలను అందించే ఒక సమగ్ర బిల్ పేమెంట్ వ్యవస్థ. బి. భారత బిల్ పేమెంట్ సెంట్రల్ యూనిట్ (BBPCU) BBPS ను నిర్వహించే ఏకైక అధీకృత ఎంటిటీగా ఉంటుంది. BBPCU మొత్తం వ్యవస్థకు మరియు దానిలో భాగస్వాములకు అవసరమైన కార్యనిర్వాహక, సాంకేతిక, వ్యాపార ప్రమాణాలను నెలకొల్పుతుంది. అంతే కాకుండా, క్లియరింగ్ మరియు సెటిల్మెంట్ కార్యకలాపాలు కూడా చేపడుతుంది. సి. భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) అనేవి అధీకృత కార్యనిర్వాహక యూనిట్లు. ఇవి BBPCU నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి పని చేస్తాయి. సిస్టమ్ భాగస్వాములకు ఉండాల్సిన అర్హతా ప్రమాణాలు 12. BBPS ఏర్పాటు చేసిన లక్ష్యాలకు అనుగుణంగా, BBPCU కంపెనీస్ యాక్ట్ 1956 (కంపెనీస్ యాక్ట్, 2013 సెక్షన్ 8గా సవరణ చేయబడింది) ఒక సెక్షన్ 25 కంపెనీగా ఉంటూ, ప్రొఫెషనల్ సీనియర్ మేనేజ్‌మెంట్ కలిగి, పేమెంట్ల విషయంలో సెంట్రల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్వహించే అనుభవం; క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ మరియు లావాదేవీల నిర్వహణలో అనుభవం కలిగి ఉండాలి. తదనుగుణంగా, పై అర్హతా ప్రమాణాలను కలిగిన భారత జాతీయ పేమెంట్స్ కార్పొరేషన్(దేశంలోని అన్ని రిటైల్ చెల్లింపులకు ఒక అధీకృత ఛాత్రసంస్థ)ను BBPSను అమలు చేసేందుకు BBPCU గా అథరైజేషన్ కల్పించడం జరిగింది. 13. BBPOU లుగా వ్యవహరించాలనుకుంటున్న బ్యాంకింగేతర సంస్థలకు ఈ క్రింది అర్హతా ప్రమాణాలను నిర్దేశించారు: ఎ. ఆ సంస్థ భారతదేశంలో నెలకొల్పబడి ఉండాలి మరియు కంపెనీస్ యాక్ట్ 1956/కంపెనీస్ యాక్ట్ 2013 కింద రిజిష్టర్ అయి ఉండాలి. బి. దరఖాస్తు చేస్తున్న సంస్థ యొక్క మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ (MoA) లో BBPOU గా చేపట్టాలనుకుంటున్న కార్యకలాపాల వివరాలు ఉండాలి. సి. దరఖాస్తు చేస్తున్న సంస్థకు చివరగా ఆడిట్ చేయబడిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం కనీసం రూ.100 కోట్ల నెట్ వర్త్ ఉండాలి మరియు అది అన్ని సమయాలలో మెయిన్ టెయిన్ చేయబడుతూ ఉండాలి. డి. ఒకవేళ దరఖాస్తు సంస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉంటే, అథరైజేషన్ కోరే సందర్భంలో కన్సాలిడేటెడ్ పాలసీ ఆన్ FDI కింద పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (DIPP) నోటిఫై చేసిన విధానానికి అనుగుణంగా, మరియు విదేశీ మారకద్రవ్య నిర్వహణా చట్టం (FEMA) కింద రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా తగిన అధికారిక సంస్థ నుంచి అవసరమైన అనుమతులను సమర్పించాల్సి ఉంటుంది. ఇ. ఆ కంపెనీకి బిల్ కలెక్షన్/బిల్లర్లకు సేవల విషయంలో డొమైన్ అనుభవం ఉండాలి. మరియు ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ లో కనీసం ఒక ఏడాది పాటు తగిన అనుభవం ఉండాలి. ఎఫ్. ఆ సంస్థ పేమెంట్స్ అండ్ సెటిల్ మెంట్స్ యాక్ట్, 2007 కింద కార్యకలాపాలు నిర్వహించేందుకు రిజర్వ్ బ్యాంక్ కు అథరైజేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి. 14. BBPOUలుగా వ్యవహరించాలనుకుంటున్న బ్యాంకులు పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ సిస్టమ్స్ యాక్ట్, 2007కు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది. 15. BBPS పరిధిలోకి వస్తూ, పైన పేర్కొన్న తగిన అర్హతా ప్రమాణాలు లేని ఎంటిటీలు, కానీ ఈ డొమైన్‌లో BBPOUలుగా కొనసాగాలనుకుంటున్న ఎంటిటీలు, ఆ అర్హతా ప్రమాణాలు సాధించేందుకు, BBPS గా కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఒక ఏడాదికి మించకుండా, గడువు కోరాలి. ప్రత్యామ్నాయంగా, అవి ఇతర అర్హత కలిగిన మరియు అథరైజ్డ్ BBPOUలతో భాగస్వాములుగా కూడా కలవవచ్చు. BBPS పరిధిలో ఉన్న ప్రస్తుత ఎంటిటీలు, పైన పేర్కొన్న రెండు చర్యలలో ఒక్కదానినీ చేయలేకపోయినట్లయితే, వాటిని భవిష్యత్తులో బిల్ పేమెంట్ చెల్లింపుల స్వీకరణకు అనుమతించరు. అథరైజేషన్ 16. BBPCU మరియు BBPOU అనే రెండు అంశాలు కలిగిన BBPS - సిస్టమ్, పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 కింద ఒక అధీకృత చెల్లింపుల వ్యవస్థగా పని చేస్తుంది. 17. BBPOUలకు సంబంధించి, అథరైజేషన్ విధానాన్ని ఈ క్రింద వివరించడం జరిగింది: ఎ. BBPS పరిధిలోకి వస్తూ, BBPOUగా భాగస్వామ్యం పంచుకోవాలనే ఆసక్తి కలిగిన బ్యాంకులు, BBPOUలుగా కార్యకలాపాలుగా నిర్వహించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి వన్-టైమ్ అప్రూవల్ పొందాల్సి ఉంటుంది. బి. తగిన అర్హత కలిగిన బ్యాంకింగేతర సంస్థల ఎంటిటీలు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 కు అనుగుణంగా RBI అనుమతి పొందాక, BBPS కింద వాటికి BBPOUలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తారు. సి. ఏదైనా బ్యాంకింగేతర సంస్థ ఒక పేమెంట్ సిస్టమ్‌గా కార్యకలాపాలు నిర్వహించడానికి PSS చట్టం కింద అథరైజేషన్ పొందేందుకు అవసరమైన సాధారణ మార్గదర్శకాలను /documents/87730/30842423/86707.pdf. లో చూడవచ్చు. డి. ఇన్ ప్రిన్సిపుల్ ఆమోదం పొందిన ఎంటిటీలు (బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థల రెండూ), తుది అథరైజేషన్/అప్రూవల్ కోసం అర్హత పొందడానికి ముందుగా, అవి తాము బిల్ పేమెంట్లను BBPS ప్రమాణాలకు లోబడి చేస్తున్నట్లు BBPCU నుంచి అవసరమైన సర్టిఫికేషన్ పొందాలి. PSS యాక్ట్, 2007 కింద ఫైనల్ అథరైజేషన్/అప్రూవల్ కు అవసరమైన సాధారణ నియమనిబంధనలకు ఇది అదనం. ఇ. ప్రస్తుతం PSS యాక్ట్, 2007 కింద పేమెంట్ సిస్టమ్స్ గా ఆపరేట్ చేసేందుకు అథరైజేషన్ పొందిన నాన్ బ్యాంక్ ఎంటిటీలు, BBPS కింద BBPOU గా కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రత్యేక అథరైజేషన్ పొందాల్సి ఉంటుంది. సెటిల్‌మెంట్ నమూనా 18. సెటిల్మెంట్ విధానం అనేది అంతర-నిర్వాహక చెల్లింపుల వ్యవస్థలో అంతర్భాగంగా ఉంటుంది. BBPS కింద BBPOU ఏజెంట్లు తమ సొంత BBPOU కు చెందని వారితో పాటు వివిధ బిల్లర్ల నుంచి చెల్లింపులు స్వీకరించవచ్చు. అందువల్ల, శ్రేణీయ నమూనాలోని సెంట్రలైజ్డ్ బిల్ పేమెంట్స్ సిస్టమ్ లోని లావాదేవీలను ON-US (బిల్లర్ మరియు పేమెంట్ స్వీకరించే ఏజెంట్ ఇద్దరూ ఒకే BBPOU కు చెందినవారై ఉంటారు) మరియు OFF-US (బిల్లర్ మరియు పేమెంట్ స్వీకరించే ఏజెంట్ వేర్వేరు BBPOU లకు చెందినవారై ఉంటారు) వర్గీకరించవచ్చు. 19. లావాదేవీల తరహాను బట్టి సెటిల్మెంట్ సమయం మరియు బిల్ పేమెంట్ల చెల్లింపు కొరకు ఒక ఏకీకృత అంతర-నిర్వాహక విధానంలో బాధ్యతలను నిర్దేశించే విషయంలో సెటిల్మెంట్ విధానం వీలైనంత సమర్థవంతంగా ఉండాలి. తదనుగుణంగా, సెంట్రలైజ్డ్ బిల్ పేమెంట్స్ సిస్టమ్ కింద, BBPOU లు ON-US లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటాయి. OFF-US లావాదేవీల కొరకు, BBPCU అన్ని BBPOU లు నివేదించిన OFF-US లావాదేవీలను నిర్వహించి, వివిధ BBPOU ల మధ్య ప్రతి బిల్లర్‌కు ఒక తగిన సెటిల్మెంట్ ను సూచిస్తుంది. సంబంధిత బిల్లర్ల బ్యాంకులకు క్రెడిట్ టు బిల్లర్ల అకౌంట్‌లకు పే-ఔట్స్ చేయమని BBPCU సెటిల్మెంట్ బ్యాంకుకు సూచనలిస్తుంది. సెటిల్మెంట్‌లో BBPCU పాత్ర 20. ON-US లావాదేవీలలో (పేమెంట్ స్వీకరించిన ఏజెంట్ మరియు పేమెంట్‌ను స్వీకరించాల్సిన బిల్లర్ - ఇద్దరూ ఒకే BBPOU కు చెందిన వారు) లావాదేవీల క్లియరింగ్ మరియు సెటిల్మెంట్ విషయంలో BBPCUకు ఎలాంటి పాత్ర ఉండదు. వాటిని మొదలు నుంచి చివరి వరకు - ఖాతాదారు నుంచి ఏజెంట్ పేమెంట్‌ను స్వీకరించడం; ఏజెంట్, BBPOUల మధ్య ఫండ్స్ సెటిల్మెంట్ మరియు బిల్లర్ల అకౌంట్‌కు తుది పేమెంట్ వరకు, BBPS కింద ఏర్పాటు చేయబడిన ప్రమాణాలకు లోబడి, సంబంధిత BBPOU లే అంతా చూసుకుంటాయి. 21. OFF-US లావాదేవీలలో (పేమెంట్ స్వీకరించిన ఏజెంట్ మరియు పేమెంట్‌ను స్వీకరించాల్సిన బిల్లర్ - ఇద్దరూ వేర్వేరు BBPOUకు చెందిన వారు) రెండు BBPOU ల మధ్య లావాదేవీల క్లియరింగ్ మరియు సెటిల్మెంట్ విషయాన్ని BBPCU నిర్వహిస్తుంది. BBPOU OFF-US లావాదేవీల డాటాను (ఈ మొత్తం ప్రాసెస్ ను ఆటోమేట్ చేసే అవకాశముంది) BBPCU కు రూట్ చేయవచ్చు. దీనిని ఉపయోగించుకొని, BBPCU ప్రతి BBPOU కు ఒక నెట్ సెటిల్మెంట్‌ను నిర్ధారిస్తుంది. BBPOU నిర్ధారించిన నెట్ పేమెంట్ ఆధారంగా ప్రతి BBPOU, BBPCU ఏర్పాటు చేసిన సెటిల్మెంట్ బ్యాంక్ ద్వారా నిధులను చెల్లిస్తుంది/స్వీకరిస్తుంది. BBPCU ఆ సెటిల్మెంట్‌కు సంబంధించిన డాటాను BBPOUకు పంపి, తద్వారా వారు సంబంధింత బిల్లర్లకు చెల్లింపులు చేసేందుకు దోహదపడుతుంది. సెటిల్మెంట్ లో BBPOU ల పాత్ర 22. ON-US లావాదేవీలలో (పేమెంట్ స్వీకరించే ఏజెంట్ మరియు పేమెంట్ స్వీకరించాల్సిన బిల్లర్ - ఇద్దరూ ఒకే BBPOU కు చెందిన వారు), ప్రతి BBPOU ఏజెంట్లు మరియు బిల్లర్లు సెటిల్మెంట్ అకౌంట్ ను మెయిన్ టెయిన్ చేయాల్సిన ఒక సెటిల్మెంట్ బ్యాంకును గుర్తించాల్సి ఉంటుంది. BBPOU ప్రతి భాగస్వామి విషయంలో (ఏజెంట్లు మరియు బిల్లర్లు) EOD వద్ద ఒక నెట్ పొజిషన్‌ను చేరుకుని, సెటిల్మెంట్ బ్యాంకుకు సెటిల్మెంట్ ఫైలును పంపుతుంది. 23. సేకరించిన మొత్తం ప్రిన్సిపల్ సొమ్మును బిల్లర్లు స్వీకరిస్తే (లేదా BBPOU లు, బిల్లర్ వ్యాపారుల మధ్య కుదిరిన వ్యాపార ఒప్పందం మేరకు వచ్చే సొమ్ము) ఏజెంట్లు కమిషన్/రుసుమును స్వీకరిస్తారు (కమీషన్/రుసుము చెల్లింపుపై జరిగిన ఒప్పందానికి అనుగుణంగా). 24. సెటిల్మెంట్ పూర్తయిన పిదప, MIS కొరకు, సర్దుబాట్లకు, కస్టమర్ సర్వీస్/గ్రీవెన్స్ పరిష్కారాల కొరకు BBPOU సెటిల్మెంట్ లావాదేవీల వివరాలను తన కింద ఉన్న బిల్లర్లకు, ఏజెంట్లకు అందుబాటులో ఉండేలా చూడాలి. 25. OFF-US లావాదేవీల విషయంలో, BBPCU నిర్దేశించిన నెట్ సెటిల్మెంట్ సొమ్మును BBPOU చెల్లిస్తుంది/స‌్వీకరిస్తుంది. అయితే, ఆన్ బోర్డులో ఉన్న బిల్లర్లకు చెల్లింపులు (ఇతర BBPOU చేత సేకరించబడిన పేమెంట్), BBPCU నుంచి లావాదావీల సమాచారాన్ని స్వీకరించిన అనంతరం BBPOU ద్వారా చెల్లింపులు చేస్తారు. సెటిల్మెంట్ల విషయంలో ప్రమాణాలు నిర్ధారించడం 26. BBPS యొక్క లక్ష్యం బ్యాంకుల పరిధిలోకి రాని/బ్యాంక్ లను సరిగా ఉపయోగించుకోని విస్తృతమైన జనాభాకు అందుబాటులో ఉండేలా ఒక బిల్ పేమెంట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం. అన్ని రకాల చెల్లింపులూ బిల్ పేమెంట్ వ్యవస్థలో తప్పనిసరిగా భాగం కావాలి. 27. సంబంధిత సెటిల్మెంట్ బ్యాంకులో సెటిల్మెంట్ అకౌంట్ లను ఏర్పాటు చేయడం కోసం చేయాల్సిన ఏర్పాట్లు, నిర్దేశిత సమయంలో సెటిల్మెంట్ మొదలైన వాటిని BBPCU నిర్ధారిస్తుంది. మరియు బిల్ పేమెంట్ వ్యవస్థ ప్రమాణాలలో అది భాగం అవుతుంది. 28. బిల్ పేమెంట్స్ చేయడానికి ఎండ్-కన్జూమర్స్ కు అనేక రకాలైన పేమెంట్ విధానాలు ఉండవచ్చు. చెల్లింపు విధానాన్ని బట్టి వాటిలో ప్రతిదానికి దాని సొంత ‘రియలైజేషన్ సైకిల్’ ఉండవచ్చు. అందువల్ల, BBPCU ప్రతి దశలో ఉదా. ON-US సెటిల్మెంట్ విషయంలో ఏజెంట్ నుంచి BBPOU, BBPOU నుంచి బిల్లర్ మరియు OFF-US సెటిల్మెంట్ విషయంలో BBPOU నుంచి BBPCUకు, ఆ తర్వాత బిల్లర్‌కు (సంబంధిత BBPOU ద్వారా) సమయం విషయంలో, పేమెంట్ల కలెక్షన్ విషయంలో ప్రమాణాలను నిర్దేశిస్తుంది. 29. RBI అనుమతితో BBPCU నిర్దేశించిన ప్రమాణాలను అన్ని BBPS భాగస్వాములు అన్ని వేళలా పాటించాల్సి ఉంటుంది. ఖాతాదారుల రక్షణ మరియు సమస్యల పరిష్కారం 30. BBPS కింద, BBPOU అన్ని ముఖ్య నియమనిబంధనలను స్పష్టమైన, సాధారణ భాషలో (వీలైనంత వరకు ఇంగ్లీష్, హిందీ మరియు స్థానిక భాషలో) వివిధ బిల్లర్ల కస్టమర్లు/తన సేవల వినియోగదారులకు అర్థమయ్యే భాషలో వెల్లడిస్తుంది. ఇలా వెల్లడించే వాటిలో: * బిల్ పేమెంట్ చెల్లింపు సదుపాయంలో ఉన్న అన్ని ఛార్జీలు, రుసుములు, మరియు * కస్టమర్ సర్వీస్ టెలిఫోన్ నెంబర్లు మరియు వెబ్ సైట్ URL ఉండాలి. 31. ఖాతాదారుల ఫిర్యాదులను, సమస్యలను పరిష్కరించేందుకు ఒక సమర్థమైన, కట్టుదిట్టమైన, కేంద్రీకృత వ్యవస్థ ఉన్నపుడే BBPS బ్రాండ్ వినియోగదారుల విశ్వాసాన్ని నమ్మకాన్ని చూరగొంటుంది. దీనిలో BBPCU, BBPOU ల పాత్ర ఈ క్రింది విధంగా ఉంటటుంది. ఎ. అన్ని ON-US మరియు OFF-US లావాదేవీల కొరకు ఒక కేంద్రీకృత ఎండ్-టు-ఎండ్ ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయడం బి. కేంద్రీకృత ఎండ్-టు-ఎండ్ ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసే వరకు, ప్రారంభంలో, BBPS ఎండ్-కన్జూమర్లు (ఎవరైనా బిల్లర్ కు వ్యతిరేకంగా) కనీసం సెంట్రలైజ్డ్ టికెటింగ్/ఫిర్యాదులు చేయడం కోసం ఏదైనా BBPS పాయింట్ల వద్ద తగిన ఏర్పాటు చేస్తుంది - సమస్య తుది పరిష్కారం సంబంధిత బిల్లర్లు/BBPOU లు చూసుకున్నప్పటికీ. సి. ప్రతి ఫిర్యాదుకు ఒక ప్రత్యేక ఫిర్యాదు రెఫరెన్స్ నెంబర్ ను కేటాయించి, BBPS లో ఆ నెంబర్ ద్వారా దానిని గుర్తిస్తారు. డి. ఎక్కడైనా పిర్యాదు చేసినట్లయితే, ఆ BBPCU మరియు/లేదా సంబంధిత BBPOU ఆ ఫిర్యాదు పరిష్కారం కోసం దానిని సంబంధిత బిల్లర్‌కు పంపడం జరుగుతుంది. ఇ. ఖాతాదారుడు ఎక్కడ ఉన్నా, తన ఫిర్యాదు ఏ దశలో ఉన్నది తెలుసుకొనేందుకు ఒక ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు (ప్రత్యేక ఫిర్యాదు రెఫరెన్స్ నెంబర్ ఆధారంగా). ఎఫ్. BBPS లో ఫిర్యాదు చేసినందుకు ఖాతాదారుని నుంచి ఎలాంటి రుసుమూ వసూలు చేయరాదు. 32. ఏకీకృత టర్న్ అరౌండ్ టైమ్ తో పాటు స్టాండర్డైజ్డ్ నియమనిబంధనలను రూపొందించి, వాటిని BBPS వ్యవస్థలో తలెత్తే అన్ని వివాదాల పరిష్కారానికి వర్తింపజేస్తారు. భాగస్వాములు ఈ ప్రమాణాలకు కట్టుబడి ఉండడానికి వ్యవస్థలోనికి తగిన సర్వీస్ లెవల్ ఒప్పందాల(SLA)ను ప్రవేశపెట్టవచ్చు. 33. BBPS ను వేగవంతంగా అమలు చేయడానికి, పని చేసేలా చేయడానికి, ఈ మధ్య కాలంలో, సంబంధిత బిల్లర్లు ప్రస్తుత ఏర్పాట్లకు అనుగుణంగా తమ ఆపరేటింగ్ యూనిట్ల ద్వారా ఫిర్యాదులను పరిష్కరిస్తారు. 34. BBPS లోని భాగస్వాములంతా వాటికి ముందే ఆదేశించిన విధంగా ఖాతాదారుల ఫిర్యాదులపై తగిన ఫార్మాట్ లో, తగిన సమయంలో నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. పాత్రలు, బాధ్యతలు 35. BBPS లోని భాగస్వాములంతా ఈ అంతర-నిర్వాహక బిల్ పేమెంట్ వ్యవస్థ ఎలాంటి అవాంతరాలూ లేకుండా పని చేసేందుకుఒక క్రమబద్ధమైన ప్రమాణాలు, విధానాలకు లోబడి పని చేయాలి. తదనుగుణంగా BBPCUలు, BBPOUల పాత్రను, బాధ్యతలను ఈ క్రింద పేర్కొనడం జరిగింది. వివిధ సిస్టమ్ భాగస్వాముల యొక్క నిర్దిష్ట పాత్రలు, బాధ్యతల గురించి BBPS యొక్క ప్రొసీజరల్ మార్గదర్శకాలు మరింత వివరంగా తెలియజేస్తాయి. 36. బిల్ పేమెంట్ వ్యవస్థ అభివృద్ధి మరియు దానిలో ప్రమాణాల అమలు కోసం భాగస్వామ్య నిర్ణయాధికారాన్ని ప్రోత్సహించేందుకు BBPS ఒక స్టీరింగ్ గ్రూప్ ను కలిగి ఉండాలి. 37. భారత్ బిల్ పేమెంట్ సెంట్రల్ యూనిట్ (BBPCU) పాత్ర మరియు బాధ్యతలు ఎ. BBPCU ఈ క్రింది అంశాలలో ప్రమాణాలు నెలకొల్పేందుకు బాధ్యత వహిస్తుంది - (i) వ్యాపార ప్రమాణాలు, PSS చట్టం కింద BBPOU ల పరిధిలోకి వచ్చేందుకు నిబందధనలు, విధానాలు: వాటిలో మల్టిపుల్ బిల్లర్లు మరియు BBPOU ల సంబంధం కూడా ఉంటుంది. (ii) BBPCU మరియు BBPOUల స్థాయిలో వివిధ వ్యాపార/సాంకేతిక/నిర్వాహక అవసరాల కోసం కావాల్సిన విధానాలు, పద్ధతులు, ఏజెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కూడా దీని కిందకే వస్తుంది. (iii) భద్రతా ప్రమాణాలతో పాటు సమాచార మార్పిడి ప్రమాణాలు మరియు (iv) రిస్కులను తగ్గించడం బి. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ మార్కెటింగ్ మరియు బ్రాండ్ పొజిషనింగ్ కు, దానిలో జరిగే పొరబాట్లకు, BBPOUల కార్యకలాపాల నిర్వహణ సర్టిఫికేషన్ కు BBPCU బాధ్యత వహిస్తుంది. సి. వివిధ BBPOU లు మరియు వారి ఏజెంట్ల వద్ద - ON-US మరియు OFF-US కార్యకలాపాలు రెండింటిలో కూడా - చెల్లింపులు, క్లియరింగ్ మరియు సెటిల్మెంట్ కు సంబంధించిన అంశాల విషయంలో ప్రమాణాలు నెలకొల్పేందుకు BBPCU బాధ్యత వహిస్తుంది. డి. సిస్టమ్ భాగస్వాముల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి BBPCU ఒక వివాద పరిష్కార వ్యవస్థను నెలకొల్పుతుంది. ఇ. BBPSలో ఒక ఫ్రాడ్ అండ్ రిస్క్ మేనేజ్ మెంట్ వ్యవస్థ నెలకొల్పేందుకు BBPCU తగిన ఏర్పాట్లు చేయాలి. ఎఫ్. తగిన MIS వ్యవస్థను నెలకొల్పాలి. 38. భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ల (BBPOU) పాత్ర మరియు బాధ్యతలు ఎ. ప్రమాణాలు/నియమాలకు అనుగుణంగా బిల్లర్లు, అగ్రిగేటర్లను వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడం; తగిన జాగ్రత్తలు తీసుకోవడం (సబ్ ఏజెంట్ల నియామాకం కొరకు రూపొందించిన విధానాలు, నియమాలకు అనుగుణంగా); గోప్యత, విశ్వసనీయత ప్రమాణాలు పాటించేలా చూడడం. బి. మౌలిక సదుపాయాల అభివృద్ధి - సంబంధిత BBPOUల ద్వారా BBPCU నెలకొల్పిన ప్రమాణాలను పాటిస్తూ అప్లికేషన్ డెవలప్ మెంట్, అవసరమైన చోట APIలతో కలిపి. సి. లావాదేవీల నిర్వహణ - సురక్షిత లావాదేవీలు, వాటి భద్రత, బిల్లర్ సమాచారం నిర్ధారణ, BBPCU నెలకొల్పిన ప్రమాణాలు/నియమాలకు అనుగుణంగా లావాదేవీల నిర్వహణ. డి. బిల్లర్లు/ఏజెంట్లు/ఎండ్ కస్టమర్లకు నిర్దేశించిన విధానాలు, ప్రమాణాలకు అనుగుణంగా ఖాతాదారుల వివాదాలను, ఫిర్యాదులను పరిష్కరించడం. ఇ. విలువ-ఆధారిత సేవలు – MIS ఏర్పాటు, రిపోర్టింగ్ మరియు బిల్లర్లు/ అగ్రిగేటర్లు /ఏజెంట్లకు ఇతర సేవలు BBPS ప్రమాణాలు RBI ఎప్పటికప్పుడు జారీ చేసే రెగ్యులేటరీ మార్గదర్శకాలకు లోబడి ఉండాలి. |