<font face="mangal" size="3">మీ వినియోగదారుని తెలుసుకోండి (Know Your Customer, K Y C) మార్గదర్ - ఆర్బిఐ - Reserve Bank of India
మీ వినియోగదారుని తెలుసుకోండి (Know Your Customer, K Y C) మార్గదర్శకాలు, 2016 – సమగ్ర మార్గదర్శకాలు
RBI/DBR/2015-16/18 ఫిబ్రవరి 25, 2016 మీ వినియోగదారుని తెలుసుకోండి (Know Your Customer, K Y C) మార్గదర్శకాలు, 2016 – సమగ్ర మార్గదర్శకాలు ప్రివెన్షన్ ఆఫ్ మనీ-లాండరింగ్ చట్టం, 2002 (పి ఎమ్ ఎల్, PML మరియు ప్రివెన్షన్ ఆఫ్ మనీ-లాండరింగ్ (మైంటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్) నిబంధనలు, 2005 అనుసారం, నియంత్రిత సంస్థలు (రెగ్యులేటెడ్ ఎంటిటీస్, ఆర్ ఇలు, R Es) ఏదేని లావాదేవీ జరిపేముందు, ఖాతా సంబంధిత లేక ఇతర విధానాలద్వారా, వినియోగదారుని గుర్తించుటకొరకు కొన్ని చర్యలు చేపట్టి, వారి లావాదేవీలను పరిశీలిస్తూ ఉండవలెను. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం, 2002 మరియు ప్రివెన్షన్ ఆఫ్ మనీ-లాండరింగ్ (మైంటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్) నిబంధనలు, 2005 లోని అంశాలు, ఎప్పటికప్పుడు సవరించిన విధంగా, అమలు పరుచుటకు అవసరమైన అన్ని చర్యలు (అట్టి సవరణల అమలుకు జారీచేసిన కార్యాచరణ ఆదేశాలతో సహా), చేపట్టవలెను. PML రూల్స్‌లో, గజెట్ నోటిఫికేషన్ GSR 538 E జూన్ 1, 2017 ద్వారా మరియు ఆతదుపరి చేసిన సవరణలకు అనుసారంగా ఈసమగ్ర మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. [జస్టిస్ కె ఎస్ పుట్టస్వామి (విశ్రాంత) మరియు మరొకరు Vs. యూనియన్ ఆఫ్ ఇండియా, డబ్ల్యు. పి (సివిల్) 494 / 2012 మొ. ఆధార్ కేసులలో, మాననీయ ఉన్నత న్యాయస్థానం తీర్పుకులోబడి] 2. తదనుసారంగా, సెక్షన్ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 మరియు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, (సహకార సంఘాలకు వర్తించేమేరకు) (అందులోని సెక్షన్ 56 తోసహా) తమకు దఖలుపరచబడిన అధికారాలతో; మరియు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (మైంటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్) నిబంధనలు 2005, నిబంధన 9 (14) క్రింద రిజర్వ్ బ్యాంక్ ఈ క్రింద నిర్దేశించిన మార్గదర్శకాలు, ప్రజాహితం దృష్ట్యా జారీ చేయుట అవసరమని తలచిన కారణంగా, ఇందుమూలముగా జారీచేసినది. (డి. దీప్తివిలాస) |