<font face="mangal" size="3">తక్షణ దిద్దుబాటు చర్య (ప్రాంప్ట్ కరెక్టివ్  - ఆర్బిఐ - Reserve Bank of India
తక్షణ దిద్దుబాటు చర్య (ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్- పిసిఎ) క్రింద వున్న బ్యాంకుల ఫై
భారతీయ రిజర్వు బ్యాంకు వివరణ
డిసెంబర్ 22, 2017 తక్షణ దిద్దుబాటు చర్య (ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్- పిసిఎ) క్రింద వున్న బ్యాంకుల ఫై తక్షణ దిద్దుబాటు చర్య (ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్- పిసిఎ) ఫ్రేంవర్క్ క్రింద కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఫై భారతీయ రిజర్వు బ్యాంకు చర్య తీసుకోవడం ఫై, అట్టి బ్యాంకులు మూసివేస్తారని మీడియాలో కొన్ని విభాగాలలో, సోషల్ మీడియాతో సహా, సమాచారాన్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రయత్నం జరుగుతోందని భారతీయ రిజర్వు బ్యాంకు దృష్టికి వచ్చింది. ఈ సందర్భంలో క్రింద ఇచ్చిన విధంగా జూన్ 5, 2017 న జారీ చేయబడిన పత్రికా ప్రకటన వైపు దృష్టిని ఆకర్షించడం జరుగుతోంది: “తక్షణ దిద్దుబాటు చర్య (ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్- పిసిఎ) సాధారణ ప్రజల కోసం బ్యాంకుల సాధారణ కార్యకలాపాలను నిరోధించేందుకు ఉద్దేశించబడింది కాదని భారతీయ రిజర్వు బ్యాంకు స్పష్టం చేస్తుంది. భారతీయ రిజర్వు బ్యాంకు దాని పర్యవేక్షణా ప్రణాళిక క్రింద, బ్యాంకుల మెరుగైన ఆర్థిక స్థితి కాపాడటానికి వివిధ చర్యలు/ఉపకరణాలను ఉపయోగిస్తుందని మరింత స్పష్టం చేస్తుంది. పిసిఎ ఫ్రేంవర్క్ అటువంటి పర్యవేక్షక సాధనాల్లో ఒకటి. ఏదేని ఉల్లంఘన జరిగినప్పుడు, ఇది ముందస్తు హెచ్చరికలతో సంకేతాలు అందిస్తూ, బ్యాంకుల యొక్క మూలధనం, మరియు ఆస్తి నాణ్యత మొదలైన వాటికి సంబంధించి కొన్ని పనితీరు సూచికలను పర్యవేక్షిస్తుంది. భారతీయ రిజర్వు బ్యాంకు సూచించిన వాటితో సహా, సరిదిద్దే చర్యలు తీసుకునేందుకు బ్యాంకులు సమయానుసారంగా తమ మెరుగైన ఆర్థిక స్థితి కాపాడుకోవడానికి/ పునరుద్ధరించడానికి సులభతరం చేయడం పిసిఎ ఫ్రేంవర్క్ ఉద్దేశ్యం. ఆ విషయాల్లో నిర్వహణ మరింత సన్నిహితంగా ఉండడం ద్వారా, ఇటువంటి బ్యాంకులపై దృష్టి కేంద్రీకరించడానికి రిజర్వు బ్యాంకుకు ఈ ఫ్రేంవర్క్ అవకాశం కల్పిస్తుంది. పిసిఎ ఫ్రేంవర్క్, బ్యాంకులు కొన్ని ప్రమాదకర కార్యకలాపాలను విడిచిపెట్టి, మూలధన పరిరక్షణ ఫై దృష్టి పెట్టడానికి ఉద్దేశించబడింది, తద్వారా వారి ఆస్థి అప్పుల పట్టికలు (బ్యాలెన్స్ షీట్లు) మరింత బలపడతాయి. డిసెంబరు 2002 నుండి పిసిఎ ఫ్రేంవర్క్ అమలులో ఉందని భారతీయ రిజర్వు బ్యాంకు నొక్కి చెప్పింది మరియు ఏప్రిల్ 13, 2017 న జారీ చేయబడిన మార్గదర్శకాలు మునుపటి ఫ్రేంవర్క్ యొక్క సవరించిన సంస్కరణ మాత్రమే." పైన పేర్కొన్న స్థితిని భారతీయ రిజర్వు బ్యాంకు పునరుద్ఘాటిస్తుంది. జోస్ జె. కట్టూర్ పత్రికా ప్రకటన: 2017-2018/1719 |