<font face="mangal" size="3">ప్ర‌స్తుత రూ.500 మ‌రియు రూ.1000 బ్యాంకు నోట్ల చ‌ట్ట&zwnj - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 బ్యాంకు నోట్ల చట్టబద్ధ చలామణి రద్దు
RBI/2016-17/112 నవంబర్ 08, 2016 ద ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డియర్ సర్, ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 బ్యాంకు నోట్ల చట్టబద్ధ చలామణి రద్దు భారత ప్రభుత్వం నవంబర్ 08, 2016న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ నెం.2652కు సంబంధించి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన ప్రస్తుత సిరీస్ లోని రూ.500 మరియు రూ.1000 విలువ కలిగిన బ్యాంకు నోట్లు (ఇకపై వాటిని స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లు అని పేర్కొనడం జరుగుతుంది) నోటిఫికేషన్ లో ప్రకటించిన మేరకు నవంబర్ 09, 2016 నుంచి చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే లక్షణాన్ని కోల్పోతాయి. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ అని పిలిచే విభిన్నమైన పరిమాణం, డిజైన్ కలిగి, మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, సాంకేతిక ప్రగతిని ఎత్తి చూపే కొత్త సిరీస్ బ్యాంకు నోట్లు జారీ చేయబడతాయి. ప్రజలు మరియు ఇతర సంస్థలు డిసెంబర్ 30, 2016 వరకు (ఆ రోజుతో కలిపి) స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను ఇతర విలువ కలిగిన నోట్లతో మార్చుకోవడానికి లేదా తమ అకౌంట్లలో ఆ స్పెసిఫైడ్ బ్యాంకునోట్లను జమ చేయడానికి బ్యాంకు శాఖలు ప్రాథమిక సంస్థలుగా వ్యవహరిస్తాయి. అందువల్ల బ్యాంకులు ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. ప్రజలు మరియు ఇతర సంస్థలు ప్రస్తుతం తమ వద్ద అందుబాటులో ఉన్న రూ.500. రూ.1000 నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులు ఈ క్రింది ఏర్పాట్లను చేయడం జరిగింది. 2. నవంబర్ 09, 2016న తీసుకోవాల్సిన చర్యలు: (i) నవంబర్ 09, 2016 (బుధవారం) అన్ని బ్యాంకులూ ఎలాంటి వ్యాపార లావాదేవీలూ నిర్వహించవు. అయితే బ్యాంకుల శాఖలు ఆ రోజున సర్క్యులర్ ప్రకారం ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటాయి. (ii) ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు, క్యాష్ రీసైక్లర్లు, కాయిన్ వెండింగ్ మెషీన్లు లేదా ఇతర నగదు పంపిణీ చేసే/స్వీకరించే మెషీన్లు, బ్యాంకుకు అనుబంధంగా ఉన్న CIT కంపెనీలు, మరియు బిజినెస్ కరస్పాండెంట్ల వద్ద ఉన్న స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను వెంటనే వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను వైట్ లేబుల్ ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే బాధ్యతను వాటిని స్పాన్సర్ చేస్తున్న బ్యాంకుల మీద ఉంటుంది. (iii) బ్యాంకులు నవంబర్ 09, 2016 నుంచి తమ శాఖలు, బిజినెస్ కరస్పాండెంట్స్ ద్వారా స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాలి. (iv) అన్ని ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు, క్యాష్ రీసైక్లర్లు లేదా నగదును పంపిణీ చేసే/స్వీకరించే మెషీన్లను నవంబర్ 09, 10 తేదీలలో మూసి ఉంచుతారు. (v) నవంబర్ 11, 2016న ఆ మెషీన్లను తిరిగి రీయాక్టివేట్ చేసే లోపుగా అవి రూ.100 మరియు రూ.50 విలువ కలిగిన నోట్లను పంపిణీ చేసే విధంగా వాటిని కాన్ఫిగర్ చేస్తారు. అయితే బ్యాంకులు మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ నోట్లను తమ కౌంటర్ల ద్వారా నవంబర్ 09, 2016 నుంచి జారీ చేసినా, వాటిని ఏటీఎంలు, ఇతర నగదు పంపిణీ మెషీన్ల ద్వారా జారీ చేసే విషయంలో మాత్రం భారత రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రత్యేక ఆదేశాల కోసం వేచి చూడాలి. (vi) బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లో పేర్కొన్న ప్రతి బ్యాంకింగ్ కంపెనీ మరియు ట్రెజరీ నవంబర్ 08, 2016 వ్యాపార లావాదేవీలు ముగిసే సమయం నాటికి తమ వద్ద ఉన్న స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల వివరాలను నవంబర్ 10, 2016 13:00 గంటలలోపు తమ బ్యాంకు హెడ్ ఆఫీస్ ఏ జ్యూరిస్ డిక్షన్ కిందకు వస్తుందో, సంబంధిత భారత రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి Annex-1 లో పేర్కొన్న ఫార్మాట్ లో పూర్తి చేసి దానిని ఫార్వార్డ్ చేయాల్సి ఉంటుంది. దానిలో ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు, క్యాష్ రీసైక్లర్లు, కాయిన్ వెండింగ్ మెషీన్లు, CIT కంపెనీలు, బిజినెస్ కరస్పాండెంట్లు మొదలైన వారి నుంచి వెనక్కి తీసుకున్న స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల వివరాలు ఉండాలి. (vii) బ్యాంకు శాఖలు ఈ స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను వెంటనే సంబంధిత కరెన్సీ ఛెస్ట్/RBIలోని తమ అకౌంట్లో జమ అయ్యేలా ఏర్పాటు చేసి, ఆ సొమ్ము తమ అకౌంట్లో క్రెడిట్ అయ్యేలా చూసుకోవాలి. (viii) శాఖలు తమ నగదు అవసరాలు అంచనా వేసి, సంబంధిత కరెన్సీ ఛెస్ట్/RBI నుంచి దానికి సమానమైన విలువ కలిగిన చెల్లుబాటయ్యే నోట్లను తీసుకోవాలి. (ix) క్యాష్ డిపాజిట్ మెషీన్లు/క్యాష్ రీసైక్లర్లు స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను డిసెంబర్ 30, 2016 వరకు స్వీకరించాలి. (x) స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల చలామణి రద్దుకు సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైన సమాచారాన్ని (Annex-2 కు అనుగుణంగా) మరియు మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ బ్యాంకు నోట్ల (Annex-3) లోని ముఖ్య లక్షణాలను తగిన సంఖ్యలో ముద్రించి/కాపీ చేసి వాటిని ప్రజలకు పంపిణీ చేయడం/బ్యాంకు పరిసరాల్లో/ఏఎటీఎం కియోస్కుల వద్ద ప్రదర్శించడం చేయాలి. (xi) బ్యాంకులు ఎక్స్ ఛేంజ్ కౌంటర్లను నిర్వహించేందుకు తగిన సిబ్బందిని గుర్తించి, ఈ పథకం గురించి వారికి, అనుసరించాల్సిన పద్ధతుల గురించి సంక్షిప్తంగా వివరించాలి. ఎక్స్ ఛేంజ్ కౌంటర్లను నిర్వహించే సిబ్బందికి Annex-4 లో ఉన్న తరచుగా అడిగే ప్రశ్నల (FAQ) కాపీని అందజేయాలి. (xii) పని భారాన్ని తట్టుకునేందుకు, నకిలీ నోట్లను గుర్తించేందుకు బ్యాంకులు తగిన సంఖ్యలో నోట్ కౌంటింగ్ మెషీన్లు, UV ల్యాంపులు, నోట్ సార్టింగ్ మెషీన్లు మొదలైన వాటిని కౌంటర్ల వద్ద ఏర్పాటు చేయాలి. మేము గతంలో అక్టోబర్ 27, 2016న జారీ చేసిన సర్క్యులర్ నెం. DCM (FNVD) No.1134/16.01.05/2016-17లో సూచించినట్లుగా, బ్యాంకింగ్ హాల్, బహిరంగ ప్రదేశాలు మరియు కౌంటర్లు సీసీటీవీల నిఘాలో ఉండాలి. వాటి రికార్డింగ్లను భద్రపరచాలి. 3. నవంబర్ 10, 2016న తీసుకోవాల్సిన చర్యలు a. బ్యాంకు శాఖలు నవంబర్ 10, 2016న తమ సాధారణ లావాదేవీలను నిర్వహిస్తాయి. b. బ్యాంకులు స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల మార్పిడికి/డిపాజిట్లకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. ప్రజల నుంచి వచ్చే డిమాండ్ ను తట్టుకోవడానికి అవసరమైతే అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసి, పని గంటలను పెంచాలి. ఇందుకోసం వీలైనంత మంది ఎక్కువ సిబ్బందిని కేటాయించాలి. వీలైతే అదనపు పని భారాన్ని తట్టుకోవడానికి బ్యాంకులు రిటైరైన బ్యాంకు సిబ్బందిని కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా నియమించుకునే అవకాశాలను పరిశీలించాలి. c. మార్పిడి సదుపాయం పేరా1లోని సబ్ పేరా (1)లో పేర్కొన్నట్లుగా బ్యాంకింగ్ కంపెనీ లేదా ప్రభుత్వ ఖజానా కాకుండా ఏ వ్యక్తి వద్ద అయినా ఉన్న స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను రిజర్వ్ బ్యాంకు యొక్క ఏ కార్యాలయంలోనైనా లేదా ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు, ప్రైవేట్ రంగ బ్యాంకు, విదేశీ బ్యాంకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు, పట్టణ సహకార బ్యాంకులు/ రాష్ట్ర సహకార బ్యాంకులకు చెందిన శాఖలలో నైనా డిసెంబర్ 30, 2016 (ఆ తేదీతో కలిపి) వరకు, ఈ క్రింది పరిమితులకు లోబడి, మార్చుకోవచ్చు: (i) మొత్తం రూ.4000 వరకు లేదా అంతకన్నా తక్కువ విలువ కలిగిన స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను గుర్తింపు ధృవపత్రం మరియు రిజర్వ్ బ్యాంకు సూచించిన నిర్ణీత ఫార్మాట్ లోని విజ్ఞాపన పత్రాన్ని సమర్పించి చట్టబద్ధమైన చలామణి కలిగిన ఇతర బ్యాంకు నోట్లతో మార్పిడి చేసుకోవచ్చు. రూ.4000 వరకు స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను మార్చుకోవచ్చన్న ఆదేశాలను ఈ నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల అనంతరం సమీక్షించి, ఆ తర్వాత తగిన ఆదేశాలను జారీ చేయడం జరుగుతుంది. (ii) నోట్లను మార్చుకునే వ్యక్తికి ఆ బ్యాంకులో అకౌంట్ ఉంటే, అలాంటి వ్యక్తులు బ్యాంకులో జమ చేసే స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల విలువ లేదా పరిమాణం విషయంలో ఎలాంటి ఆంక్షలూ ఉండవు. అయితే ఎక్కడైతే నో యువర్ కస్టమర్ (KYC) నిబంధనలు పాటించడం జరగలేదో, అక్కడ అత్యధికంగా రూ.50,000 విలువ కలిగిన స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను మాత్రమే జమ చేయగలిగే అవకాశం ఉంటుంది. (iii) ఎవరైనా వ్యక్తులు ప్రామాణిత బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం మరియు తగిన గుర్తింపు ధృవపత్రం సమర్పించిన మీదట స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను తమకు అకౌంట్ ఉన్న ఏ బ్యాంకులోనైనా జమ చేసినప్పుడు వాటితో సమానమైన విలువ కలిగిన నగదును వారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. (iv) ఎవరైనా వ్యక్తులు Annex-5 లోని బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం మరియు తగిన గుర్తింపు ధృవపత్రం సమర్పించిన మీదట స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను తమకు అకౌంట్ ఉన్న ఏ బ్యాంకులోనైనా జమ చేసి, బ్యాంకుకు నిర్దిష్ట థర్డ్ పార్టీ ఆథరైజేషన్ ను అందజేస్తే, వాటితో సమానమైన విలువ కలిగిన నగదును ఆ థర్డ్ పార్టీ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. (v) నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నవంబర్ 24, 2016 బ్యాంకు లావాదేవీల సమయం ముగిసేవరకు కౌంటర్ ద్వారా నగదు విత్ డ్రాను రోజుకు రూ.10,000కు, మొత్తం వారంలో రూ, 20,000కు మించకుండా, పరిమితం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ పరిమితిని సమీక్షించండం జరుగుతుంది. (vi) ఒక వ్యక్తి యొక్క అకౌంట్ నుంచి చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, మొబైల్ వాలెట్, ఎలెక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ లాంటి ఇతర పద్ధతుల వినియోగంపై మాత్రం ఎలాంటి ఆంక్షలూ ఉండవు. (vii) ఆటోమాటిక్ టెల్లర్ మెషీన్స్ (ఇకపై వాటిని ఏటీఎంలని వ్యవహరించడం జరుగుతుంది) నుంచి నగదు ఉపసంహరణను నవంబర్ 18, 2016 వరకు కార్డుకు, రోజుకు రూ.2000గా పరిమితి విధించడం జరిగింది. ఆ పరిమితిని నవంబర్ 19, 2016 నుండి కార్డుకు రోజుకు రూ.4000కు పెంచడం జరుగుతుంది. (viii) ఎవరైనా వ్యక్తులు డిసెంబర్ 30, 2016లోగా స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను తమ బ్యాంకు అకౌంట్లలో జమ చేయలేకపోయినట్లయితే, వారికి నిర్దిష్ట రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల వద్ద లేదా RBI ప్రకటించే ఏ ఇతర కార్యాలయం వద్దనైనా జమ చేసే అవకాశం కల్పించబడుతుంది. (ix) బ్యాంకు శాఖల విషయంలో బిజినెస్ కరస్పాండెంట్లు (BCలు) కూడా సరైన గుర్తింపు ధృవపత్రం మరియు విజ్ఞాపన పత్రం సమర్పించిన పిమ్మట, ప్రతి ఒక్కరూ రూ.4000 వరకు స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను మార్చుకునే అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం బ్యాంకులు తమ విచక్షణాధికారం మేరకు BCలు తమ వద్ద నగదును ఉంచుకునే అవకాశాన్ని కనీసం డిసెంబర్ 30, 2016 వరకు పొడిగించాలి. (x) స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను జన్ ధన్ యోజన అకౌంట్లలో జమ చేసే విషయంలో. అవసరమైన మార్పులతో. సాధారణ పరిమితులు వర్తిస్తాయి. 4. నివేదికా వ్యవస్థ రూ.500, రూ.1000 విలువ కలిగిన స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను మార్చుకునే ప్రతి బ్యాంకు శాఖ నవంబర్ 10, 2016 నుంచి ఈ పథకం ముగిసే డిసెంబర్ 30, 2016 (లేదా RBI ఆ తర్వాత ప్రకటించే ఇతర ఏ గడువు లోపు అయినా) వరకు ఈ మెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా ప్రతి రోజు తమ వ్యాపార లావాదేవీలు ముగిసిన పిమ్మట తమ కంట్రోల్ ఆఫీస్ కు Annex-6 లో సూచించినట్లుగా అవి మార్పిడి చేసుకున్న స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలి. సంబంధిత కంట్రోల్ ఆఫీసర్లు Annex-6A ప్రకారం వాటిని క్రోడీకరించి, RBI సెంట్రల్ ఆఫీసు కరెన్సీ నిర్వహణా విభాగానికి రోజువారీగా ఈమెయిల్ ద్వారా నివేదిస్తారు. 5. పైన పేర్కొన్న పథకం, దానిలో పేర్కొన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరుతూ బ్యాంకులు తమ శాఖలకు సవివరమైన సూచనలను జారీ చేయవచ్చు. శాఖస్థాయిలోని సిబ్బంది, మరీ ముఖ్యంగా టెల్లర్లకు దీనిపై బాగా అవగాహన కల్పించాలి. ఇందుకోసం మా వెబ్ సైట్ (www.rbi.org.in) మరియు భారత ప్రభుత్వ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. సిబ్బంది తరచుగా అడిగే ప్రశ్నల (FAQ)పై కూడా అవగాహన పెంచుకోవాలి (Annex-4 లో సూచించినట్లుగా) 6. బ్యాంకులు సమాచార వివరాల (Annex-2, Annex-3 మరియు Annex-4 లో అందుబాటులో ఉన్న) కాపీలను ప్రజలకు విస్తృతంగా పంపిణీ చేయాలి. 7. బ్యాంకులు పై పథకంపై BCలు, ఏటీఎం స్విచ్ ఆపరేటర్లు, CIT కంపెనీలకు వాటికి సంబంధించిన అంశాలపై సూచనలు చేయాలి. 8. ఈ పథకం అమలును బ్యాంకులు రోజువారీ పద్ధతిన నోడల్ అధికారిగా వ్యవహరించే జనరల్ మేనేజర్ స్థాయికి తక్కువ కాని అధికారి పర్యవేక్షణలో ఏర్పాటు చేసే మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షించాలి. ఆ నోడల్ అధికారి కాంటాక్ట్ వివరాలను సంబంధిత RBI ప్రాంతీయ కార్యాలయానికి (RBI సెంట్రల్ ఆఫీస్, ముంబైకు ఒక కాపీ పంపుతూ) కింద సూచించినట్లుగా ఈ మెయిల్ ద్వారా పంపాలి. 9. RBI తన సెంట్రల్ ఆఫీస్ లో ఈ పథకాన్ని పర్యవేక్షించడానికి మరియు బ్యాంకులకు, ప్రజలకు సూచనలు అందించడానికి ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. ఆ కంట్రోల్ రూం యొక్క ఈ మెయిల్ ఐడీ మరియు ఫోన్ నెంబర్లను ఈ క్రింద ఇవ్వడం జరిగింది. Email. 10. దయచేసి అందుకున్నట్లుగా తెలుపగలరు. మీ విశ్వసనీయులు (P. విజయ్ కుమార్) Encl: పైన పేర్కొన్నవి |