సీనియర్ సిటిజన్స్ కోసం సౌకర్యాలపై IVRలు - ఆర్బిఐ - Reserve Bank of India
జ్యేష్ఠ పౌరుల కొరకు సౌకర్యాలపై ఐవీఆర్‌ఎస్
మీరు 70 ఏళ్ళువయసు మించిన వారయితే, మీరు కొన్ని ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలు మీ ఇంటి నుంచే చేయవచ్చని మీకు తెలుసా? బ్యాంక్, మీ ఇంటి నుంచి క్యాష్ లేదా చెక్ తీసుకువెళ్ళే ఏర్పాటు చేసి మీకు రసీదు ఇస్తుంది. మీ ఖాతా నుంచి విత్‌డ్రా చేసిన నగదు లేదా మీ ఖాతా నుంచి డ్రా చేసిన డిమాండ్ డ్రాఫ్ట్ కూడా తెచ్చి ఇస్తుంది. అన్నిటి కన్నా ముఖ్యమైన విషయం, మీరు మీ ఇంట్లో నుండే మీ కేవైసీ పత్రాలు ఇంకా లైఫ్ సర్టిఫికేట్ కూడా బ్యాంక్‌లో దాఖలు చేయవచ్చు. బ్యాంక్ ఈ సేవకి, వారి బోర్డ్ అంగీకరించిన పాలసీ ఆధారంగా రుసుము వసూలుచేయవచ్చు. అయితే, జ్యేష్ఠ పౌరులకు కొన్ని ఇతర సౌకర్యాలు ఉచితంగా అందించమని కూడా బ్యాంకులకు సూచన ఇవ్వబడింది. జ్యేష్ట పౌరులకు బ్యాంకింగ్ సౌకర్యాలపై బ్యాంకులకు ఆర్‌బీఐ జారీచేసిన సూచనల గురించి మరిన్ని వివరాలకు, www.rbi.org.in/seniorcitizens సందర్శించండి.
ఆడియో
జ్యేష్ఠ పౌరులపై ఎస్‌ఎంఎస్ వినడానికి క్లిక్ చేయండి (తెలుగు/హిందీ భాష)
జ్యేష్ఠ పౌరులపై ఎస్‌ఎంఎస్ వినడానికి క్లిక్ చేయండి (ఆంగ్ల భాష)
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai@rbi.org.in వద్ద మాకు వ్రాయండి