మోసం ఇమెయిల్స్, కాల్స్ మరియు ఎస్ఎంఎస్ లు - ఆర్బిఐ - Reserve Bank of India
ఓవర్‌వ్యూ
ఓవర్‌వ్యూ
అధిక మొత్తం లో డబ్బు ఇస్తామని ఇ మెయిల్, కాల్స్ మరియు సందేశాలద్వారా చేసే వాగ్దానాలు మోసపూరితమైనవి. మీరు చెమటోడ్చి సంపాదించిన సొమ్ము నష్టపోకండి.
- మీ కార్డు బ్లాక్ చేయబడిందని లేదా మీకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెబుతామంటూ ఆర్.బి.ఐ, ఆర్.బి.ఐ మరియు/లేదా ఏదైనా ఇతర అధికారి పేరుతో వచ్చే ఎస్ఎంఎస్, ఫోన్, ఈమెయిల్ కి మోసపోకండి.
- తెలిసిన లేదా తెలియని సంస్థల నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బు అందుతుందనే ఆశతో, ప్రారంభ డిపాజిట్, కమిషన్ లేదా ట్రాన్స్ఫర్ ఫీజుగా ఎవ్వరికీ డబ్బు పంపకండి.
- ఆర్.బి.ఐ వ్యక్తులపేరుతో అకౌంట్ తెరవదు లేదా క్రెడిట్/ డెబిట్ కార్డ్లు జారీచేయదు
- మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి, పాస్ వర్డ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నంబరు, సివివి, ఎటిఎం పిన్ లేదా ఒటిపిని ఎవ్వరికీ * వెల్లడించకండి. ఆర్.బి.ఐ లేదా మీ బ్యాంక్ ఎప్పుడూ వీటిని అడగదు.
- ఎస్ఎంఎస్/ఈమెయిల్ లో ఇచ్చిన లింకులపై క్లిక్ చేయడం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎవ్వరికీ ఇవ్వకండి. మీ బ్యాంక్ యొక్క అధికారిక సైట్లో లేదా మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వెనుక ఇచ్చిన సమాచారంపై మాత్రమే ఆధారపడండి.
- మీరు విదేశాల నుండి లేదా భారతదేశంలో నుండి చవకైన నిధుల యొక్క ఏవైనా ఆఫర్లను అందుకుంటే, మీరు స్థానిక పోలీస్, సైబర్-క్రైమ్ అథారిటీలతో లేదా sachet@rbi.org.in పై ఫిర్యాదును చేయవచ్చు
*మీరు లావాదేవీని ప్రారంభించినప్పుడు మినహా
For More Information
For More Information
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai@rbi.org.in వద్ద మాకు వ్రాయండి
బ్యాంక్ స్మార్టర్
మీ కరెన్సీని తెలుసుకోండి
మీ ఫైనాన్సులను రక్షించుకోండి
ఆర్బీఐ ని సంప్రదించండి
డిజిటల్ బ్యాంకింగ్‌కు మారండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?