కనీస బ్యాలెన్స్ లేకుండా బీఎస్‌బీడీ అకౌంట్ - ఆర్బిఐ - Reserve Bank of India
ఓవర్‌వ్యూ
ఓవర్‌వ్యూ
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్‌బీడీ) ఖాతా తెరవండి. కనీస నిల్వ అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డ్ ఇంకా ప్యాన్ కార్డు లేదా ఫార్మ్ నం. 60తో సులువగా తెరవచ్చు.
- ఏ వ్యక్తి అయినా వారి వయసు లేదా ఆదాయంతో సంబంధం లేకుండా, ‘బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్’ (బీఎస్‌బీడీఏ) తెరవవచ్చు.
- ఈ బీఎస్‌బీడీ ఖాతా ఆరంభపు డిపాజిట్ ఏమీ లేకుండా తెరవచ్చు; ఈ ఖాతాలో కనీస నిల్వ ఉంచవలసిన అవసరం లేదు.
- వినియోగదారుని అభ్యర్థనపై ఒక మామూలు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాని బీఎస్‌బీడీఏగా మార్చవచ్చు.
- బీఎస్‌బీడీ ఖాతాదారులకు ఏటీఎమ్-కమ్-డెబిట్ కార్డ్ వంటి ప్రాథమిక బ్యాంకింగ్ సదుపాయాలు ఉచితంగా అందించబడతాయి.
- బీఎస్‌బీడీ ఖాతాలోకి చేసుకోగల డిపాజిట్ల సంఖ్యకు పరిమితి లేదు.
- బీఎస్‌బీడీ ఖాతాదారులకు ఒక నెలలో ఏటీఎమ్ విత్‌డ్రాయల్స్, ఆర్‌ఉఈఎస్/ఎన్‌ఈఃటీ/క్లియరింగ్/ఇంటర్‌నెట్ డెబిట్లు/స్థాయీ ఆదేశాలు /ఈఎమ్‌ఐలు మొదలైన వాటితో కలిపి, అత్యధికంగా నాలుగు విత్‌డ్రాయల్స్ ఉచితంగా అనుమతించబడతాయి.
- బీఎస్‌బీడీ ఖాతాదారులకి అదే బ్యాంక్‌లో సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉండటానికి వీల్లేదు.
మరిన్ని వివరాల కోసం
మరిన్ని వివరాల కోసం
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai@rbi.org.in వద్ద మాకు వ్రాయండి
మీ ఫైనాన్సులను రక్షించుకోండి
డిజిటల్ బ్యాంకింగ్‌కు మారండి
మీ కరెన్సీని తెలుసుకోండి
బ్యాంక్ స్మార్టర్
ఆర్‌బీఐ ని సంప్రదించండి
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: సెప్టెంబర్ 19, 2024
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?