మీ బ్యాంక్నోట్లను తెలుసుకోండి - ఆర్బిఐ - Reserve Bank of India
ఓవర్‌వ్యూ
ఓవర్‌వ్యూ
- కరెన్సీ నోట్లు, దేశపు ఉన్నతమైన, విభిన్నమైన సంస్కృతినీ, స్వాతంత్ర్య పోరాటాన్నీ, ఒక రాజ్యంగా గర్వించదగ్గ ఘన విజయాలనీ సూచిస్తాయి.
- దేశపు సాంస్కృతిక సంపదకు మరింత చేరువగా, సాధించిన వైజ్ఞానిక పురోగతిని ప్రతిబింబించేలా కొత్త నమూనాలో ఒక కొత్త నోట్ల శ్రేణి విడుదల చేయబడుతోంది.
- ఈ కొత్త డిజైన్ బ్యాంక్ నోట్లు, ప్రస్తుతపు మహాత్మాగాంధీ బ్యాంక్ నోట్ల శ్రేణి నుండి రంగు, పరిమాణం ఇంకా ఇతివృత్తంలో స్పష్టంగా భిన్నమైనవి. కొత్త శ్రేణి నోట్ల మూల అంశం, భారత దేశపు ప్రాచీన సాంస్కృతిక కేంద్రాలు .
- దేవనాగరి లిపిలో అంకెలు మరియు స్వచ్ఛ భారత్ లోగో, ఈ నోట్లలో చేర్చిన కొన్ని క్రొత్త అంశాలు. అనేక, సంకీర్ణమైన ఆకృతుల మరియు ఆకారాల డిజైన్ అంశాలు ఈ క్రొత్త నోట్లలో ఉన్నాయి.
- ప్రస్తుతపు బ్యాంక్ నోట్ల శ్రేణిలోగల వాటర్‌మార్క్, భద్రత దారపు పోగు (సెక్యూరిటీ త్రెడ్), దాగి ఉన్న విలువ సంఖ్య, రంగు మారే సిరాతో ముద్రించిన నోటు విలువ, అంకెల పట్టిక, పారదర్శక పట్టిక, ఎలెక్ట్రోటైప్, బ్లీడ్ లైన్స్ మొదలైన భద్రత లక్షణాలు అలాగే ఉన్నా, కొత్త డిజైన్ నోట్లలో వాటి స్థానాలు మారి ఉండవచ్చు.
బ్యాంక్ నోట్లు
బొమ్మ పెద్దదిచేసి, వివరాలు నిశితంగా చూచుటకు, నోట్లపై క్లిక్ చేయండి
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai@rbi.org.in వద్ద మాకు వ్రాయండి
బ్యాంక్ స్మార్టర్
మీ కరెన్సీని తెలుసుకోండి
మీ ఫైనాన్సులను రక్షించుకోండి
ఆర్బీఐ ని సంప్రదించండి
డిజిటల్ బ్యాంకింగ్‌కు మారండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?