ఆర్.బి.ఐ హెచ్చరికలపై ఎస్ఎంఎస్
1. భారీ మొత్తాలు అందుతాయనే ఆశతో ఫీజు లేదా చార్జీలు చెల్లించకండి. ఆర్.బి.ఐ/ఆర్.బి.ఐ గవర్నర్/ప్రభుత్వం ఎప్పుడూ ఇలాంటి ఈమెయిల్/ఎస్ఎంఎస్/కాల్ పంపదు. మరిన్ని వివరాల కొరకు, +91-869-1960000 కి మిస్డ్ కాల్ ఇవ్వండి.
2. లాటరీ గెలుచుకున్నారని లేదా ఆర్.బి.ఐ/ప్రభుత్వ సంస్థ నుంచి చౌకగా ఫండ్స్ వస్తాయని మీకు ఆశచూపితే, https://sachet.rbi.org.in/Complaints/Add లో ఫిర్యాదు చేయండి.
ఆర్.బి.ఐ హెచ్చరికలపై ఒబిడి
మిమ్మల్ని మోసగించేందుకు మోసగాళ్ళు ప్రతి సారి కొత్త మార్గం లో వస్తుంటారు. మీరు లాటరీలో గెలుచుకున్న సొమ్మును క్లెయిమ్ చేయడానికి రిజర్వు బ్యాంకులో డబ్బు జమచేయవలసిందిగా కొన్నిసార్లు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు లేదా మీ కోసం వచ్చిన కొన్ని సరుకులను విడిపించుకునేందుకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించవలసిందిగా అప్పుడప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడగవచ్చు. మీకు ఇలాంటి ఆఫర్లు వస్తే, దయచేసి స్థానిక పోలీసు శాఖలోని సైబర్ క్రైమ్ బ్రాంచిలో లేదా sachet.rbi.org.in లో ఫిర్యాదు చేయండి.
ఆర్.బి.ఐ ఏం చెబుతోందో వినండి
- వ్యక్తులకు ఆర్.బి.ఐ అకౌంట్లు తెరవదు. కాబట్టి రిజర్వు బ్యాంకులో డబ్బు జమచేయడమనే ప్రశ్న తలెత్తదు. అపరిచిత వ్యక్తుల నుంచి అందే ఎస్ఎంఎస్, కాల్ లేదా ఈమెయిల్ కి మోసపోయి ఏదైనా బ్యాంక్ అకౌంటుకు డబ్బు బదిలీ చేయకండి.
- మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు లేదా సివివి, ఒటిపి లేదా పిన్ ని ఎవ్వరికీ ఇవ్వకండి. రిజర్వు బ్యాంకేకాదు, మీ బ్యాంకు కూడా ఎస్ఎంఎస్, ఫోన్ లేదా ఈమెయిల్ లో ఇలాంటి వివరాలు అడగదు.
మరింత సమాచారం కోసం rbi.org.in లో ఆర్.బి.ఐ హెచ్చరికల పేజీ చూడండి
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai[at]rbi[dot]org[dot]in వద్ద మాకు వ్రాయండి
బ్యాంక్ స్మార్టర్
మీ కరెన్సీని తెలుసుకోండి
మీ ఫైనాన్సులను రక్షించుకోండి
ఆర్బీఐ ని సంప్రదించండి
డిజిటల్ బ్యాంకింగ్‌కు మారండి
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: